Menu Close

BigBoss2 Telugu Reality Television Daily Show

BigBoss2 Telugu Reality Television Daily Show

BigBoss2 Telugu Reality Television Daily Show

BigBoss2 Telugu Reality Television Daily Show బిగ్ బాస్ చిరంజీవి తెలుగు చలనచిత్రం రోజా – చిరంజీవి నటించిన చిత్రంలో పాటలు సూపర్ హిట్ చిత్రం, కానీ అనుకున్నంత ఫలితాలు రాబట్టలేకపొతే, కొంతమంది అభిమానులు సూపర్ టైటిల్ చిత్రంగా టైటిల్ కి తగ్గట్టుగా విజయవంతం కాలేదు, మంచి టైటిల్ అని విచారించిన వారు లేకపోలేదు. అయితే బిగ్ బాస్ మరలా ప్రచారంలోకి వచ్చింది అప్పుడు వెండితెరపై వెలుగు వెలిగితే తరువాత బుల్లి తెరపై వెలుగులు జిమ్మింది ఈసారి ఫలితాలు బాగా వచ్చాయి అది చలనచిత్ర రూపంలో టివి ప్రాయోజిత కార్యక్రమంగా సాధించింది టైటిల్ హిట్. వీడియోలు విశేషాలు నెట్లో అప్డేట్ అవుతూ ఉంటే, మొబైల్ ఆప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

బిగ్ బాస్ చలనచిత్రం తరువాత వచ్చిన ఆ టివి రియాల్టి ప్రాయోజితకార్యక్రమంలో యాంకర్ గా ఎన్టిఆర్ చేస్తే అది మాటివిలో ప్రసారం అయింది. ఆ సీజన్ పూర్తయ్యాక మరల నానిబిగ్ బాస్2 ప్రారంభం అయ్యింది. అందులో ప్రముఖ చిత్ర నటులు, సాంకేతిక నిపుణులు, ప్రముఖ గాయుకులు ఉన్నారు. ప్రముఖంగా చిత్రరంగంలో ఉన్నవారిని నానిబిగ్ బాస్2లో ఉన్నారు. యాంకరుగా నాచురల్ స్టార్ నాని చేస్తున్నారు.

BigBoss Daily Live Show of Famous Personalities

అసలు బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం ఏమిటి అని చూస్తే, మనం ఎప్పుడు నిత్యం మన కుటుంబ సభ్యులతో ఉంటూ ఉంటాం. అలవాటుపడిన కుటుంబ సభ్యులు కుటుంబంలో సహాచరులపై పొరపాట్లను సర్దుకుపోతూ ఉంటారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో మాత్రం పూర్తిగా కొత్తవారితో కొత్త ప్రదేశంలో కొంతకాలం కలిసి సహజీవనం చేయడం. సాదారణంగా కుటుంబ సభ్యులతో ఒక సభ్యుడు రాజీపడుతూ ఉండడమో లేకా సభ్యుడి ప్రవర్తన నచ్చక మిగిలినవారు రాజీపడి సహాజీవనం చేస్తూ ఉంటారు. అలా కుటుంబంతో రాజీపడి లేక వేరొకరితో రాజీచేయించి జీవించే వ్యక్తులు పూర్తిగా కొత్తవారితో కలిసి సహజీవనం చేస్తే ఏవిధంగా ఉంటుందో ఈ బిగ్ బాస్ ప్రాయోజితకార్యక్రమంలో కనబడుతుంది.

కుటుంబానికి పెద్ద ఉన్నట్టే ఈ బిగ్ బాస్ కార్యక్రమానికి ఒక కెప్టెన్ ఉంటాడు. కుటుంబంలో సభ్యలు తప్పుచేస్తే మందలించి వారికి బుద్ది వచ్చేవిధంగా ఎదో పని ఆ కుటుంబ పెద్ద చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా కష్టమైనా పనిచేస్తున్నప్పుడు తాను చేసిన పొరపాటు వలననే కదా ఇప్పుడీ కష్టం కాబాట్టి మరలా అటువంటి తప్పు చేయకూడదు అని. అలాగే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ప్రాయోజిత కార్యక్రమంలో అయితే కెప్టెన్ నిర్ణయాలు తీసుకుని తప్పు చేసినవారికి శిక్షణార్ధం టాస్కులు ఇస్తూ ఉంటారు. అలా తాత్కాలికంగా బిగ్ బాస్ హౌస్లో కుడా ఒకా సహాయక కెప్టెన్ ఉంటారు. వారు తక్షణ చర్యలకు బాద్యత వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎన్టిఆరుబిగ్ బాస్1లో ఈ కార్యక్రమంలో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా వారం వారం ఎలిమినేషన్ ఉంటుంది. చివరకు మిగిలిన వారు హౌస్ విజేతగా ఉంది ఎన్టిఆరుబిగ్ బాస్1 రియాలిటీ షోకి విజేతగా ఉంటారు.

సాదారణంగా సాదారణ స్థాయికన్నా పెద్దవారి జీవితంలో విశేషాలు అంటే సామాజికంగా ప్రభావితం అవుతూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. వారి నడవడిక ప్రవర్తన, చేస్తున్న పనులపై సామజిక మీడియా ఒక కన్ను వేసే ఉంటుంది. వారి యొక్క విశేషాలను వార్తలుగా మోస్తూ ఉంటుంది, సమాజంలో. మరి మన సామాజికంగా ప్రసిద్ద వ్యక్తుల జీవిత విశేషాలు, చరిత్రలో ప్రసిద్ద వ్యక్తుల గురించి సమాజంలో ఎప్పుడు ఎదో ఒక వార్తగా సమాజంలో సంచరిస్తూ ఉంటుంది.

Watching Program For Real Nature Big Personalities

అలాంటి సమాజంలో కొంతమంది కొత్త వ్యక్తులు ఒక చోట కలిసి సహాజీవనం చేస్తున్నారు అంటే మరి సమాజంలో సామజిక మీడియా పట్టి పట్టి సమాజంలో చూపుతూ ఉంటుంది. అలాగే సమాజంలో చాల మంది ఆత్రంగా చూసే వారు, కాలక్షేపంగా చూసేవారు, వార్తలను తెలపడానికి చూసేవారు ఎదో ఒక విధంగా ఆ విషయంలో సామాజిక ట్రెండ్ అవుతుంది. అలా సమాజంలో ఎక్కడా జరగకపోయినా కొంతమంది కొత్తవారు కలిసి కొంతకాలం సహజీవనం చేస్తే ఎలా ఉంటుందో ఒక టివి కార్యక్రమంగా వచ్చిందే బిగ్ బాస్ ప్రాయోజిత కార్యక్రమం.

అయితే మాములు వ్యక్తులు కాకుండా సమాజంలో కొంత పేరు కలిగిన ప్రముఖ వ్యక్తులను ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమంలో చేర్చారు. మామూలుగా ప్రముఖవ్యక్తులు అందులోను చలన చిత్ర టివి రంగానికి చెందిన వ్యక్తులు వ్యక్తిగతం కూడా బహిర్గతంగా ఉండే అవకాశాలు ఎక్కువ. అలాంటిది ఆ రంగాలకి చెందిన చలనచిత్ర నటులు, టివి నటులు కొంతమంది కలసి ఒక టివి కార్యక్రమం కోసం సహజీవనం చేస్తే మీడియాకి అది పండుగే. మీడియా ద్వారా మీడియా వ్యక్తుల అభిరుచులు వారి ప్రవర్తన, తోటివారితో వారి సహచర్యం రికార్డు అవుతూ, విశేషాలు ఒక కార్యక్రమంగా టివిలో ప్రసారం చేయడం ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ప్రధాన ఉద్దేశం అయ్యి ఉంటుంది.

బిగ్ బాస్ హౌస్ పూర్తిగా కెమెరాలతో కవర్ చేయబడి ఉంటుంది, అందులో జరిగేదంతా రికార్డు ఆవుతూ ఉంటుంది, అలాగే రాత్రులు కుడా నైట్ విజన్ కెమెరాలతో రికార్డింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. బిగ్ బాస్ కార్యక్రమంలో వీక్షించే వీక్షకులకు కూడా హౌసులో సహజీవనం చేసే వ్యక్తులపై ఓటింగ్ రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారం కార్యక్రమ వీక్షకుల రేటింగ్ హౌసులో వ్యక్తులకు పోటిలో ఉపయోగపడతాయి. వారం వారం ఎలిమినేట్ చేసే కార్యక్రమంలో వీక్షకుల ఓటింగ్ కీలకం. బిగ్ బాస్ రియాలిటీ షో కార్యక్రమం సోనీ టివి ద్వారా హిందీలో ప్రసారం జరిగి ఉంటే, సీజన 1 తెలుగులో మాటివి ద్వారా నిర్వహించబడింది.

BigBoss2 Telugu Reality Television Daily Show BigBoss1 Winner Actress Archana

మొదటి తెలుగు బిగ్ బాస్ సీజన్లో అర్చన, సమీర్ హసన్, ప్రిన్సు, సంపూర్నేష్, ధనరాజ్, శివ బాలాజీ, హరితేజ, జ్యోతి, మహేష్ కత్తి, మధు ప్రియ, కత్తి కార్తిక, కల్పన రాఘవేందర్, ఆదర్శ్ బిగ్ బాస్ హౌస్లో కొంతకాలం సహజీవనం చేయడానికి ప్రవేశిస్తే, మధ్యలో దీక్ష పంత్, నవదీప్ వైల్డ్ కార్డు ప్రవేశంగా బిగ్ బాస్ హౌస్లో ప్రవేశించారు. అయితే మొదటి బిగ్ బాస్ సీజన్లో విజేత నటి అర్చనగా ఉంది.

బిగ్ బాస్1 రియాలిటీ షో యాంకరింగ్ చేసిన ఎన్టిఆర్ కారణాంతరాల వలన బిగ్ బాస్2 యాంకరింగ్ చేయకపోవడం, ఎన్టిఆర్ స్థానంలో నాచురల్ స్టార్ నాని చేయడం విశేషం. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షోలో కౌసల్ మందా, గీతామాధురి, దీప్తి నల్లమోతు, బాబు గోగినేని, దీప్తి సునైనా, రోల్ రిడ, గణేష్, అమిత్ తివారి, తనిష్ అల్లాడి, సామ్రాట్ రెడ్డి, శ్యామల, తేజస్వి మదివాడ, భానుశ్రి, నందిని రాయ్, నూతన్ నాయుడు, సంజన అన్నే, కిరీటి దామరాజు పాల్గొన్న కార్యక్రమం ఇప్పుడు నడుస్తుంది. నాచురల్ స్టార్ నాని యాంకరింగ్ అందరిని ఆకట్టుకోవడం విశేషం.

తెరపై కనిపిస్తూ లేక ఏదైనా స్టేజిపై పాడుతూ ఉండేవారి సహజ ప్రవర్తన ఎలా ఉంటుందో మాటివిబిగ్ బాస్2లో పాల్గొనేవారి విషయంలో ప్రేక్షకులకు చూసే అవకాశం ఉంటుంది. తెరపై నటనతో ప్రేక్షకులను మెప్పించే వారు వారి సహజ ప్రవర్తనతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో ఈ షో ద్వారా తెలుస్తుంది. BigBoss2 Telugu Reality Television Daily Show 50 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుని విజయవంతంగా ప్రసారం ఈ రియాల్టి షో రోజు 9.30 మాటివిలో ప్రసారం అవుతుంది.

బిగ్ బాస్ వివిధ భాషలలో ప్రసారం అవుతుండగా ఓటింగ్ విధానం కోసం సహజంగానే ఆత్రుత ఉంటుంది. బిగ్ బాస్ వోటింగ్ విధానాన్ని అందించే ఆండ్రాయిడ్ ఆప్స్ కూడా లభిస్తాయి. బిగ్ బాస్ కార్యక్రమం గురించిన మొబైల్ ఆప్స్ గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలపై టచ్/క్లిక్ చేయండి.

ధన్యవాదాలు
జైచిత్ర-JaiChitra