అత్యదిక వ్యూస్ పొందిన అల్లు అర్జున్ సరైనోడు హిందీ డబ్బింగ్ చిత్రం

అత్యదిక వ్యూస్ పొందిన అల్లు అర్జున్ సరైనోడు హిందీ డబ్బింగ్ చిత్రం

అత్యదిక వ్యూస్ పొందిన అల్లు అర్జున్ సరైనోడు హిందీ డబ్బింగ్ చిత్రం అయితే అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అంటూ దేశభక్తి చిత్రం తరువాత బన్నీ ఏచిత్రంలో నటించేది ఇంకా కచ్చితం కాలేదు. అల్లు అర్జున్ కోసం విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు వార్తల వరకే పరిమతంగా ఉంది. అయితే అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం యూట్యూబులో వీరవిహారం చేస్తుంది. ఇప్పటిదాకా 200 మిలియన్ వీడియో వీక్షణలు పొందింది, మారే తెలుగు చిత్రం పేరునా ఈ రికార్డు లేకపోవడం విశేషం.

హిందీ భాషలోకి డబ్ చేయబడి అంతగా ఆదరణ పొందిన సరైనోడు తెలుగు చిత్రాన్ని చూసి, బన్నీ హిందీ భాషా చిత్రంలో నటించే అవకాశం ఉందనేది కొత్త వార్త. బాలీవుడ్లో బన్నీ చిత్రం ఉండడం వలననే ఇంకా అల్లు అర్జున్ ఏ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు అనేది సమాచారం. అయితే ఒకవేళ సరైనోడు చిత్రం హిందీలో రీమేక్ చేసి చేస్తారా లేకా కొత్త కధతో బాలీవుడ్లో బన్నీ ఎంట్రి ఉంటుందా అనే విషయం కోసం వేచి చూడాలి.

యూట్యూబ్లో అంతగా ఆదరణ పొందడానికి కారణం చిత్రంలో అల్లు అర్జున్ యాక్షన్ సన్నివేశాలు. సూపర్ హిట్ అయిన సరైనోడు చిత్రంలో బన్నీ ఎనర్జిటిక్ యాక్టింగుతో అధరగొట్టేశాడు. శ్రీకాంత్ – బన్నీల మధ్య వచ్చే సన్నివేశాలు సెంటిమెంట్ ని బాగా పండిస్తాయి. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో పవర్ ఫుల్ గా నటిస్తే, అంతే పోటీగా అల్లు అర్జున్ యాక్షన్ ఉంటుంది. ఏ విషయంలోను రాజీపడని ముఖ్యమంత్రి కొడుకు ఆది, ఎదురులేని ఆదికి ఎదురెళ్ళి అడ్డగించడంలో అల్లు అర్జున్ ఎనర్జిటిక్ నటన ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.

చిత్రంలో ఎంఎల్ఏ (కేధరిన్) అందాన్ని ప్రేమించే బన్నీ, ఆమెను నిశ్చితార్ధం వరకు వచ్చాక, రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీతో కధ మొత్తం మారిపోయి, బలమైన బంధంవైపు మళ్ళుతుంది. ఆ బంధాన్ని కాపాడుకునే క్రమంలో ప్రతినాయకుడి పాత్రను ముగిస్తాడు, ఈ సరైనోడు. అటువంటి సరైనోడు చిత్రం రీమేక్ చేసినా చేయవచ్చు.

దర్శకుడు విక్రమ్ కుమార్ ఇంతకుముందు ప్రేమకద, కుటుంబ కదా చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి, అక్కినేని కుటుంబంతో మనం చిత్రం దర్శకత్వం వహించాడు. అంతకుముందు నితిన్ – నిత్యమేనన్ కాంబినేషన్లో వచ్చిన ఇష్క్ చిత్రం కూడా విజయవంతం అయ్యింది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ – విక్రమ్ కుమార్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చూడాలి.

అల్లు అర్జున్ బన్నీ

ప్రేమకధ అయినా కుటుంబ కధ అయినా అల్లు అర్జున్ నటన ఆకట్టుకునేదిగానే ఉంటుంది. ఆర్య చిత్రంలో ఒక ప్రేమికుడుగా ప్రేక్షకులను మెప్పిస్తే, పరుగు చిత్రంలో ఒక భాద్యత తెలిసి వచ్చి, పరిణితి చెందిన యువకుడుగా కనిపిస్తాడు. వరుడు చిత్రంతో పూర్వకాలపు పద్దతిలో జరిగే పెళ్లి మాదిరి తన పెళ్లి కూడా జరగాలని పట్టుబట్టి పాతపద్దతిలో పరిణయమాడిన వరుడుగా అల్లు అర్జున్ నటనతో ఆకట్టుకున్నాడు. సన్ of సత్యమూర్తి చిత్రంలో అచ్చం సత్యమూర్తిగారి అబ్బాయిగానే అనిపిస్తాడు.

అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ ఉంటుందా హిందీ చిత్రం ఉంటుందా తేలాలి.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra