అంతఃపురం చిత్రంలో అమ్మతనం ఆరాటపోరాటం బిడ్డడి భవిష్యత్తుకోసం

అంతఃపురం చిత్రంలో అమ్మతనం ఆరాటపోరాటం బిడ్డడి భవిష్యత్తుకోసం

అంతఃపురం చిత్రంలో అమ్మతనం ఆరాటపోరాటం బిడ్డడి భవిష్యత్తుకోసం సాగిస్తుంది. తన బిడ్డడిని ఫాక్షనిస్టుల మధ్య నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి ఆరాటపడుతూ కష్టంతో పోరాటం చేసే కన్నతల్లి ప్రయత్నం. ఏతల్లి అయినా బిడ్డడి క్షేమం కోరుతుంది, పోరాటం చేస్తుంది, ప్రాణాలకు తెగించి కూడా తల్లి పోరాడుతుంది అని ఈచిత్రం చూపుతుంది. విమర్శకుల ప్రసంశలు కొన్ని చిత్రాలకే దక్కుతాయి అలా ఈ చిత్రానికి ఈచిత్ర యూనిట్ కు కూడా దక్కాయి. అంతఃపురం అమ్మతనం ఆరాటం పోరాటం.

అమ్మగా సౌందర్య నటిస్తే, అమ్మ భర్తగా సాయి కుమార్ నటిస్తే అమ్మ భర్తకి తండ్రిగా అమ్మకి మామగా ప్రకాష్ రాజ్ నటన అందరిని ఆకట్టుకుంటే, సౌందర్య నటన అందరిని మెప్పిస్తుంది. అమ్మభర్తకి తల్లిగా ప్రకాశ రాజ్ భార్యగా సౌందర్యకు మద్దతు పలికే అత్తగా ఫ్యాక్షన్ ఫ్యామిలీలో ఇల్లాలులా శారద నటన ఉంటుంది. ఇలా అందరి నటన ఈ చిత్ర కధనం చిత్రాన్ని ఒక సచ్చిత్రంగా మలిచింది. ఈ చిత్రంలో అసలేం గుర్తుకు రాదు… అంటూ సాగే పాట బాగా ప్రాచుర్యం పొందింది.

ఫ్యాక్షన్ వాతావరణంలో ఉండలేక విదేశాల్లో నివసించే శేఖర్ (సాయికుమార్) అక్కడే స్థిరపడ్డ ఒక బిజినెస్ మేన్ కూతురు బానుమతి (సౌందర్య)ని వివాహం చేసుకుంటాడు. వారివురు అన్యోన్యమైన సంసార ఫలితంగా కలిగిన కొడుకుతో సంతోషంగా విదేశాల్లోనే ఉంటారు. అయితే ఊరినుండి వచ్చిన కబురుతో శేఖర్ ఫ్యామిలీతో సొంతఊరికి వస్తాడు. శేఖర్ తండ్రి ఊరిలో ప్రసిద్ద ఫ్యాక్షన్ నాయకుడు అతని పేరు నరసింహ, పేరుకు తగ్గట్టే అతని ప్రవర్తన ఉంటుంది. ఎప్పుడు దాడి ప్రతిదాడిలతో సాగే ఆ కుటుంబవాతావరణంలోకి బానుమతి తన బిడ్డడితో బిక్కుబిక్కుమంటూ ప్రవేశిస్తుంది.

నరసింహ ప్రత్యర్ధుల దాడిలో శేఖర్ తన ప్రాణాలు కోల్పోతాడు, భర్తని కోల్పోయిన భానుమతి తన బిడ్డడితో మరలా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. భానుమతి మామ అయినా నరసింహా వారిని ఆప్ తండ్రిని చంపిన వారిపై కక్ష తీర్చుకునే భాద్యత నీ బిడ్డడిపై ఉంది, నీ బిడ్డడు నాకు వారసుడు అని భానుమతి ప్రయాణాన్ని అడ్డుకుంటాడు. తన మూర్ఖత్వాన్ని ఎదిరించిన భానుమతిని నరసింహ గదిలో బందించి ఉంచుతాడు.

అత్తగారి సహాయంతో భానుమతి బిడ్డడితో ఇల్లు దాటి బయటపడుతుంది, నరసింహ మనుషులు వెంటపడతారు. ఎలాగైనా వారికి దొరకకుండా బిడ్డడితో కొనసాగించే ప్రయాణ ప్రయత్నంలో భానుమతి పడే కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. చివరికి జగపతిబాబు సహాయంతో ఆమె తన ప్రయత్నంలో విజయవంతం చేయగలుగుతుంది.

సహజత్వానికి దగ్గరగా కధనం నడిపించడంలో సన్నివేశాల్లో విబిన్నతను చూపే కృష్ణవంశీ చిత్రానికి దర్శకుడు. మంచి చిత్రాలకు ఆదరణ నిదానంగా వచ్చిన ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు, అలా సందేశాత్మక చిత్రాలు, సామజిక ఇతివృత్తాలు ఉంటాయి. అంతఃపురం చిత్రం ముఠాకక్షల మద్య కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో చూపుతుంది. సౌందర్య, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, శారద, జగపతి బాబు, చిన్నా, ఎంఎస్ నారాయణ, బాబు మోహన్ తదితరులు నటించారు.

ధన్యవాదాలు
జైచిత్ర-JaiChitra