జబర్దస్తు మనిషి మది చిత్రంగా విచిత్రంగా మారుతూ ఉంటుంది.

జబర్దస్తు మనిషి మది చిత్రంగా విచిత్రంగా మారుతూ ఉంటుంది.

జబర్దస్తు మనిషి మది చిత్రంగా విచిత్రంగా మారుతూ ఉంటుంది. జబర్దస్తుగా ఉండే మనిషి మనసు కనబడకుండా ఉండే కంప్యూటర్ సాఫ్ట్ వేరులాగా మనిషి చేసే పనులు, వ్యక్తి ప్రవర్తనను నియంత్రిస్తూ మనిషికి గుర్తింపు తెస్తుంది, అని అంటారు. ఎక్కువ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసినప్పుడు, కంప్యూటర్ హాంగ్ అయితే, అప్పటికి తాత్కాలికంగా ఆ ప్రోగ్రామ్స్ క్లోజ్ చేసి రిఫ్రెష్ చేస్తాం. తరువాత కంప్యూటర్ యదాతదంగా పనిచేస్తుంది. అలాగే మొబైల్ ఫోన్లో ఎక్కువ ఆప్స్ ఓపెన్ చేస్తే అది కూడా హాంగ్ అవుతుంది, అప్పుడు రామ్ క్లీన్ చేసి, జంక్ ఫైల్స్ క్లియర్ చేస్తాం. చిత్రంగా తాకేతెరపై విచిత్రంగా వచ్చే తెరచిత్రాలు మనిషి మనసులో మెదిలిన సాంకేతికత వలననే. అటువంటి మనసుని పోలి కనబడని సాఫ్ట్ వేర్ హార్డ్ వేర్ పరికరాలపై నియంత్రణ కలిగి ఉంది.

కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ కనబడని సాఫ్ట్ వేర్ తో నియంత్రణ పొంది ఉంటే, మనిషి మనసు కూడా కనబడకుండా మనిషిచే పనులు చేయిస్తుంది. కంప్యూటర్ / స్మార్ట్ ఫోన్ హ్యాండ్ అయితే ఆప్స్ / ప్రోగ్రామ్స్ క్లోజ్ చేస్తాం, మరి మనిషికి ఆ సమస్య వస్తే, అంటే తలపోటు, నిద్రలేమి వంటివి వస్తే, వెంటనే టాబ్లెట్ / కాప్సుల్ వేసేస్తాం. టాబ్లెట్ / కాప్సుల్ శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్ని అదుపు చేస్తుంది. జబర్దస్తుగా ఉండే మనిషి మనసు చేసే ఆలోచనలు, ఆ ఆలోచన నియంత్రణ చేయవలసింది మనిషే, అంటారు. కంప్యూటర్/స్మార్ట్ ఫోన్లో ఆప్స్/ప్రోగ్రామ్స్ తాత్కాలికంగా ముగిస్తే మరలా అవి సాధారణ స్థితిలో పనిచేస్తున్నట్టుగా, మనసులో ఆలోచనలు నియంత్రణ చేయగలిగితే వచ్చే ఫలితం కూడా అటువంటిదే అంటారు.

భగవంతుడిని కూడా మెప్పించాగలిగే మనిషి తన మనసుని తన నియంత్రణలో ఎల్లవేళాలా ఉంచుకోవడం సాధ్యపడదు అంటారు. ఈ విషయం పాతచిత్రాల్లో ఋషుల చరిత్రను కలిగిన చిత్రాలను చూస్తే అవగతం అవుతుంది. జబర్దస్తు మనిషి కన్నా మనసు మరింత జబర్దస్తుగా పైకి కనబడకుండా జబర్దస్తు పనులను చేయిస్తూ ఉంటుంది. అది బాగోకపోతే నేర్పరిచేత కూడా తప్పు పొరపాటు పనిని చేయిస్తుంది. మనిషి మనసు చాల చాలా జబర్దస్తు విషయాలను కలిగి ఉంటుంది. చిత్రమైనా విచిత్రమైనా అది ఆలోచనగా మదిలో మెదిలి సచిత్రంగానో సుచిత్రంగానో సాద్యమైన మేరకు వ్యాప్తిచెందుతుంది. జబర్దస్తు మనిషి మది చిత్రంగా విచిత్రంగా మారుతూ ఉంటుంది.

మనసుకన్నా చిత్రం విచిత్రం మరొకటి సాటిరాదు.

కొంతమంది మాటలతో ఎదుటి మనిషిని మెప్పిస్తారు, కొంతమంది వారి పనుల చేత ఎదుటి మనిషిని మెప్పిస్తారు, కొంతమంది ప్రవర్తన చేత ఎదుటివారిని మెప్పిస్తారు. అలా మాటలు, చేతలు, ప్రవర్తనను చేయించేది జబర్దస్తు మనసే, అంతేకాదు మెప్పించబడే వ్యక్తిలో ఉండేది కూడా అదే అంటే అది జడ్జి కూడాను కదా ! అందరిలో ఉంటూ అన్నింటిని చేయిస్తూ అన్నింటిని ఆస్వాదిస్తూ అంతటా ఉండే మనసు, మనిషి మనిషికి తన ప్రవర్తనను మార్పు చేస్తూ కనబడకుండా జబర్దస్తు విషయాలను కలగజేస్తుంది. చిత్రం విచిత్రం మనిషి మదిలో మెదిలే చిత్రవిచిత్ర విషయ వాసనల శక్తి అద్బుతమే.

ఎంత చిత్రం అంటే కోట్లమంది మదిని ఎలా మెప్పించాలో అలా ఆలోచన చేసి కధను రాసి, ఆ కధని కదిలే చిత్రాల రూపంలో వెండితెరపై ప్రదర్శన చేస్తుంది. ఆ జబర్దస్తు ప్రదర్శనని కోట్లమంది వీక్షించి సంతోషిస్తారు, చిత్రమే కదా ఒక వ్యక్తి మనసు చేసిన కల్పనను కోట్ల రూపాయల ఆస్తికలిగిన వ్యక్తి / సంస్థ ఒక చలనచిత్రంగా రూపొందిస్తే, బంగారం కన్నా విలువైన మూడుగంటల తమ సమయాన్ని కొంతమంది వ్యక్తులు తెరపై చేసే ప్రదర్శనని కోట్లమంది ఖర్చు చేయడం అంటే ఎంత విచిత్రమో. చిత్రంగా వస్తుంది ఆలోచన విచిత్రంగా వెళుతుంది వెండితెరపైకి, వివేకంతో వచ్చిన అంత సాంకేతికత అంతా మనిషి మనసు నుండి అభివృద్ధి చెంది ఉన్నది, ఇదీ మరీ చిత్రం.

మనసు పట్టుకోవడం తేలిక వదలడం కష్టమని అంటారు, ఒక చిత్రం చూసిన మనసు మరలా ఇంకో చిత్రం చూస్తుంది, మరోసారి మరో విచిత్రాన్ని చూస్తుంది, మరలా మరోచిత్రాన్ని చూస్తుంది. మెచ్చిన చిత్రానికి జై కొడుతుంది లేదా చిత్ర కారకానికి జై జై చెబుతుంది. జై కొట్టే వ్యక్తులలో ఉండేది, జై కొట్టించుకునే చిత్రకారక వ్యక్తులలో ఉండేది మనసే. జబర్దస్తుగానే జై జై అనడమో జై జై అనిపించుకోవడమో చేస్తుందంటే ఎంతగొప్ప మనసు.

మనసుకి మనసే సాధనం

సరే మనసు గొప్పది అది అందరికి ఉన్నదే అయితే ఏమిటి అంటే ? ఎల్లవేళలా అందరికి అందుబాటులో ఉండే విషయం మనసుకి లోకువ అంటారు. ఇది మరో విచిత్రంగా ఉంటుంది. నీరు వర్షాకాలం వృదా చేస్తూ వేసవికాలం దాచుకుంటారు. ఇలా ప్రకృతిలో గాలి, నీరు చాలానే విలువైనవి అవి లేనిదే మనిషి జీవితం లేదు అయినా వాటి రక్షణ కన్నా తాత్కాలిక అవసరనికే ప్రాధాన్యత పెరిగింది అని అంటారు. బంగారం అరుదుగా దొరుకుతుంది ధర ఎక్కువ, వరి ఎక్కువగా ఉంటుంది మనిషికి నిత్యావసరం. అవసరం, అత్యవసరం, నిత్యావసరం, అనవసరం అనేవి అందరిలో అంతటా ఉండే మనసు ఆడుకునే సాధనాలు ఉంటాయి. భలే చిత్రం బహువిచిత్రం సావధానంగా ఆలోచన చేస్తే మనిషి మది కేవలం గదికిమాత్రమే పరిమితం కాదు ప్రపంచాన్నే గదిలోకి తెచ్చే జబర్దస్తు సామర్ధ్యం కలది.

ఇలా మనిషి మదిని ఆకర్షించే వస్తు విషయాలు మనోరంజక సంగతులు చాలానే ఉంటే, ఆచరణ ధర్మానికి కట్టుబడ్డ మనసుకి కష్టపడే కాలం వచ్చి ఇష్టమైన వస్తు విషయాలకు దూరంగా ఉండవలసి రావడం అంటే, కష్టమైనా ధర్మంకోసం ఇష్టంగా జబర్దస్తు మనసు చేస్తుంది. అయితే ఆలోచనలలో మునిగిన మనసు, కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ హాంగ్ అయినట్టు ఒకోసారి మొరాయిస్తూ ఉంటుంది. అటువంటప్పుడే కష్టమంటారు అందరూ. ఆలోచనలు ఆపడంతో బాటు శారీరకంగా ఔషదం ఇస్తే సరిపోతుంది అంటారు. ఔషదం అంటే టాబ్లెట్ / కాప్సుల్ వేస్తె సరిపోతుంది శరీరానికి కానీ మనసులో ఆలోచనలు ఆపడం ఎలా అంటే. అది ఆ వ్యక్తివలననే సాధ్యమని, చిత్రంగా మరలా మదిలోనే ఆలోచనకు అడ్డుకట్ట మదితోనే పడాలి అంటారు. జబర్దస్తు మనిషి మది చిత్రంగా విచిత్రంగా మారుతూ ఉంటుంది.

ఆరాటం పోరాటాల మద్య ఆలోచనా అంతరంగం తరంగాలవాలే వస్తూనే ఉంటాయి. నీటి తరంగాలలో ఒకేవిధంగా రావాలంటే దానిలో ఇంకోవస్తువు పడకూడదు, అలాగే మనసు నిశ్చలమైన నీరు అయితే ఆలోచనలు తరంగాలు అయితే కొత్త ఆలోచనలు రాకుండా ఉంటే పాత ఆలోచనలు తరిగితే నిదానంగా విశ్రాంతి పొందే మనసు నియంత్రణలో ఉంటుంది అంటారు. మనసు నిశ్చలం అయితే జబర్దస్తు మనిషి ఇంకా జబర్ధస్తుగా మారతాడు. మనసుకు విశ్రాంతి ఒక్కోసారి దృష్టి మొత్తం మారినప్పుడు కలుగుతుంది, హాస్యచిత్రాలకు అందుకు ఒక సాధనం అవుతాయి. ఆహ్లాదకరమైన హాస్యచిత్రాల వీక్షణ కూడా మనసుని కాసేపు అనేక ఆలోచనల నుండి చిత్రంగా మళ్లిస్తాయి. మరలా అప్పుడుకుడా ఆలోచన అంటే ఇక మార్గం ధ్యానమే.

హాస్యచిత్రాలవీక్షణ మదికిమందంటారు

మంచి ఆహ్లాదకరమైన హాస్యప్రేమకదా చిత్రాలను చూస్తే జబర్దస్తు మనసు ఇంకా జబర్దస్తుగా ఆనందిస్తుంది. హాస్యచిత్రాల కధానాయకులు రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్ చిత్రాలు ఎక్కువగా హాస్యప్రధానంగా సాగుతూ అందరిని అలరిస్తూ ఉంటాయి. అయితే గతకొంతకాలంగా అగ్రహీరోల చిత్రాలకు కూడా హాస్యం ఎక్కువ మోతాదులో నడిచే చిత్రాలుగా చాలానే వచ్చాయి. అన్నయ్య, శంకర్ దాదా MBBS, జైచిరంజీవ, నువ్వునాకునచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు, దూకుడు, జులాయి, బాద్ షా లాంటి చిత్రాలలో లవ్, యాక్షన్, డ్రామాతో బాటు కామెడీ ఎక్కువగా ఉంటుంది.

పరమానందయ్య శిష్యుల కధ, భామావిజయం, అహనా పెళ్ళంట, చెట్టుకింద ప్లీడర్, బావబావ పన్నీరు, ఎదురింటిమొగుడు పక్కింటిపెళ్ళాం, విచిత్రప్రేమ, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, పరుగో పరుగు, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, లేడీస్ టైలర్, కొబ్బరిబొండం, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం, తేనెటీగ, అప్పుల అప్పారావు తదితర రాజేంద్రప్రసాదు కధానాయకుడుగా చిత్రాలు హాస్యంతో అలరిస్తాయి. పక్కింటి అమ్మాయి, సీతామహాలక్ష్మి, రాధాకళ్యాణం, ముచ్చటగా ముగ్గురు, గాంధీనగర్ రెండవవీధి, మన్మధలీల కామరాజుగోల, మకుటంలేని మహారాజు, నాకుపెళ్ళాంకావాలి, తోడల్లుళ్ళు, వివాహాభోజనంబు, జూలకటక, బాబాయ్ అబ్బాయ్, దొంగకోళ్ళు, రెండురెళ్ళు ఆరు, చిన్నోడు పెద్దోడు, మామఅల్లుడు, డబ్బెవరికి చేదు, గుండమ్మగారి కృష్ణులు, రంభరాంబాబు, పడమటి సంధ్యారాగం, చంటబ్బాయ్, నారి నారి నడుమమురారి, రామారావు గోపాలరావు, బావ బావ పన్నీరు, పోలీసు భార్య, శ్రీవారికి ప్రేమలేఖ, చూపులుకలిసినశుభవేళ, చిత్రంభళారేవిచిత్రం, యమలీల, పిట్టలదొర, పట్టుకోండి చూద్దాం, చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, శుభమస్తు,  ఆడుతూ పాడుతూ, ఆనందం, వెంకీ, డి, రెడీ, కితకితలు, అత్తిలిసత్తిబాబు, సీమశాస్త్రి, గమ్యం, బెండు అప్పారావు, బెట్టింగ్ బంగార్రాజు, కత్తి కాంతారావు, యముడికిమొగుడు మొదలైన హాస్యభరిత చిత్రాల మనోల్లసంగా సాగుతాయి. కామెడీ టివి షోలో జబర్దస్తు వారంలో రెండురోజులు ఈటివిలో ప్రసారం అవుతుంది.