Aravindasametha veeraraghava Telugu Upcoming Movie Jr. NTR

Aravindasametha veeraraghava Telugu Upcoming Movie Jr. NTR, Trivikram Srinivas Combination.

Aravindasametha veeraraghava Telugu Upcoming Movie Jr. NTR, Trivikram Srinivas Combination త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో అరవింద సమేత వీరరాఘవ కొత్త చిత్రం రూపొందుతుంది. నిరవదిక షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమాన అంచనాలు ఆలోచనలు అత్రంగానే సాగుతూ ఉంటాయి. ఎన్టిఆర్ అభిమానులతో పాటు దర్శకుడుని అభిమానించే వారు ఈ చిత్రం విడుదల అయ్యి రికార్డులు సృష్టించాలనే కోరుకుంటూ ఉంటారు.

మాటలు కూడా అందంగా అనిపించే చిత్రాలు అంటే త్రివిక్రమ్ కలం నుండి వ్రాసిన మాటలే అంటారు. అంతలా తన మాటలతో మాయచేసి సినిమాని ప్రేక్షకుల మనసులోకి తీసుకువెళ్లగలిగే శక్తి త్రివిక్రమ్ రచనా పటిమను తెలియజేప్పుతుంది. నువ్వునాకునచ్చావ్ లాంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వేనువ్వే చిత్రం ద్వారా దర్శకుడుగా మారి అతడుతో అతనెవరో మరింతమందికి జులాయిగా పరిచయం అయ్యి అత్తారింటికి దారేది అని అడిగిన మాటల మాంత్రికుడు దర్శక మాంత్రికుడుగా కూడా విజయవంతం అయ్యారు.

చిరంజీవి – అర్జున్ కలయికలో వచ్చిన శ్రీమంజునాధ గురించి చదవండి

jr. ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) నిన్నుచూడాలని సినిమాతో పరిచయమై స్టూడెంట్ నెం1 చిత్రంతో సన్నిహితుడై సింహాద్రితో చిన్నాపెద్ద అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కొన్ని వైవిధ్యమైన చిత్రాలలో వివిధ దర్శకులతో సినిమాలలో నటించిన ఎన్టిఆర్ రాఖి సినిమాలో ఆంధ్రుల ఆడపడుచులకు అన్నయ్య పాత్రలో మెప్పించి మరలా టెంపర్ చిత్రంతో ఆడువారి పై పైశాచికంగా ప్రవర్తించే వారిని హింసతోనే శిక్షించి, నాన్నకు ప్రేమతో అంటూ అందరి నాన్నల హృదయాన్ని గెలుచుకుని ప్రకృతిని ప్రేమించే వ్యక్తి ప్రకృతిని కాపాడే లక్ష్యంతో జనతా గారేజ్ అంటూ జాయిన్ అయ్యి అన్ని రిపేర్లు చేసే వ్యక్తిగా జనాల హృదయాల్లో జీవించే ఎన్టిఆర్ మరియు త్రివిక్రమ్ కలియక అంటే ఇష్టపడని సినీప్రియులు ఎవరుంటారు?

Aravindasametha veeraraghava Telugu Upcoming Movie Jr. NTR & Trivikram Srinivas

వీరిద్దరి కలియకలో షూటింగ్ చేసుకుంటున్న అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో పూజ హెగ్డే నటిస్తుండగా చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్ కంపోసింగ్ ఇస్తున్న అరవిందసమేతవీరరాఘవ చిత్రంలో కాజల్ అగర్వాల్ గెస్ట్ అప్పిరియన్స్ గా కనబడునుందని వార్తలు, అయితే ఇంతకుముందు ఇలాగే జనతా గారేజ్ చిత్రంలో ఒక పాటలో కాజల్ అగర్వాల్ డాన్స్ చేసింది. ఆ సినిమా హిట్ వలన మరలా అది రిపీట్ చేస్తుండవచ్చు.

కంచికామాక్షి మహిమలు గురించిన చిత్రం గురించి చదవండి

మే19న విడుదల అయిన అరవింద సమేత వీరరాఘవ చిత్ర ఫస్ట్ లుక్ మిలియన్స్ వ్యూస్ కలిగి ఉంది, పేరును బట్టి చూస్తే ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టొరీ అన్నట్టుగా అర్ధం అయితే, వార్తలు కూడా రాయలసీమ పద్దతిలో చెప్పే డైలాగ్ నాది రాయలసీమ అని కూడా ఒకటి ప్రచారంలో ఉంది.  సుమన్ రెడ్డి రచించిన కధతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ తమన్ సంగీతం అందిస్తుంటే హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై కే రాధాకృష్ణ నిర్మాణంలో అరవింద సమేత వీరరాఘవ చిత్రం రూపొందుతుంది. ఇక ఈ చిత్రం విడుదల ఆగష్టు 2018 లో ఉండవచ్చు.

దేవుళ్ళు చిత్రం గురించి చదవండి

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra