Suchitra

Suchitra సుచిత్ర జైచిత్రలో: చిత్ర కధాంశం సామజిక అంశాలలో మిళితమై పిల్లలు – యువత – పెద్దలపై ప్రభావం చూపుతుంది.

చిత్ర కధాంశం సామజిక అంశాలలో మిళితమై పిల్లలు – యువత – పెద్దలపై ప్రభావం చూపుతుంది. సుచిత్ర సమీక్షలు తెలుగులో అనేక చిత్రాలు వాటిలో కొన్ని సుచిత్రాల విషయాలు ఈ పేజి ద్వారా మీ ముందుకు. ఎందరో తెలుగు నటులు నటించిన సుచిత్రాలు చాలానే ఉంటాయి. సందేశం ఇచ్చే సచిత్రాలను సుచిత్ర పేజి ద్వారా తెలియజేయడానికి ఈ నా ప్రయత్నం. చాలా చిత్రాలు చాలా సంతోషపరిచే చిత్రాలుగా ఉంటాయి, వాటిలో కొన్ని సంతోషపరిచే విషయాలకు సందేశం కూడా మిళితం చేయబడి ఉంటాయి.

సహజంగా సంతోషపడే విషయాల్లో కూడా సందేశం ఉంటుంది. సందేశం లేకుండా చిత్రకధ ఉండదు కదా ! అయితే కొన్ని చిత్రాలు సందేశ ప్రధానంగా సాగుతూ ఉంటాయి. జీవితంలో కష్టాలను చూస్తూ, సినిమాహాలులోకి వచ్చి కష్టాలు చూడాలా అని కొంతమంది కేవలం సంతోషకరమైన విషయాలనే వెండితెరపై చూపుతూ ఉంటారు. కానీ సందేశం లేకుండా చిత్రం ఉండదు, ప్రేక్షకులను నవ్విస్తూ నడిచే చిత్రం కూడా చూస్తున్నంత సీపు నవ్వుతూ ఉంటే, ఆ కాసేపు కష్టాలు మరిచి, మరలా ఉత్తేజితంగా ఆలోచనలు సాగుతాయి అని కొన్ని కామెడీ చిత్రాలు చూసాక ప్రాక్టికల్ అనుభవం అవుతుంది, అంటారు.

సంతోషం ప్రధానమే కానీ తన సంతోషం కోసం ఇతరులను ఇబ్బందులకి గురిచేయకూడదు అని ఒక సినిమా చెబితే, ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకు కాలంలో కరిగిపోయే కష్టాలకు ఎదిరీదు అని కొన్ని భక్తిచిత్రాలు చెబుతూ ఉంటాయి. కొన్ని చిత్రాలు పెద్దవారి మూర్ఖత్వం ద్వారా పిల్లలు మనసు గాయపడే విషయాలను చెబుతూ ఉంటాయి. కొన్ని చిత్రాలు పెద్దల అంగీకారం లేని పెళ్ళిళ్ళు చేసుకుని ఇబ్బందులు పడేవారు గురించి చెబితే, కొన్ని చిత్రాలు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకుని ఇబ్బందులు పడేవారి గురించి చెబుతాయి. కొన్ని చిత్రాలు సమాజంలో పేరుకుపోయిన బలహీనతలు గురించి చెబితే కొన్ని చిత్రాలు సమాజానికి సూచనలు అందించే స్థాయిలో ఉంటాయి. కొన్ని చిత్రాలు ఆడువారిపై అకృత్యాలను ఎండగట్టే విధంగా ఉంటే, కొన్ని చిత్రాలు ఆడువారిని గొప్పతనాన్ని తెలియజేసేవిగా ఉంటాయి.

యువత తప్పు చేస్తుంది అని ఒక చిత్రంలో చూపితే, పెద్దల పొరపాట్లు వలన ఇబ్బందులు పడే యువదంపతుల ఇక్కట్లను కొన్ని చిత్రాలు చూపుతాయి. స్నేహం ప్రేమగా మారితే ఆ జీవితం బాగుంటుంది అని ఒక చిత్రం చూపితే, ప్రేమ వేరు స్నేహం వేరు అని చెప్పే కొన్ని చిత్రాలు ఉంటాయి. కొన్ని చిత్రాలు సమాజంలో జరిగే వింతలు, విచిత్రాలు ఎంచుకుని వాటిని చూపితే, మరి కొన్ని సామజిక అంశాలపై పోరాటం అన్నట్టుగా ఉంటాయి. ఏది ఏమైనా ఎక్కువగా చిత్రాలు యువత-స్నేహం-ప్రేమ-పెద్దలు-పిల్లలు-కుటుంబం-సమాజం-ఆచారం-సంప్రదాయం-భక్తి వీటితో ముడిపడి ఉంటాయి. పెద్దపెద్ద చిత్రాలలో అయితే ఫాంటసితో కలిగి ఉండడం, ఏక్షన్ చిత్రాలుగా ఉండడం ఉంటుంది. ఒక చిత్రం రాజకీయ నాయకుల రాజకీయ వ్యవహారాలను తెలుపుతుంటాయి.

చిత్ర కధాంశం అప్పటికి అప్పటి పరిస్థితులకు సరి అనిపించవచ్చు కానీ అదే అంశం మరో పరిస్థితిలో ఎలాగో కాల నిర్ణయాకం

చిత్రకధ ఒకసారి ఒక విషయం కరెక్ట్ అంటే మరోసారి మరో సమయంలో అదే విషయం తప్పు అంటూ ఉంటుంది. బొమ్మరిల్లు (సిద్ధార్ద్ – జెనిలియా) చిత్రంలో పెద్దలు కుదిర్చిన సంభందం వద్దు అంటే పరుగు(అల్లుఅర్జున్-షీలా) చిత్రంలో పెద్దలని బాధపెట్టి పెళ్లి చేసుకోవడం తప్పు అంటారు, అయితే కామన్ విషయం మాత్రం రెండింటిలో ప్రేమ ఉండాలి, మంచివారు ఎలాగైనా బాధ అనుభవించాలి ఆ కాన్సెప్ట్ మిస్ కాకుండా ఉంటుంది. దర్శకుడు ఒక్కరే కానీ ఒక సినిమా ఆలోచన ఒకలా మరో సినిమాకి ఆలోచన మరోలా అలా ఉండడానికి కారణం కూడా సమాజమే అవుతూ ఉండవచ్చు. ఒక దర్శకుడికి ఆలోచన వచ్చింది అంటే అది సమాజంవలన ఏర్పడిన మానసిక సంఘర్షణ వలననే అని చెబుతూ ఉంటారు. లేకా ఎక్కడైనా అటువంటి సన్నివేశం చూసి మనసులో ఉండిపోతే అది ఒక చిత్రకధగా తయారుఅయ్యే అవకాశం ఉంటుంది.

కొన్ని చిత్రకధలు సినిమా హీరోలను బట్టి వ్రాస్తారు అని చెబుతారు. అలా వ్రాసిన రచయిత ఆలోచన దృక్పదం మాత్రం సమాజం నుండి ప్రభావితమైన మనస్సుచేతనే చేయబడుతుంది, అని అంటారు. భావప్రకటన స్వేచ్చ కలిగిన సమాజంలో మనిషి తన భావనలను ఊహలను తెలియజేస్తూనే ఉంటారు. అటువంటిది కొన్ని కోట్ల రూపాయల ధనం ఒక వ్యక్తి ఆలోచన దృక్పదంపై ఖర్చు చేయడం అంటే ఆ వ్యక్తియొక్క సామజిక పరిశీలన ఎంతగా ఉంటే అది సాద్యం. సాదారణ జీవితం గడిపేవారు సాదారణంగా బ్రతుకుతూ సర్వసాదారణంగా ఆలోచన కలిగి ఉండకపోవచ్చు.

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నెన్నో రకాల చిత్రాలు, చిత్ర విచిత్ర రసరంజిత, రౌద్ర, రమ్యమైన చిత్రాలు, భక్తి భావ చిత్రాలు ఉన్నాయి. కొన్ని చిత్రాలు ఇది మంచిది కాదు ఎప్పుడూ మంచిని ఎంచుకో అని చెబితే, కొన్ని చిత్రాలు ఇది మంచి ఇది చెడు అను చూపుతూ మంచినే ఎంచుకో అనిచెబితే, చెడు సహజంగా ఆకర్షవంతమైన శక్తికలది కాబట్టి మంచిచెడులను చూపించే చిత్రాల వలన లాభంతో పాటు నష్టం కూడా సమాజానికి కలిగే అవకాశం ఉంటే, ఇది మంచిది కాదు మంచినే ఎంచుకో అని చెప్పే చిత్రాలు వలన లాభామెక్కువ అనిచెప్పవచ్చు. ఎలా చెడుని చూపకుండా మంచినే గొప్పగా చూపించడం అంటే ?

చెడుని చూపడంలో ప్రచారం ఉంటే, చెడు ప్రచారం కూడా మంచిని గూర్చి పరోక్షంగా చెప్పడమే

చెడు ఎలా చేయాలో చూపడం కన్నా మంచివలన కష్టాలు కలిగినా భరిస్తే, జీవితం బాగుంటుంది అని మంచి వలన కలిగే కష్టాలను చూపించే చిత్రాలు మనకు బాగా పాత చిత్రాలలో లభిస్తాయి. ఒకప్పుడు హీరోకి చెడు అలవాటులు లేకపోవడం చిత్ర కధానాయకుడి ప్రధాన లక్షణంగా ఉంటే, నేడు చెడు అలవాటు మానరిజం అయ్యింది. అలాగే ఒకప్పుడు చెడు అలవాట్లను మనిషి లక్షణాలుగా చూపకుండా రాక్షస గుణాలుగా చూపి ప్రేక్షకుడికి మంచిపై మంచి అభిప్రాయం కలిగేల ఉండేవి. అయితే ఇప్పుడు నెగటివ్ థింకింగ్ ఉన్న అంశం చిత్ర ప్రధాన అంశం కూడా చిత్ర కధాంశం అయిపోతుంది.

నేటి చిత్రాలు సందేశాత్మకంగా ఉంటాయి, కానీ ప్రేక్షకులకు సందేశం ప్రధానంగా చేరుతుందా అంటే రోడ్ సైడ్ ఫుడ్ రోగాకారకం అంటే, అవే తిని డాక్టర్ దగ్గరికి వెళ్లినట్టు, కొన్ని చిత్ర కధాంశాలు కూడా అలాగనే గందరగోళంలో ఉండే అవకాశం లేకపోలేదు. అంటే రచయిత / దర్శకులకు మంచిని చెప్పే ఆలోచన లేదా అంటే అసలు వారు కధనే తయారుచేయలేరు కదా ? మంచిని చెప్పడానికి చెడుని చూపే ప్రయత్నంలో సమాజంలో జరిగిన చెడుని చూపడం వలన సమాజానికి నష్టమే అయ్యే అవకాశం ఉంటుంది.

అయితే సందేశం గ్రహించడం అంటే తోటిప్రేక్షకుడి ప్రభావం కూడా సదరు ప్రేక్షకుడిపై ఉండవచ్చు. సాదారణంగా సమాజంలో ఆకర్షణీయమైన అంశాలు దాదాపు మనసుని మాయనో, మత్తునో, ఊహనో ఎదో తన్మయంలోకి తీసుకువెళ్తుంది. సాత్వికమైన సాలోచనలు మనిషిని అంతర్ముఖుడిని చేస్తే, ఇతర అంశాలు అవేశాన్నో అనవసరపు ఆందోళననో సృష్టించవచ్చు. అనవసరపు విషయాలు అవసరంగా అవసరమైన విషయాలు అనవసరంగా చూపించే పరిస్థితులు సమాజంలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో కొన్ని చిత్రాలు వాటికి మద్దతు ఇచ్చేవిధంగా ఉండవచ్చు, కొన్నిచిత్రాలు అలాంటి వాటిని తెలిపే విషయాలుగా ఉండవచ్చు.

వీక్షకుల దృష్టి అందరిది ఒకే తీరు ఉండనట్టే, ఆలోచనా శక్తి అన్నిసార్లు ఒకే ఫలితం ఇవ్వదు.

చూసే పెయింటింగ్ చిత్రంలో ఒక అమ్మాయి బొమ్మ ఉంటే ఆ అమ్మాయి అందాన్ని కొంతమంది చూస్తే, కొంతమంది స్త్రీమూర్తిని ఆరాధన భావంతో చూస్తే, కొంతమంది ఆర్టిస్ట్ యొక్క భావనను చూస్తే, కొంతమంది ఆర్టిస్ట్ బొమ్మని గీసిన విధానం కూడా ఊహించవచ్చు. అలా చిత్రాలు మనిషి చూసే దృష్టిని బట్టికూడా మంచిచెడులు సమాజంలో ప్రభావితం అవుతూ ఉంటాయి.

ఆలోచనాపరులు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, ఆవేశపరులు ఆలోచన లేక సతమవుతూ ఉంటారు. విపరీత ఆలోచన మనిషిని ఒంటరిని చేస్తుంది, లేక అలౌకిక లోకంలోకి తీసుకువెళుతుంది. ఆలోచన పరిశోదనకు మూలం అవుతుంది, అదే ఆలోచన ఒక్కోసారి అనుమానాలకి మూలం అవుతుంది. ఒక్కోసారి ఆలోచన ప్రమాదాన్ని నివారిస్తే, ఒక్కోసారి ఆలోచన ప్రమాదాన్ని తీసుకురావచ్చు. ఇలా ఆలోచనలో ఎన్నో బేదాలు ఉన్నట్టు, చలనచిత్రం యొక్క సారాంశం ఏవిధంగా ఏ సమయంలో ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో కాలానికే తెలియాలి.

మనిషి జీవితంలో అవసరమైన విషయాలు మనిషికి భగవానుడు బందువులు లేక కుటుంబం లేక సమాజం ఏదైనా ఒక దారిలో ఏర్పాటు చేస్తూ ఉంటాడు. జీవనక్రమంలో మనిషి జీవితాన్ని పాడుచేసుకునే పరిస్థితులు ఎక్కడ సృష్టించాబడవు. అనవసరమైన విషయాలలో మమేకం ఎక్కువమంది అవ్వడం జరిగితే సమాజం కూడా సామూహికంగా మమేకం అవ్వడం జరుగుతుంది కాబట్టి, ఈ అనవసరమైన విషయాలు తెచ్చుకునే క్రమంలో సరైన ఆలోచన ఉండాలి.

ఒక కుటుంబలో చిన్న పిల్లలు యువత మరియు పెద్దవారిని అనుసరిస్తారు, ఆ కుటుంబం యువత కుటుంబ పెద్దవారి సలహా మేరకు నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి యువత పెద్దల సలహాను ప్రభావితం చేయగలరు, పిల్లలకు మార్గదర్శకం కాగలరు. యువతకు సలహా అడగాలా వద్దా అనే విచక్షణ ఉంటే , ఈ క్రమంలో చిత్రాలలో చెప్పే విషయాలను పిల్లలు, యువత, పెద్దలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.

అలాంటి కుటుంబాల కలయిక, కుటుంబ ఆచార సంప్రదాయాలు, కులాలు, మతాలు ఇవన్ని సమాజంలో భాగమే, కాబట్టి వాటిపై సత్యమైన సరళమైన అవగాహనా కల్పించే విధంగా చిత్రాలు రావాలి, సుచిత్రాలు రావాలి.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra