బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు.

బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు.

బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు. సాదారణంగా టైటిల్ తగ్గ చిత్రంగా కొన్ని ప్రసిద్ద టైటిల్స్ విషయంలో అంచనాలు తప్పవచ్చు, కాని అతడు విషయంలో అంచనాలు లేకుండా బిన్నమైన టైటిలుతో విడుదల అయ్యాక ఎక్కువకాలం గుర్తుకు ఉన్న చిత్రం అతడు. సహజత్వానికి దగ్గరగా ఎక్కువమంది ఆలోచనలతో సరిపోలే విధంగా ఉండేవి నిదానంగా అందరి ఆలోచనల్లో మెదులుతూ ఉంటాయి. అతడిని ఒకరు కాదంటే ఇంకొకరు ఒప్పుకున్నారు, ఆ తరువాత అందరు ఒప్పుకున్నారు.

ప్రతిపక్షంలో కూర్చున్న రాజకీయ పార్టీ నాయకుడు శివారెడ్డి రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలంటే ప్రజల సానుభూతి అవసరమని గ్రహిస్తాడు. ప్రజల సానుభూతి అంటే మరణం నుండి తప్పించుకున్న వ్యక్తి సహజంగానే ఉంటుంది, అదే పార్టీ నాయకుడు అయితే, అతడిని ముఖ్యమంత్రి చేసేంతగా ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఆ క్రమంలో శివారెడ్డి (బులెట్ గాయం అవుతుంది, శివారెడ్డి చావకూడదు) పాల్గొనబోయే సమావేశంలో హత్యాప్రయత్నం జరిగేల పధకం రచిస్తారు, ఆ పార్టీ ఉపనాయకులు బాజిరెడ్డి తదితరులు. అందుకు నందు, మల్లి ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ ని పురమాయిస్తారు.

కాని సమావేశంలో పధకం ప్రకారం శివారెడ్డిని నందు కాల్చే లోపులోనే, శివారెడ్డి ఇంకొక బులెట్ తగిలి నిజంగానే చంపబడతాడు. విషయం గ్రహించిన నందు బిల్డింగ్ పై నుండి ట్రైనుపైకి దూకి, ట్రైను లోపలకి ప్రవేశిస్తాడు. పోలీసులు కూడా ఆ ట్రైనుని అనుసరిస్తారు. బాల్యంలో చేసిన పొరపాటుకు ఊరినుండి పారిపోయిన పార్ధు, చాన్నాళ్ళ తర్వాత తిరిగి ఇంటికి అదే రైలులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ట్రైనుపై నుండి లోపలికి వచ్చిన నందు పార్ధు ఎదురుగానే కూర్చుంటాడు. ట్రైను తరువాతి స్టేజికి చేరాక పోలీసులు జరిపిన కాల్పుల్లో నందు స్థానంలో పార్ధు మరణిస్తాడు. పార్ధు విషయాలు విన్న నందు పార్ధు ఇంటికి పార్ధుగా వెళ్తాడు.

తనవలననే ప్రాణాలు కోల్పోయిన అతడి కుటుంబంలోకి అతడు.

ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన అతడిని అందరు ఆదరిస్తారు వివరాలేమిటో అడగకుండానే అతడిని పార్ధుగా గుర్తిస్తారు. నేరం చేసి ట్రైనుపై దూకి పారిపోయిన అతడి కోసం కేసు సిబిఐకి వెళ్తుంది. పార్ధు స్నేహితులు, వచ్చి అతడిని కలిసి బాల్య విషయంలో బాల్యంలో అతడు చేసిన తప్పు ఏమిటో వివరిస్తారు. తన వల్లే చనిపోయిన పార్ధు కుటుంబానికి ఏదైనా సాయం చేయాలనీ భావించిన నందు, పార్ధు చిన్ననాడు చేసిన తప్పుకు బలైన మాస్టారుగారి అవసరం తీరుస్తాడు. అలాగే పార్ధు తాతగారి పొలం తగాదాని సరిచేస్తాడు. పార్ధు తాతగారి మనవరాలి పెళ్లిని తన ఖర్చుతో చేస్తాడు. పార్ధు మరదలు ప్రేమిస్తే, ఆమెను ప్రేమిస్తాడు. అలా అతడు పార్ధుగా మారిపోతాడు.బంధాలు లేని అతడు పరిచయంలేని బంధువుల మధ్య అతడై ఉన్నాడు.

అయితే సిబిఐ అధికారి ఆంజనేయ ప్రసాద్ ఇన్వెస్ట్ గేట్ చేసి పార్ధు స్థానంలో నందు చలామణి అవుతున్నట్టు కనుక్కుంటాడు. పార్ధు కుటుంబానికి సహాయం అందించడంలో నందు పని పూర్తయ్యేటప్పటికి, ఆంజనేయ ప్రసాదు ఆధారాలతో నందుని వెతుక్కుంటూ పార్ధు తాతగారి ఇంటికి వస్తాడు. గ్రహించిన నందు ఆంజనేయ ప్రసాదు వచ్చేటప్పటికి తప్పించుకుంటాడు. అధికారులు వెళ్లిపోయాక వచ్చి అతడు తిరిగి వచ్చి జరిగిన సంఘటనలలో తన భావన తెలియజేస్తాడు. తాతగారు అతడినే పార్దుగా ఆదరిస్తారు.

జరిగిన శివారెడ్డి హత్యలో భాగం బాజిరెడ్డికి ఉంటుందని గ్రహించిన నందు, బాజిరెడ్డి దగ్గరి నుండి నిజాన్ని రికార్డు చేసి, అసలు నేరస్తుడు మల్లిని చంపుతాడు. సిబిఐ అధికారి ఆంజనేయప్రసాదుకి తన దగ్గర ఉన్న ఆధారం అందజేస్తాడు. అదారంతో ఎదురుగా ఉన్న ఆంజనేయప్రసాదు ముందే బాజిరెడ్డి తననితనే కాల్చుకుని చనిపోతాడు. నేర ప్రవృత్తి ఉన్నా మంచి మనుషుల మద్య మనిషిగా మారిన అతడిని ఆంజనేయ ప్రసాద్ వదిలివేసి కేసు క్లోజ్ చేయడంతో అతడు కధ సుఖాంతం అవుతుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు చిత్రంలో మహేష్ బాబు, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, త్రిష, సోను సూద్, కోట శ్రీనివాసరావు, షియాజీ షిండే, నాజర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, అజయ్, గిరిబాబు, సుధ, తనికెళ్ళ భరణి, కె విశ్వనాధ్, గిరిధర్, చరణ్ రాజ్ తదితరులు నటించారు.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra