Menu Close

Newchitra Mahesh

భరత్ అను నేను హిట్ అయిన తర్వాత మహర్షి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రవర్తనలో కొంచెం మార్పొచ్చిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరి హీరోల సినిమాలకు తన సపోర్ట్ ఆప్ డేట్ అందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ బాబు రీసెంట్ గా ‘అర్జున్ రెడ్డి’ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ వంగాతో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో ఇంకా తెలియాల్సి ఉంటుంది.

అయితే ‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి దర్శకుడు మహేష్ బాబుకు ఓ స్టోరీ లైన్ చెప్పడం జరిగిందని ఊహలు. అజయ్ భూపతి తో సినిమా చేయడానికి కొందరు హీరోలు సిద్ధంగానే ఉన్నారు. రీసెంట్ గా అజయ్ భూపతి.. మహేష్ బాబుని కలిసి ఓ సినిమా స్టోరీ లైన్ చెప్పాడట. టాలీవుడ్ నిర్మాత జెమిని కిరణ్ ప్రత్యేకంగా మహేష్-అజయ్ ల మీట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

కథ సిద్ధంగా కాకుండా అజయ్ భూపతి ఓ లైన్ ని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా పూర్తి కాగానే ఆ తరువాత సుకుమార్ తో ఓ సినిమా అలానే 14 రీల్స్ వారికి ఓ కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అజయ్ భూపతితో సినిమా అంటే ఎప్పట్లో ఉంటుందో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *