కర్తవ్యం వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి

కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి

చిత్రంలో కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి కధ కర్తవ్యం కధ. ఘటనా ఘటనలను తెలియజేస్తూ వాస్తవాలను సమాజానికి తెలియపరిచే సమాచార వ్యవస్థ ఒకటి ఉంటే పాల్గొనేవారి కర్తవ్యం ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలి, రోగికి చికిత్స చేయాలి, రోగాలను అదుపు చేయాలనీ వ్యవస్థచే ఏర్పరచుకున్నది వైద్యవ్యవస్థ, ఇక్కడ రోగికి చికిత్స, రోగనివారణ మార్గాల సూచన ప్రధమ కర్తవ్యం. ఇలా పలురకాలుగా వ్యవస్థల్లో వివిధ రంగాలలో ప్రజాపనుల కోసం, సమాజ సేవలు కోసం  వ్యవస్థలు ఏర్పడడం, వ్యవస్థచే వ్యక్తులు నియమింపబడడం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నిగా ప్రైవేటు రంగ సంస్థలుగా కొన్ని ఉంటే, అధికారికంగా ఉండే వ్యవస్థల్లో రక్షణ వ్యవస్థ ప్రధానమైనది, ప్రభుత్వపరమైన వ్యవస్థ.

ఏ రంగానికైనా సమయాలు ఉంటే రక్షణ వ్యవస్థ ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఆపదలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వస్తాయో చెప్పలేరు. అలాంటి రక్షణ వ్యవస్థను అధికార రాజకీయవర్గాలు శాసిస్తూ ఉంటాయి. ప్రజలకు రక్షణగా ఉండే వ్యవస్థలో ఉద్యోగం చేయడం అంటే అది సమాజ సేవచేయడంలో ముందుండే వ్యక్తిత్వం ఉన్నవారికే ఉంటుంది. శక్తి ఉండి సమాజానికి సహాయకారిగా ఉంటే సమాజమే మెచ్చుతుంది, తెలివితో శక్తితో సమాజం నుండి పొందినా సమాజం సహకరిస్తుంది. ఏర్పరచుకున్న వ్యవస్థలో నియమ నిభందనలు ఉంటే, సమాజంలో వ్యక్తులు, వారి కుటుంబాలు, కులాలు, మతాలు వివిధ వ్యవస్థలు అన్ని అధికార అనధికార వ్యవస్థలుగా గుర్తింపు పొందినవిగా కొన్ని పొందనవిగా కొన్ని ఉంటాయి. ఒకరు ఒక రకంగా సేవ చేస్తూ ఉంటే, వారు మరొక రకంగా సేవను పొందుతూ ఉంటారు. సమాజం ద్వారా సేవ చేయడం, పొందడం ఉంటుంది.


స్వార్ధమనే విషయం పొందడంలో చూపిన చొరవ చేయడంలో చూపదు, అలాంటి స్వార్ధమే ఒక వ్యక్తిలో నిండిపొతే సదరు వ్యక్తి ప్రవర్తన పొందడంలోనే ఉంటుంది. దానికోసం ఇతర వ్యవస్థల లేక ఇతరుల కర్తవ్యానికి కూడా అడ్డుపడతారు. అలాంటివారు ముందుగా డబ్బు, తరువాత పదవి దాంతో అవసరమైన వ్యవస్థ అందులో అధికారులపై పట్టుబిగిస్తూ ఉంటారు. అధికారం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రక్షణ వ్యవస్థే. రక్షణ వ్యవస్థలో కర్తవ్యతా భ్రస్టత ఏర్పడితే వ్యవస్థ చిన్నాబిన్నం అయ్యి సమాజంలో సమతుల్యత అదుపుతప్పుతుంది. అందుకే శాంతి భద్రతలను కాపాడే వ్యవస్థగా రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

కర్తవ్యమే కార్యంగా పనిచేసే అధికారులు సమాజంలో తాత్కాలిక కష్టాలు ఉంటే

వ్యవస్థలో స్వార్ధపరుల ఆటకట్టించే రక్షణవ్యవస్థలో రక్షణాదికారిగా ఒక స్త్రీ పనిచేస్తే అది కర్తవ్యంతో చేస్తే ఎలా ఉంటుందో కర్తవ్యం చిత్రం చూపుతుంది. సమాజంలో స్వార్ధంతో పెద్దమనుషుల బలంతో అధికారంతో ఆటలాడే వ్యక్తుల గురించి చెప్పడంలో దర్శకుడు ఎ మోహన్ గాంధి సిద్దహస్తుడు.  పూజకు పనికిరాని పువ్వు, ఆడపడచు, న్యాయానికి సంకెళ్ళు, మౌనపోరాటం, జడ్జ్ మెంట్, పీపుల్స్ ఎన్కౌంటర్, ఆశయం, పోలీసు బ్రదర్స్, సంభవం, శంఖారావం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కర్తవ్యం చిత్రాన్ని నిర్మించింది ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం. ఒకేఒక్కడు, ప్రేమికులరోజు, స్నేహం కోసం, బంగారం, ఖుషి, భారతీయుడు, పెద్దరికం లాంటి పలు చిత్రాలని నిర్మించారు.———————————–

తెలుగు చలన చిత్రం కర్తవ్యం కధలోకి వెళ్తే

మంత్రి బాబురావు (బాబుమోహన్) 32 ఫైళ్లపై అర్హతలు చూడకుండా సంతకం చేస్తే, ఆ ఫైళ్ల తాలూకా కుంభకోణం గురుంచి ప్రముఖ రాజకీయ వ్యక్తి దత్తు నిరాహారదీక్ష చేస్తాడు. మంత్రిబాబురావు సంతకాలు చేసిన ఫైళ్లలలో నగరంలో పెద్దమనిషి ముద్దుకృష్ణ (అట్లూరి పుండరీకాక్షయ్య) ఫైల్ కూడా ఉంటుంది. ఇదే విషయం అతనికి చెప్పి దత్తు సంగతి చూడమంటాడు మంత్రి. నేరాలు ఎదేచ్చగా చేస్తూ పోలీసు, న్యాయ వ్యవస్థలలో వ్యక్తులను డబ్బుతో లొంగదీసుకుంటూ ఉండే ముద్దుకృష్ణ దత్తుపై లారీని ఎక్కించేసి చంపించేస్తాడు. ఆ కేసుని CI కాశిపాతి, లాయర్ కలిసి అది ఆక్సిడెంట్ అని ఫైల్ క్లోజ్ చేస్తారు.

కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి ఏఎస్పి వైజయంతి నిజాయితీ గల అధికారి ఆమె వచ్చి ఈ ఫైల్ కేసు తిరిగి విచారణ చేపడుతుంది. ముద్దుకృష్ణ డబ్బు అధికారంతో ఆ కేసుని గెలుస్తాడు. డ్రైవర్ తప్పతాగి ఆ ఆక్సిడెంట్ చేసారని నిరూపిస్తారు. CI కాశిపతి చేతిలో అవమానపాలు అయిన పోలీస్ కానీస్టేబుల్ కొడుకు సూరిబాబు కాశిపతిని చంపబోయి ఇంకో కానిస్టేబుల్ ని కాలుస్తాడు. దాంతో సూరిబాబు ఉద్యోగం పోగొట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఏఎస్పి వైజయంతి మారుటతల్లి కొడుకు ముద్దుకృష్ణ కొడుకుతో జతకట్టి అతనికోసం తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో పరీక్షా ప్రశ్న పత్రాలను దొంగిలించి అతనికి ఇస్తాడు. అలాగే వైజయంతి స్కూల్ మాస్టర్ గారి కూతురిని మానభంగం చేయడానికి ముద్దుకృష్ణ కొడుకుని అతని స్నేహితులు ప్రోత్సహిస్తారు. మానభంగానికి గురైన యువతి వెంటనే కోర్టుకి వెళితే, ముద్దుకృష్ణ కొడుకుని పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు.

CI కాశిపతి చెయ్యి విరక్కొట్టుకుని ఆ నేరం ముద్దుకృష్ణ కొడుకే చేసాడని నిరూపిస్తే, ఒకేవ్యక్తి ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో రెండు నేరాలు చేయలేడు, అలాగే మానభంగం కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందువలన కోర్టు ముద్దుకృష్ణ కొడుకుని కొద్దిపాటి శిక్ష విధిస్తుంది. ఈ నేరం విషయంలో వైజయంతి వదలదని భావించిన ముద్దుకృష్ణ తన కొడుకు పుట్టిన రోజుని ఘనంగా నిర్వహించి రాజకీయ యువ నాయకుడుగా మంత్రిచే చేయిస్తాడు. మానభంగం కేసులో శిక్ష తప్పించుకున్న ముద్దుకృష్ణ కొడుకుని కనుబొమలతో సహా గుండు గీసి బయటతిరగకుండా చేస్తాడు, సూరిబాబు. మండిపడ్డ ముద్దుకృష్ణ జైలులో ఉన్న సూరిబాబుని బయటకి లాక్కొచ్చి గొడవ సృష్టించి ఆ గొడవలో వైజయంతి కాళ్ళు విరిగేలాగా చేస్తాడు. కాళ్ళు విరిగినా మరలా కోలుకుని వృత్తిలో వచ్చిన వైజయంతి ముద్దుకృష్ణ అంతుచూస్తుంది. మానభంగం చేసేటప్పుడు ప్రోత్సహించిన ముద్దుకృష్ణ కొడుకు స్నేహితులు, అదే అమ్మాయికి తాళి కట్టేవిధంగా ప్రోత్సహించి, చేసిన తప్పు సరిదిద్దుకుంటారు.

అధికారి కర్తవ్యమే వ్యవస్థకు ఆధారం, సమాజానికి మేలు

వ్యక్తి కర్తవ్యం, వ్యవస్థలో విధులు కర్తవ్యతా దీక్షతో చేసే పోలీసు అధికారి తన కర్తవ్యం తను నిర్వహించడంలో కాళ్ళు పోగొట్టుకున్న నిరుత్సాహపడకుండా పోరాడడమే ఈ చిత్ర కధాంశం. తన స్వార్ధ కోసం ముద్దుకృష్ణ చేసే తప్పుడు పనులను కర్తవ్యం గాలికి వదిలేసి రక్షణ శిక్షణ అధికారులు అమ్ముడు అయ్యే అధికారులు, కర్తవ్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టె అధికారులు ఈ చిత్రంలో కనబడుతారు. విజయశాంతి, వినోద్ కుమార్, సాయికుమార్, పిఎల్ నారాయణ, పరచూరి వెంకటేశ్వరరావు, చరణ్ రాజ్, నిర్మలమ్మ, బాబూమోహన్, నూతన్ ప్రసాద్, సాక్షి రంగారావు, పి.జె. శర్మ, సంజీవి, మోహన్, మీనా మొదలైనవారు నటించారు.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra