Menu Close

ArjunReddy Fame Vijay Devarakonda Movies TaxiWala, GeetaGovindam

ArjunReddy Fame Vijay Devarakonda Movies TaxiWala, GeetaGovindam

ArjunReddy Fame Vijay Devarakonda Movies TaxiWala, GeetaGovindam

ArjunReddy Fame Vijay Devarakonda Movies TaxiWala, GeetaGovindam అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ చిత్రాలు టాక్సీవాలా, గీతగోవిందం తెలుగులో రాబోతున్న చిత్రాలు అయితే విజయ్ దేవరకొండ రవిబాబు దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణంలో వచ్చిన నువ్విలా చిత్రంలో విష్ణు పాత్రతో తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయ్యాడు. శేఖర్ కమ్ముల స్వీయ దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో అజయ్ అలరించి, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నానితో వెండితెరను షేర్ చేసుకుని పెళ్ళిచూపులు చిత్రంలో అందరికి హీరోగా పరిచయం అయ్యాడు. పెళ్లిచూపులు చిత్రం పెద్ద విజయాన్నిసాధించింది.

ద్వారక చిత్రంలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్ర విజయంతో విజయవంతమైన యువ హీరోల జాబితాలో చేరాడు. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో వచ్చి 50 కోట్ల వసూలు చిత్రంగా నిలిచింది. అర్జున్ రెడ్డి చిత్రం నిర్మాతలకు లాభాలను, దర్శకుడికి మంచిపేరును, విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. వాస్తవానికి శర్వానంద్ హీరోగా తెరకేక్కిద్దామని దర్శకుడి ప్రయత్నం అయితే, శర్వానంద్ కాల్ షీట్స్ లేక అదృష్టం విజయ్ దేవరకొండని వరించి అతడిని అర్జున్ రెడ్డిని చేసింది. ఆగష్టు 26 2017 లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా అర్జున్ రెడ్డి నిలిచింది.

శ్రీధర్ మర్రి దర్శకత్వంలో ఏ మంత్రం వేసావే చిత్రంలో నటించగా, మహానటి చిత్రంలో సమంతా సరసన విజయ్ అంటోనిగా నటించి మెప్పించాడు. మహానటి తెలుగు తమిళ భాషలలో ప్రముఖ ప్రసిద్ద నటి సావిత్రి జీవిత కధ ఆధారంగా వచ్చి అందరిని మెప్పించి అద్బుతవిజయం అందుకుంటే ఆ చిత్ర యూనిట్ మొత్తానికి మంచిపేరు వచ్చింది. సావిత్రిగా కీర్తి సురేష్, సావిత్రి గారి గురించి తెలుసుకునే జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంతా నటిస్తే, ఫోటోగ్రాఫర్ విజయ్ అంటోని పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు. మహానటి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, మహానటి చిత్రాల తరువాత తెలుగువారికి యువ కధానాయకుడుగా సుస్తిరం అయిన విజయ్ దేవరకొండ నటిస్తున్న తదుపరి చిత్రం టాక్సీవాలా. కామెడీ త్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం జూలై 27న విడుదల అవ్వడానికి సిద్దం అవుతుంది. టాక్సీవాలా చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుంటే, ప్రియాంక జ్వల్కర్, మాళవిక నాయర్ విజయ్ దేవరకొండకు జతగా నటిస్తున్నారు.

గీతగోవిందం చిత్రంగా చిత్ర టైటిల్ ఉండడంతో బాటు యువ హీరో విజయ్ దేవరకొండ శివ కారక్టర్ చేస్తుండగా, రష్మిక మందన జతగా నటిస్తుంది. విజయ్ దేవరకొండ నేను 25 సంవత్సరాలు ఇంకా వర్జిన్ అనే శీర్షికతో పోస్టర్ ఉండడం, ఈ చిత్రంపై చిత్ర ప్రేక్షకుల్లో ఉత్సుకతని పెంచుతుంది. పరశురాం దర్శకత్వంలో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం తెరకెక్కుతుంది. ఆగష్టు 15 2018 లో ఈ చిత్రం విడుదల అవుతుందని అంటున్నారు.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra