సంసారం ఒక చదరంగం కుటుంబకధా తెలుగు చలనచిత్రం

సంసారం ఒక చదరంగం కుటుంబకధా తెలుగు చలనచిత్రం

సంసారం ఒక చదరంగం కుటుంబకధా తెలుగు చలనచిత్రం అంటే సాగరం ఈదడం లాంటిది అంటారు. ఇక మధ్యతరగతి సంసారం అయితే నడి సముద్రంలో దిక్కులు చూస్తున్నట్టే ఉంటుంది. మనదేశంలో మధ్యతరగతి జీవనమే ఎక్కువ.  అలాగే ఎక్కువగా వ్యాపార సేవా వ్యవహారాలు కూడా మధ్యతరగతి సమాజంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్యోగి అతనిపై నలుగురు ఆధారపడి ఉండడం, లేక ఇద్దరు కన్నా ఎక్కువమంది పనిచేసే కుటుంబమైతే పలురకాల సమస్యలు వస్తూ సంసార తీరం మీద బెంగలేకుండా చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త బెంగలు పుట్టిస్తూ.

కుటుంబ బాద్యతలను మోస్తూ చివరి దశలో ఉన్న మధ్యతరగతి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల భావనల చేత ప్రభావితమయ్యే కుటుంబం ఈ సంసారం ఒక చదరంగం చలనచిత్రం. గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, శరత్ బాబు, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్, ముచ్చెర్ల అరుణ తదితరులు నటించిన తెలుగు చలనచిత్రం. ప్రతిష్టాత్మకమైనా సంస్థ ఏవిఎం వారు ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో నిర్మించారు.

సంసారం ఒక చదరంగం కుటుంబ కధ

గోదావరి (అన్నపూర్ణ)- అప్పల నర్సయ్యల(గొల్లపూడి మారుతీరావు)ది మధ్యతరగతి కుటుంబం, వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు, పెద్ద కొడుకు ప్రకాష్ (శరత్ బాబు)ని బికాం చదివించారు, రెండవ కొడుకు రాఘవ(రాజేంద్ర ప్రసాద్)ని పనికి పంపించారు, చిన్న కొడుకు కాళిదాసు పది పరిక్షలు రాస్తూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. పెద్ద కొడుక్కి భార్యగా ఉమా(సుహాసిని) వస్తే, కూతురు సరోజ(కల్పన)కి పెళ్లి సంభందాలు చూస్తూ ఉంటారు. ఆ ఇంటికి మొదటి నుండి ఉండే పనిమనిషి చిలకమ్మా(షావుకారుజానకి) ఉంటుంది.


కూతురు సరోజకి పెళ్లి సంభందం వస్తే అప్పటికప్పుడే ఆమె కాదని చెబుతుండగా, పెళ్లి చూపులకి వచ్చిన వారు వెళ్ళిపోతారు. తరువాత అప్పల నర్సయ్య ఆ పెళ్లి చూపులకు వచ్చిన వారింటికి వెళ్లి క్షమాపణ చెబుతాడు. పద్దతి నచ్చిన అతను అప్పల నర్సయ్య కొడుకికి తన కూతురు వసంతని చేసుకోవలసిందిగా కోరతాడు. అప్పల నర్సయ్య అంగికరించి ఇంటికి వచ్చేస్తాడు. అప్పలనర్సయ్యకు కూతురు సరోజ తన ప్రేమించిన పీటర్ గురించి చెబుతుంది. అలా కూతురు కొడుకు ఇద్దరి పెళ్ళిళ్ళు చేసేస్తాడు.

పెళ్ళిళ్ళు పూర్తయ్యాక అప్పలనర్సయ్య పెద్ద కోడలు పురిటికి పుట్టింటికి వెళుతుంది, ఆ సమయంలో కూతురు సరోజ భర్తతో తగవు పెట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది, రెండవ కోడలు కొడుకు రాఘవతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోతుంది, రెండు సంఘటనలు ఒకేసారి జరుగుతాయి. అలాగే ఎప్పుడు జమా ఖర్చులు లెక్కలు వేసుకునే ప్రకాష్, తన భార్య ఉమా ఇప్పుడు పుట్టింట్లో ఉంది కాబట్టి, తనవాటా ఖర్చు కింద ఎప్పుడు ఇంట్లో ఖర్చుకు ఇచ్చే మొత్తంలో నుండి సగం తగ్గించి గోదావరికి ఇస్తాడు.

అందరూ 10 నెలలకె పుడితే నీవు పది నెలల పదమూడు రోజులు కడుపులోనే పెరిగావు, అప్పుడు నేను లెక్కలు చూడలేదే అని గోదావరి కొడుకు ప్రకాష్ తో అంటే, అందుకున్న అప్పల నర్సయ్యతో ప్రకాష్ వాదం పెంచుకుంటాడు. ప్రకాష్ మాటలకి విసిగిన అప్పల నర్సయ్య ఇంటినుండి వెళ్ళిపోమంటాడు. ప్రకాష్ తాను ఇంతకుముందు పెళ్ళిళ్ళకి ఇచ్చిన సొమ్ము తిరిగి చెల్లిస్తే వెంటనే వెళ్ళిపోతాను అంటాడు. ఆ సంఘటనతో నట్టింట్లో అడ్డుగా గీత గీసుకుని, పెద్ద కొడుకు తండ్రి విడిపోతారు.

పురిటికి పుట్టింటికి వెళ్ళిన ఉమా వచ్చేటప్పటికి ఇంటి పరిస్థితిని చూసి, భాదపడి ఆ ఇంట్లో సమస్యగా మారినా విషయాలపై దృష్టి సారించి సరి చేస్తుంది. చివరికి ఉమా-ప్రకాష్ దంపతులు తమ పిల్లవాడితో ఇల్లు వదిలి బయటికి అద్దెకు సభ్యతతో వెళతారు. అందరి నటన పాత్రలపరంగా చక్కగా ఉంటుంది. సకుటుంబ సమేతంగా చూడదగిన సాంఘిక చిత్రాల్లో సందేశంతో కూడిన చిత్రంగా ఆకట్టుకుంటుంది.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra