Menu Close

AqsaKhan D10 Show Dancer Become Telugu Actress

AqsaKhan D10 Show Dancer Become Telugu Actress

AqsaKhan D10 Show Dancer Become Telugu Actress

AqsaKhan D10 Show Dancer Become Telugu Actress with the Young Hero Nani అక్శాఖాన్ తెలుగు ఛానల్ ఈటివిలో జరిగిన డాన్స్ షోలో ఒక పోటిదారు. ఆ షోలో సెమీస్ వరకు వచ్చి వెనుతిరిగిన పోటిదారు. కానీ ఆ షోలో ఆమె డాన్స్ ఉందంటే మాత్రం, ఆ షోకి పనిచేసే టెక్నీషియన్లు కూడా పని ఆపుకుని చూస్తారని ప్రతీతి. ఆ విషయం అదే D10 షోలో యాంకర్ ప్రదీప్ వెల్లడి చేసిన సంగతి షో వ్యూయర్స్ కి తెలిసే ఉంటుంది. అలాగే ఆమె డాన్స్ చూసి అబ్బురపడిన శేఖర్ మాస్టర్ ఆమెతో డాన్స్ వేయడం, అలాగే jr. ఎన్టిఆర్ కూడా అక్శాఖాన్ తో D10 స్టేజిపై డాన్స్ చేయడం జరిగింది.

డాన్సర్ అక్శాఖాన్ డాన్సులో ప్రధానంగా ఆమె ఫోక్ డాన్సు అందరిని ఆకట్టుకుని, అందరి చూపు తనవైపుకు తిప్పికుంది. ముఖ్యంగా స్వింగ్ జరా సాంగుకి ఆమె డాన్సు పెర్ఫార్మన్స్ అనేక యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్శాఖాన్ స్వింగ్ జరా సాంగ్ నవంబర్ 1 2017 నాటి వీడియో యూట్యూబ్లో సుమారు 12 మిలియన్ పైగా వ్యూస్ కలిగి ఉంది. 2018 జులై 18వ తేదిన అదే పాటకి ఆమె చేసిన డాన్స్ వీడియో యూట్యూబ్లో వారంరోజుల్లో పది లక్షలకు పైగా వ్యూస్ కలిగి ఉంది. స్వింగ్ జరా సాంగుకి డాన్సు చేసిన అక్శాఖాన్ ఆ ఒక్క పాటతో చాలా ఫేమస్ అయ్యింది.  అలాగే ఆమె చేసిన D10 డాన్సు ప్రదర్శనలలో ఎక్కువ ప్రశంసలు పొందిన ప్రదర్శన మే30, 2018 తేదిన చేసిన డాన్స్ అందరి మదిని ఆకట్టుకుంది.

D10 డాన్స్ షో మాస్టర్లు అయితే అక్శాఖాన్ డాన్సుకు ముగ్ధులై కచ్చితంగా అక్శాఖాన్ హీరొయిన్ అవుతుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అక్శాఖాన్ డాన్స్ పెర్ఫార్మన్స్ వీడియోలు గమనిస్తే వారి కామెంట్లలో ఈ మాటలు ఉంటాయి. అయితే అక్శాఖాన్ గ్రేట్ తెలంగాణా టివిలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన విషయాలలో హీరొయిన్ కావడం, కొరియోగ్రాఫి అవ్వడం నా లక్ష్యమని చెప్పడం జరిగింది.  అభిమాన హీరోగా jr. ఎన్టిఆర్ ఎందుకంటే ఎన్టిఆర్ కూడా మంచి డాన్సర్ మరియు మంచి యాక్టర్ కాబట్టి నాకు ఇష్టం. జై లవకుశ చిత్రంలో విబిన్న పాత్రల తీరు నచ్చింది.

AqsaKhan Will Be Acting With The Telugu Yuva Hero Nani.

అదే ఇంటర్వ్యూలో అక్శాఖాన్ తెలుగు యువ నటుడు నానితో జతగా ఒక తెలుగు చిత్రంలో నటించనున్నట్లు తెలిపింది. AqsaKhan Dancer Become An Telugu Actress. ఈటివిలో డాన్సు స్టేజిపై తన డాన్సుతో అందరిని మెప్పించిన అక్శాఖాన్ బుల్లితెరలపై వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది. ఇక వెండితెరపై నానితో జత కట్టనున్న అక్శాఖాన్ తన నటనతో ఎలా మెప్పిస్తుందో చూడాలి. సాదారణంగా యువ నటుడు నాని చిత్రాలు మంచి కధలతో యువతను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఫోక్ డాన్సుతో D10 స్టేజిపై అదరగొట్టిన అక్శాఖాన్ వెండితెరపై చేయబోయే డాన్సు డామినేట్ చేస్తుందా లేక ఆమె నటన కూడా ఆమె డాన్సుకి మించి పేరు వస్తుందో చూడాలి. ముఖకవళికలు మరియు డాన్సు రెండింటితో ఫోక్ డాన్సులో సూపర్ అనిపించుకుంది. జడ్జిల దగ్గర ఎక్కువ కాంప్లిమెంట్లు అందుకున్న అక్షాఖాన్ ప్రేక్షకుల అభిమానాన్ని తన న నటనతో కూడా సంపాదించుకోవాలని ఆశిస్తూ.. అల్ ది బెస్ట్ అక్శాఖాన్.

ధన్యవాదాలు
జైచిత్ర-JaiChitra