Adi – RamPrasad, AnubhavinchuRaja ETV Comedy Show

Adi – RamPrasad, AnubhavinchuRaja ETV Comedy Show

Adi – RamPrasad, AnubhavinchuRaja ETV Comedy Show

Adi – RamPrasad, AnubhavinchuRaja ETV Comedy Show every Saturday 8-00 PM. అనుభవించు రాజా ఈటివిలో ప్రతిశనివారం రోజు రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతూ అందరిని నవ్విస్తూ హాస్యమే ప్రధానంగా కొనసాగుతుంది. జబర్దస్ట్ ఆర్టిస్టులతో కొనసాగుతూ ప్రముఖ టీవీ నటులు, యాంకర్స్, సినీ నటులు అతిథులుగా వచ్చి నవ్వించే ప్రోగ్రాంగా ఉంది. అనుభంచు రాజా కామెడీ ప్రోగ్రాం ఫిబ్రవరి 24 తేది నుండి ప్రారంభం అయ్యింది. జబర్దస్తుతో ఫేమస్ అయిన అది-రామ్ ప్రసాద్, రశ్మి, నవీన్, కొమరం, సుధాకర్, ముక్కు అవినాష్, ప్రధాన పాత్రలతో కామెడీ షో సాగుతూ ఉంది.

ప్రారంభ ఎపిసోడ్లో నవీన్ – కొమరం ఫ్యామిలీలో అది రామ్ ప్రసాదులు అల్లుళ్ళుగా ఉంటే, వారి భార్యలుగా సుధాకర్, ముక్కు అవినాష్ కలిసి ఒక కుటుంబంగా ఉంటారు. అయితే అప్పుడు అతిథిగా వచ్చిన అనసూయ వారి ఆతిథ్యం స్వీకరించి వారికి బోలెడు బంగారం బహుమతిగా ఇచ్చి వెళుతుంది. అప్పుడు బంగారం కోసం అది రామ్ ప్రసాద్ భార్యలు గొడవపడి   అది – రామ్ ప్రసాదులు ఒకే ఇంట్లో రెండు కుటుంబాలుగా విడిపోతారు. తమ రెండు కుటుంబాలలోకి అతిథులను ఆహ్వానిస్తూ వారిని ఎంటర్ టైన్ చేస్తూ వారికి అతీద్యం ఇచ్చి ఆదాయం పొందే క్రమంలో కామెడీ కొనసాగుతూ ఉంది.

రెండవ ఎపిసోడ్లో చమ్మక్ చంద్ర అనుభవించు రాజాకి అతిథిగా వచ్చి అది – రామ్ ప్రసాదుల కుటుంబ సభ్యులను ఎంతెర్తైన్ చేసి, వారితో ఎంతెర్తైన్ అయ్యి వారిని కలపాలని ప్రయత్నించి విఫలం అయ్యి వెనుతిరుగుతాడు. మూడవ ఎపిసోడ్లో శేఖర్ మాస్టర్ అతిథిగా వచ్చి డాన్సులతో అలరించి ఆది-రామ్ ప్రసాదుల కుటుంబాలను కలపాలని ప్రయత్నించి వెనుతిరుగుతారు. నాలగవ ఎపిసోడ్లో తేజస్వి, అయిదవ ఎపిసోడ్లో నటి హేమ, అరవ ఎపిసోడ్లో కత్తి మహేష్, ఏడవ ఎపిసోడ్లో శ్రీముఖి అతిథులుగా వచ్చి వెళతారు.

ఎపిసోడ్ అంతా వచ్చిన అతిథి తమ ప్రతిభతో అనుభవించు రాజాలో ఉన్న రెండు ఫ్యామిలీలను ఎంటర్ టైన్ చేసి, తరువాత ఆది మరియు రామ్ ప్రసాద్ ఫ్యామిలీల ద్వారా ఎంటర్ టైన్ పొందుతారు. వారి రెండు ఫ్యామిలీలా గురించి ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసే కొంతమంది అభిమానుల ద్వారా డైలాగ్స్ విని చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఆది లేక రాం ప్రసాద్ ఫ్యామిలీకి అతిథిగా ఉంటారు.

తెలుగు చలనచిత్ర దర్శకుల గురించి చదవండి.

ఎనిమిదవ ఎపిసోడ్లో అనుభవించు రాజా షోకి, D10 ఫేం వర్షిణి వస్తే, ఎపిసోడ్9 కి విష్ణుప్రియ వచ్చింది. మంగ్లి పదవ ఎపిసోడ్లో అతిథిగా పార్టిసిపేట్ చేస్తే, పదకొండవ ఎపిసోడ్లో అతిథిగా గెటప్ శ్రీను వచ్చి వెళ్ళాడు. పన్నెండవ ఎపిసోడ్లో జబర్దస్ట్ రాకెట్ రాఘవ వచ్చాడు. సినీ నటి మాధవీలత పదమూడో ఎపిసోడ్లో, నేహ చౌదరి పద్నలగవ ఎపిసోడ్లో అతిథులుగా వస్తే, జబర్దస్ట్ వేణు పదిహేనవ ఎపిసోడ్లో అతిథిగా వచ్చాడు.

AnubhavinchuRaja ETV Comedy Show

హాస్యం ప్రధానంగా సాగే ఈ షోలో జబర్దస్ట్ నరేష్, జీవన్లు ఆది – రామ్ ప్రసాదుల కుటుంబాలలో పనివారు పనిచేస్తూ హాస్యం చేస్తూ ఉంటారు. నరేష్ – రామ్ ప్రసాదుల కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తే, నవీన్, సుధాకర్లపై ఆది పంచులవర్షం పడుతుంది.

పదహారువ ఎపిసోడ్లో అనుభవించు రాజా షోకి D10 షో యాంకర్ ప్రదీప్ అతిథిగా వచ్చి అలరిస్తాడు. తాగుబోతు రమేష్ పదిహేడవ ఎపిసోడ్లో కనిపిస్తే, మంచు లక్ష్మి పద్దెనెమిదవ ఎపిసోడ్లో అతిథిగా వచ్చారు. యశ్వంత్ – పండులు పందొమ్మోదివ ఎపిసోడ్లో, జబర్దస్ట్ ఫేం ధనరాజు ఇరవై ఎపిసోడ్లో అతిథిగా వస్తే, ఇరవై ఒకటివ ఎపిసోడ్లో రేవంత్ – సమీర సింగర్స్ అతిథిగా వచ్చారు.

కేవలం హాస్య ప్రధానంగా ఈటివి ప్రోగ్రాం ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఇంకా ఇందులో ఆరెంజ్ చిత్రంలో ట్రూ ఆర్ డేర్ ఆటలా ఆధారంగా అనుభవించురాజా ప్రోగ్రాంలో కూడా వచ్చిన అతిథితో కూడి ట్రూ ఆర్ డేర్ ఆడుతారు. కొంతమంది వారి జీవిత విశేషాలను ట్రూ ఆర్ డేర్ ఆటలో వెల్లడి చేస్తూ ఉంటారు. ఇంకా ఈ షోలో డేర్ చేసి మంగ్లి శ్రీముఖితో గొడవపెట్టుకుంటే, కొంతమంది ఫేక్ కాల్ చేసి మాట్లాడారు.

2018 జూలై 14వ తేదిన అనుభవించురాజా షోలో ట్రూ ఆర్ డేర్ ఆటలో భాగంగా తన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం వెల్లడి చేస్తే సమీర, రేవంత్ తాను గెలుచుకున్న టైటిల్ అందుకు తన పడ్డ కష్టం వివరించారు. ఇంకా ట్రూ ఆర్ డేర్ ఆటలో భాగంగా ఆది దారినపోయే అమ్మాయి ఫోను తీసుకుని మాట్లాడుతూ వారిని విసిగించి, అందరిని హాస్యంలో ముంచెత్తారు. ఆది ఫోను మాట్లడే సన్నివేశం చాలా ఆకట్టుకుంటుంది. రేవంత్ ఆది వారి కుటుంబంలోకి అతిథిగా వెళితే, సమీర రామ్ ప్రసాదు కుటుంబానికి అతిథి.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra

Leave a Reply

Close Menu