Menu Close

VijayDevaraKonda Young Hero Compared with Pawan

VijayDevaraKonda Young Hero Compared with Pawan

VijayDevaraKonda Young Hero Compared with Pawan

VijayDevaraKonda Young Hero Compared with Pawan అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో చిరంజీవి తమ్ముడుగా పరిచయమయ్యి సుస్వాగతం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. గోకులంలో సీత చిత్రంలో నటించిన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రంతో చిరంజీవి తమ్ముడు అని కాకుండా పవన్ చిత్రాలకు అభిమానులు ప్రత్యేక అభిమానం పెరిగింది. తమ్ముడు చిత్రంతో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ క్రేజీ ఇంకా పెరిగింది. బద్రి, ఖుషి చిత్రాలతో అశేష అభిమానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ జానీ లాంటి ప్లాఫ్ చిత్రం వచ్చిన పవన్ అభిమానుల్లో మార్పు రాలేదు. ఆతరవాత అనేక చిత్రాలు ఎవరేజ్ చిత్రాలుగానే ఉన్న పవన్ అభిమానులు ఎప్పుడు ఆరాదిస్తూనే ఉన్నారు. గబ్బరి సింగ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది, అయినా పవన్ విబిన్నమైన ప్రవర్తనతో ప్రచారానికి దూరంగానే ఉండడం పవన్ గెలుపు ఓటములకు అతీతంగానే ఉండే తీరు ఆయన అభిమానుల్లో ఇంకా అభిమానం పెంచింది.


అర్జున్ రెడ్డి చిత్రంతో పాపులర్ అయిన విజయ్ దేవరకొండ అందుకు భిన్నంగా మహానటి చిత్రంలో నటించి మెప్పించారు. ఇప్పుడు గీతగోవిందం చిత్రంలో పూర్తీ అర్జున్ రెడ్డి చిత్రానికి పూర్తీ భిన్నంగా ఉన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంలో నటించి అందరిని మెప్పిస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ విజయపరంపర మొదలైంది. విజయ్ దేవరకొండ నటన అందరిని ఆకట్టుకుని, పలువురి ప్రశంశలు కూడా పొందుతున్నారు. తన నటనతో యువతని ఎక్కువ ఆకర్షిస్తున్న విజయ్ దేవరకొండ, తక్కువ చిత్రాలతో ఎక్కువ పాపులారిటీ పొందారు. ‘VijayDevaraKonda Young Hero Compared with Pawan’ పవన్ కళ్యాణ్ అశేష అభిమానులతో పాటు యువ హీరోల అభిమానం కూడా సంపాదించుకున్నారు.

అయితే గీతగోవిందం చిత్రం విజయం సందర్భంగా ఒక ప్రెస్ మీట్లో విజయ్ దేవరకొండ ని పొగుడుతూ విజయవంతమైన చిత్రాల నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ తరువాత అంతటి హీరో విజయ్ అన్నట్టుగా మాట్లాడడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ చిత్రంతో విశేషమైన ప్రాచుర్యం లభిస్తే, ఆ స్థాయి ఆదరణ అటు తరువాత ఎవరికీ రాలేదు, మరల ఇప్పుడు విజయ్ దేవరకొండ యువహీరోకి వచ్చింది అనేది. దిల్ రాజుగారి ప్రస్తావన. ఇది పవన్ అభిమానుల్లో చరించి, కొంతమంది సోషల్ మీడియా వెబ్ సైట్ల ద్వారా పోలిక పెట్టవద్దని స్పందించారు. VijayDevaraKonda Young Hero Compared with Pawan

GitaGovindam Movie Big Hit For Vijay Devarakonda

విజయానికి పరాజయానికి రెండింటితో సంభందం లేకుండా పవన్ ఆరాధించే స్థాయిలో పవన్ అభిమానులు ఉంటే, ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న విజయ్ దేవరకొండ యువ హీరోతో పోలికపెట్టడం సరికాదనే భావన ఉంటుంది. నటుడి నటన శైలిని ఇష్టపడే సినీ అభిమానులు ఎవరి నటన శైలికి తగ్గట్టుగా వారికీ ఏర్పడుతూ ఉంటారు. సాదారణ వ్యక్తిని ఇంకొక వ్యక్తితో పోల్చి చూడవద్దని పెద్దలు చెబుతూ ఉంటే, హీరోల్లో పోలిక పెట్టి ప్రకటన చేయడం అంత సబబు అయిన పని కాదనే భావనకే బలమెక్కువ. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ కొత్త స్టార్ హీరోల జాబితాలో వేగంగా చేరారు. “VijayDevaraKonda Young Hero Compared with Pawan” స్టార్ హీరోలు ఎక్కువమంది ఉంటే చిత్ర పరిశ్రమ అంతగా బాగుంటుంది, ఇలా మరింతమంది స్టార్ హీరోలు రావాలి. విజయ్ దేవరకొండకి గీతగోవిందం విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

అభిమానం అంటేనే అంత తేలికగా పోయేది కాదు ఒకసారి ఏర్పడినతరువాత అది అలానే అచిరకాలం కొనసాగుతుంది. అలాంటి అభిమానులను దృష్టిలో ఉంచుకుని మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు, అప్పుడప్పుడు విజయవేడుకల్లో వచ్చే మాటలు కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చక పోవచ్చు. గీతగోవిందం చిత్రం విజయోత్సవంలో చిరు ఫ్యామిలీ అంతా విజయ్ దేవరకొండని స్టేజిపై పొగడడం విశేషం. అలాగే దిల్ రాజు ఒక స్టార్ హీరోగా విజయ్ దేవరకొండని పరిగణించారు. సిని అభిమానులు గీతగోవిందం చిత్రానికి ఇస్తున్న ఆదరణ ఆ విషయాన్నీ బలపరుస్తున్నాయి.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra