Menu Close

RamCharan’s Rangasthalam Teluguchalanachitram

RamCharan's Rangasthalam Teluguchalanachitram

RamCharan’s Rangasthalam Teluguchalanachitram

RamCharan’s Rangasthalam Teluguchalanachitram directed by Sukumar రంగస్థలం తెలుగుచలనచిత్రంలో చిట్టిబాబు పాత్ర గుర్తుకువస్తే రామ్ చరణ్ నటనాసక్తి, నటనాశక్తి కనబడుతుంది. కొన్ని సినిమాల గురించి చెప్పాలంటే పలానా నటులు ఆ పాత్రలు పోషించారు అని సినిమా విడుదల అయ్యాకకూడా చెప్పాలి. కొన్ని సినిమాలు మాత్రం పాత్రలు పేరు చెబితే చాలు సినిమా పేరుగుర్తుకు వచ్చేస్తుంది. అటువంటి కోవలోకే చిట్టిబాబు రంగస్థలం వెళుతుంది.

చిట్టిబాబుని తీర్చిదిద్దినది సుకుమార్ అలాగే చిట్టిబాబుకు మద్దతు ఇచ్చే పాత్రలు, ప్రతినాయకుడి పాత్రలు అంతే గొప్పగా తీర్చిదిద్దారు దర్శక వర్గంవారు. చిట్టిబాబుకి అన్నయ్యగా కుమార్ బాబు పాత్రలో ఒదిగిన నటుడు ఆది(మృగం, సరైనోడు మొదలైన చిత్రాలలో నటించారు). చిట్టిబాబుకు మరదలు రామలక్ష్మి పాత్రలో సమంతా జీవించారనే భావన కలగకపోదు. అలాగే చిత్రానికి ఆయువుపట్టు ప్రతినాయకుడి పాత్ర ప్రెసిడెంట్. ఈయన పేరు తెలియదు కానీ ఆ ఊరికి ఆయనే ప్రెసిడెంట్ అంతలా జీవించిన ప్రెసిడెంట్ పాత్రను పోషించింది జగపతి బాబు. చిట్టిబాబుకి అత్తగా అనసూయ రంగమ్మత్త పాత్రలో పోషించారు, ఈ పాత్ర ఆమెకు ఒక మైలు రాయి.

రంగస్థలం తెలుగుచలనచిత్రం నిర్మించింది మైత్రిమూవీమేకర్స్ ఇంతకుముందు Jr.ఎన్టీఆర్ – మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జనతా గారేజ్ చిత్రం నిర్మించారు. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా సమంతా జోడిగా దేవిశ్రీప్రసాద్ సంగీతంలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టించింది. సుమారు 200 కోట్ల బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కలిగి ఉంది అని భోగట్టా.

RamCharan’s Rangasthalam Teluguchalanachitram by Sukumar

చిత్ర సంగీతం చిత్రం విడుదలకు ముందే ఒక ఊపు ఊపింది. పాటలు జానపద సాహిత్యంతో మిళితమై ఉండడం అనందరి నోట పలికేలా చేసినవి. అలాగే పాటలు చాలా అర్ధవంతంగా సాగుతాయి. మంగమ్మ రంగమ్మా పాటకు యూట్యూబ్ లో ప్రైవేటు డాన్స్ వీడియోలు అనేకం వచ్చి లక్షల వ్యూస్ పొందాయి. చిత్ర టైటిల్ సాంగ్ అర్ధంతో కూడి చాల చక్కగా ఉంటుంది, అంతే చక్కగా చిత్రీకరించారు.

కొన్ని చిత్రాలకు పనిచేసిన వారి గురించి చెప్పాలంటే ఎదో ఒక చిత్రం మైలురాయి కావాలి, కానీ ఈ చిత్ర యూనిట్ కు మాత్రం రంగస్థలం ఒక మైలు రాయిగా మారుతుంది. చిత్రకధే పాతది అనే అంటారు కొందరు విమర్శకులు కానీ ప్రేక్షకాభిమానం సంపాదించింది. కధలోకి వెళితే హీరోనే తనకధను మనకి వినిపిస్తూ ఉంటాడు. తన ఊరిని తనను పరిచయం చేసుకుంటూ…

రంగస్థలం ఊరికి ౩౦ సంవత్సరాలుగా ఓకే వ్యక్తే ప్రెసిడెంట్, అతని పేరుకూడా ప్రెసిడెంట్ గానే స్థిరపడిపోతుంది. అయితే ఆ ప్రెసిడెంట్ ఊరిలో అందరికి సొసైటీ ద్వారా అప్పులు ఇచ్చి దొంగలెక్కలు చూపుతూ సదరు రైతు పంటలు స్వాహా చేస్తూ ఉంటాడు. కానీ ప్రెసిడెంట్ వలన ఇది అంతా జరుగుతుంది అని గ్రహించి ఎదురుతిరిగినవారు కాటికి వెళుతూ ఉంటారు. అటువంటి ప్రెసిడెంట్ మనిషిని చిట్టిబాబు కొట్టడం, చిట్టిబాబు అన్న కుమార్ బాబు ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా ఎన్నికలలో పోటి చేయడం జరుగుతుంది.

తనకు ఎదురుతిరిగిన వారందరిని తోక్కేసినా తొలిసారి తనకు పోటిగా ఎన్నికలలో నిలబడి తనపేరును ఊరిజనాలకు తెలిసివచ్చేలా చేసిన కుమార్ బాబు, చిట్టిబాబులపై ప్రెసిడెంట్ ఏ విధంగా స్పందించింది, ఆ సమయంలో కుమార్ బాబుకి, చిట్టిబాబుకి అండగా నిల్చిన వ్యక్తే, కుమార్ బాబు మరణనానికి కారణమని చిత్రం చివరలో తెలియడం విశేషం.

ఎంతో అందమైన పల్లెటూరి అందాలు ఆ అందాలకు తోడూ నటుల నటన చిత్రం ఆకట్టుకునే చిత్రంగా మలచబడింది. పాటలు, రామ్ చరణ్, జగపతిబాబు నటన చిత్రానికి మంచిబలం చేకూరిస్తే, సమంతా, కుమార్ బాబు, అనసూయ తదితరులు చిత్రానికి మద్దతు పాత్రల్లో కనిపిస్తారు.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra