శుభాకాంక్షల శుభచిత్ర :

శుభాకాంక్షల శుభచిత్ర :

శుభాకాంక్షల శుభచిత్ర :ఆగష్టు 4వ తేది 1929 సంవత్సరంలో పుట్టిన బాలుడు 1949 సంవత్సరంలో రిమ్ జిమ్ అంటూ పాడిన పాట 1969 సంవత్సరంలో రూపుతేరామస్తానా, మేరే సప్నోంకి రాణి పాడిన పాటలు దేశం అంతా వ్యాప్తి చెందాయి. అతను గాయకుడే కాదు నటుడు, సంగీత దర్శకుడు, పాటల రచయత, నిర్మాత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలీవుడ్లో ఒక వెలుగు వెలిగి వెలుగుల పండుగవేలలో అక్టోబర్ 13 తేది 1987 సంవత్సరంలో హస్తమించారు. ఆయనే బాలీవుడ్ నటుడు కిషోర్ కుమార్.

బెంగాలీ అయిన కిషోర్ కుమార్ పలు హిందీ పాటలను రచించారు, వందలాది హిందీ పాటలు పాడారు, పలు హిందీ చిత్రాలలో నటించారు. కొంచెం కోపమస్తే లోకువుగా కనిపించే వారిపై చిరాకుపడుతూ ఉండేవారు చాలామంది ఉంటారు. కాని నిజ జీవితంలో అనేక సమస్యలు, విమర్శలు ఉన్నా సినీ జీవితంలో అందరిని నవ్వించే పనిలో విజయవంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. జీవితంలో ఉన్న దుఃఖాన్ని వ్యక్తిగతంగా పరిమితం చేసి నటనతో మెప్పించి హాస్య కధానాయకుడుగా కిషోర్ కుమార్ ఎప్పుడు భారతీయ సినీ ప్రేక్షకుల గుండెల్లోనే ఉంటారు.

కిషోర్ కుమార్ మొదటి చిత్రంగా షికారి చిత్రంలో పాత్రను పోషించారు. నటుడు దేవానందుకు పాటలు పాడారు, గాయకుడుగా స్థిరపడిన తరువాత పలు హిందీ చిత్రాలలో నటించారు. హాస్యనటుడుగా చిత్రాలలో నటిస్తున్న కిషోర్ కుమార్ గారికి చల్తీకానం గాడీ చిత్రం బాగా గుర్తింపు తెచ్చింది. దేవానంద్ చిత్రానికి డబ్బింగ్ చెప్పిన కిషోర్ కుమారు గారు సంగీత దర్శకత్వం, పాటలు వ్రాయడం చేసారు. తరువాత నిర్మాతగా పలుచిత్రాలను తీశారు. అనేక పాటలు పాడి అందరిని మెప్పించిన కిషోర్ కుమార్ గారు చిరస్మరనీయులు.

వందలాది పాటలు పాడిన కిషోర్ కుమార్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ బాలీవుడ్ హీరోలు అందరికి పాడారు. ప్రముఖ గాయని లతామంగేష్కరుతో కలిసి పాటలు పాడారు. హిందీలో క్లాసికల్ హిట్ సాంగ్స్ అంటే గుర్తుకు వచ్చేది గాయకులలో కిషోర్ కుమార్ ముందు ఉంటారు. హాస్య నటుడుగా పాటల రచయతగా డబ్బింగ్ ఆర్టిస్టుగా సంగీత దర్శకుడుగా ఒక వ్యక్తి అనేక విభాగాలో పనిచేస్తూ జీవితంలో ఎదురైనా సమస్యలకు స్థైర్యం కోల్పోకుండా తత్ప్రభావం కెరీర్ పై పడకుండా ఉన్న కిషోర్ కుమార్ గారు మహానుభావుడే అంటారు. మహానుభావులే జీవితంలో కష్టాలు వచ్చిన కొన్ని గొప్ప గొప్ప పనులు సమాజంలో చేసే వారి ఆగమన నిష్క్రమణ సమయాలను గుర్తింపు సమయాలుగా మార్చేస్తూ ఉంటారు.

ఆగష్టు అంటే మన భారతీయులకు ఇష్టమే ఏర్పడుతుంది. ఎందుకంటే ఆగస్ట్ నెల జాతీయపండుగ జాతీయపతకం ఎగురవేస్తూ జాతీనాయకులను తలుచుకునే ఆగష్టు 15 ఈనెలలోనే వస్తుంది. ప్రముఖ హిందూ ప్రారంభ పండుగలు ఈనెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఆగష్టు శుభకాలాన్ని తెచ్చే శుభాకంక్షల శుభచిత్రమే. August having some happy days on every year.

ధన్యవాదాలు
జై చిత్ర-Jai Chitra