MCA (Middle Class Abbayee) Telugu Hit Movie

MCA (Middle Class Abbayee) Telugu Hit Movie

MCA (Middle Class Abbayee) Telugu Hit Movie

MCA (Middle Class Abbayee) Telugu Hit Movie ఎంసిఏ మిడిల్ క్లాస్ అబ్బాయి తెలుగు చలనచిత్రం. నేచురల్ స్టార్ట్ నాని, భూమిక, సాయిపల్లవి ప్రధాన పాత్రలతో ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని, ఈ చిత్రంలో హిందీలోకి డబ్ చేయబడి యూట్యూబ్లో 22 మిలియన్ వీక్షణలు కలిగి ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తే, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

MCA – Middle Class Abbayee

జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండే ఒక యువకుడు చదువు పూర్తీచేసుకుని సరదాగా కాలం గడుపుతూ  అతని పిన్ని, బాబాయ్ ల దగ్గరే ఉంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమైనా నానిని అతని అన్న రాజీవ్ కనకాల ప్రేమగా చూసుకుంటాడు. అన్నకి పెళ్ళయాక మాత్రం వదిన జ్యోతి (భూమిక) పెత్తనంతో అన్నాదమ్ముల మద్య ఎడబాటు వస్తుంది. అయితే అన్న అంటే ఎంత ఇష్టమో చిత్రంగా వదిన అంటే అంతపడదు అతనికి. కారణం అన్నకు భార్యగా వచ్చి తమ సంతోషాలని దూరం చేసిందనే కోపం ఎక్కువగా ఉంటుంది.

వదిన అంటే పడని నానికి వదినకి తోడుగా వేరే ఊరులో ఉండవలసి వస్తుంది. అసలే పడని వదినతో కలిసి ఉండడానికి ఒప్పుకోడు నాని, అన్న కోసం తప్పక వదినకి తోడుగా వెళతాడు. చిత్రంగా  వదినకి వంటచేస్తూ తోడుగా ఉంటూ ఉంటాడు నాని. డ్యూటీలో స్ట్రిక్ట్ గా ఉండే జ్యోతి ఆర్టిఏ ఆఫీసర్, వృత్తిరిత్యా జ్యోతి (భూమిక) ఒక బస్సుని సీజ్ చేస్తుంది. సదరు బస్సు శివశక్తి ట్రావెల్స్ యాజమాన్యం వారిది, ఆ యజమాని పెద్ద గూండాగా ఆ ఊరిలో అజమాయిషీ చేసే వ్యక్తి. బస్సు సీజ్ చేసిన జ్యోతి(భూమిక)ని చంపడానికి ప్రయత్నిస్తే, నాని వచ్చి ఆమెను కాపాడతాడు. అంతేకాకుండా జ్యోతి రక్షణ భాద్యతని మొత్తం తీసుకుంటాడు. ఎందుకంటే అనేది చిత్రంలో చూస్తేనే మజా.

సాయిపల్లవి జ్యోతికి చెల్లెలు ఊరి నుండి జ్యోతి ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉంటుంది. నాని పల్లవి (సాయిపల్లవికి) నానికి మధ్య ప్రేమ భందం ఏర్పడుతుంది. పల్లవినానిల ప్రేమ విషయంలో పల్లవి తండ్రిని ఒప్పించడానికి జ్యోతి ప్రయత్నిస్తూ ఉంటుంది. నాని వదినని శివశక్తి ట్రావెల్స్ యజమాని నుండి కాపాడుతూ ఉండడంలో చేసిన ప్రయత్నాలు సాయిపల్లవితో ప్రేమ సన్నివేశాలు బాగుంటాయి. అలాగే భూమిక – నానిల సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి.

అన్నతో సరదాగా గడిపే తనని అన్న నుండి దూరం చేసిన వదినపై కోపంగా ఉండే కుర్రవాడు, వదిన ప్రాణాలకు తన అడ్డుగా నిలబడి వదినని కాపాడుకునే ప్రయత్నాలు చూపించడంలో దర్శకుడు విజయవంతం అయ్యారు. వదినగా భూమిక నటన చక్కగా ఉంటే, నేచురల్ స్టార్ నటన యువతకు నచ్చుతుంది. ఏవండోయ్ నానిగారు, చెప్పండోయ్ చిన్నిగారు పాట బాగా ఆకట్టుకుతుంది. విలనుగా విజయ వర్మ మెప్పించాడు. సరదాగా సాగిపోయే మిడిల్ క్లాసు అబ్బాయితో పెట్టకుంటే పేరుమోసిన విలన్ని ఎదుర్కోవడం, అది తనకు ఇష్టంలేని వదిన కోసం. ఇదే ఈ చిత్రంలో ప్రధాన పాయింట్.

ధన్యవాదాలు
జైచిత్ర-JaiChitra

Leave a Reply

Close Menu