కుటుంబసమేతంగా చూడదగిన కుటుంబకధా తెలుగు చలనచిత్రాలు​

కుటుంబసమేతంగా చూడదగిన కుటుంబకధా తెలుగు చలనచిత్రాలు​

కుటుంబసమేతంగా చూడదగిన కుటుంబకధా తెలుగు చలనచిత్రాలు

తెలుగు చిత్రాలు అనేకంగా వస్తున్నాయి, అధునాతన కధలతో చిత్రమైన కధనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా వస్తున్నాయి. కానీ కుటుంబసమేతంగా చూడదగిన కుటుంబకధా తెలుగు చలనచిత్రాలు అంటే నెట్లో వెతకాల్సి ఉంటుంది. భవిష్యత్తు సామాజిక దృష్టికన్నా ఇప్పుడు సామాజిక పరిస్థితులతో కలిసి చిత్ర కధలు కధనాలుగా తెరకేక్కుతున్నాయి. కామెడీ కోసం తనపై తనే జోకులేసుకునే స్థితిలో కూడా కొన్ని చిత్ర సన్నివేశాలు ఉంటున్నాయి. సినిమా అంటే చిన్న, పెద్ద, యువత అందరు చూసే చిత్రం అయితే కొన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూసే వీలులేని సన్నివేశాలతో కలిసి ఉంటున్నాయి.

కధాంశం ఉపయుక్తమైనదిగా ఉన్న సన్నివేశాలు మాత్రం అనుసరణ బుద్దికలవారికి చెడుని దగ్గర చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతికత అభివృద్ధి చెందాక నెట్ ద్వారా టివిలలో కావాల్సిన చిత్రాలను చూసే అవకాశం ఉంది. సాంకేతికత పరిచయం ఎక్కువగా ఉన్నవారికి గతకాలపు మంచి చిత్రాల పరిచయం ఉండి, ఉండకపోవచ్చు. తెలిసినవారికి తెలియనివారికీ గుర్తు ఈ చిత్రాలు కొన్ని చిత్రాలు కాళీ సమయంలో కాలక్షేపంతో బాటు మంచి సందేశాలు అందించే కుటుంబ కధా చిత్రాల గురించి కొంత సంక్లిప్త వివరణ దిగువలో చదవగలరు.

సూత్రదారులు

సూత్రదారులు తెలుగు చలనచిత్రం అక్కినేని, మురళిమోహన్, సుజాత, భానుచందర్, కైకాల సత్యనారాయణ, కెఆర్ విజయ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం. గంగిరెద్దును ఆడించే వృత్తిలో హనుమద్దాసు పాత్ర(అక్కినేని నాగేశ్వర రావు)లో అతని బావమరిది అనుచరుని పాత్రలో మురళి మోహన్ నటించారు. పల్లెలో ఉండే పెద్దమనిషి (కైకాల సత్యనారాయణ) కామ దాహానికి హరికధలు చెప్పుకునే వ్యక్తియొక్క భార్య (కెఆర్ విజయ) గురి అవుతుంది. ఇక ఆమె ఊరినుండి పట్నానికి వెళ్ళుతుంటే, హనుమద్దాసు కొడుకు ఆమెకూడా వెళతాడు. అలా వెళ్ళిన హ హనుమద్దాసు కొడుకు కలెక్టర్ (భానుచందర్) అయ్యి ఊరికి తిరిగి వస్తాడు. ఊరి పెద్ద మనిషి ఆగడాలను ఆ ఊరి జనాలతోనే అడ్డగించే విధంగా చేయడంలో ఒక ఐఏఎస్ అధికారి(భానుచందర్), అతని తల్లిదండ్రులు చేసే ప్రయత్నం. సమస్య వచ్చినప్పుడు రావాల్సింది కోపం కాదు ఆలోచన, ఆలోచనతో సమస్యను సమూలంగా రూపుమాపాలని ఈ చిత్రం చూపుతుంది. కలెక్టర్ అయినా తనవారి అదుపు ఆజ్ఞానలలో ఉండే వ్యక్తిగానే భానుచందర్ వ్యక్తిత్వం, అతనిపై రమ్యకృష్ణకి ఉండే ప్రేమ ఒక పల్లె కధ అందంగా కనబడుతుంది. ఈచిత్రం సందేశంతో ఉంటుంది కానీ సరదాగా సాగుతుంది.

K విశ్వనాథ్

కళాతపస్వి కె విశ్వనాధ్. ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు. వాస్తవికతకు దగ్గరగా సమాజంలోని పరిస్థితులను చూపిస్తూ, వ్యక్తికి కావలసిన వ్యక్తిత్వవిలువలను ప్రతిబింబించే విధంగా చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. సందేశాత్మక శుభ సూచిక చిత్రాల దర్శకుడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం,స్వాతిముత్యం,సిరివెన్నెల, శృతిలయలు, సాగరసంగమం, స్వయంకృషి,స్వాతికిరణం శుభసంకల్పం లాంటి గొప్ప చిత్రాలకు దర్సకత్వం చేసారు.

కుటుంబంలో అమ్మమనసుని చూపుతూ మదిని తాకే చిత్రం

అమ్మరాజీనామ

ఊర్వశి శారద ప్రముఖ నటి

అమ్మరాజీనామా చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న శారదగారు రెండు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు.

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ ! ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంబింపచేసే తంత్రాలు ఎన్నో || పాటని వ్రాసి పాటకలిగిన చిత్రాన్ని తెరకెక్కించినది స్వర్గీయ దాసరి నారాయణరావుగారు.  పిల్లలకి చేసే సేవలో కష్టం మాట మరిచి, కుటుంబ భాద్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించే ఇంటి ఇల్లాలి కధ. పెరిగిపెద్దయ్యాక వచ్చిన మార్పులతో అమ్మమనసు గాయపడి అమ్మే రాజీనామా చేస్తే ఎలా ఉంటుందో చూపుతూ, వచ్చిన చిత్రం అమ్మరాజీనామా. పిల్లల మనస్తత్వాన్ని అర్ధం అయ్యినా పెద్దవారిగా వారి బుద్దులు చూసి బుద్ది తెచ్చుకుని నడిచే తల్లిగా శారద గారి నటన బాగుటుంది. పిల్లలకు కష్టం కలిగితే తల్లడిల్లే అమ్మ చేసే త్యాగానికి హద్దులుండవు అని చాటే చిత్రం. తెలుగు కుటుంబ కదా చిత్రం. ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్నా కమ్మని కావ్యం సిరివెన్నల రాసిన పాట ప్రేక్షకాదరణ పొందింది. శారద, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, సాయికుమారు తదితరులు నటించారు. దాసరి నారాయణగారి దర్శకత్వం వహించి, ఒక బిక్షగాడి పాత్రలో నటించారు. అమ్మపై వచ్చిన చిత్రాల్లో అమ్మ గురించి బాగుగా చెప్పిన సాంఘికకధా చిత్రం ఇదే ఉంటుంది.

కుటుంబ సమేతంగా చూడదగిన తెలుగు కధా చలనచిత్రాలు

పెళ్లి పుస్తకం

శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం అంటూ సాగే పాటలోనే చిత్రకధని టైటిల్ కి తగినరీతిలో కధనాన్ని నడిపించిన దర్శకులు బాపుగారు అయితే రాజేంద్రప్రసాద్ - దివ్యవాణిల నటన చిత్రానికి ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒక మధ్యతరగతి జంట తమ కొత్తకాపురం ప్రారంభిస్తూ తమ తమ తల్లిదండ్రుల కుటుంబ భాద్యతల వలన ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులలో ఒకే కంపెనీలో ఏ సంభందం లేని ఇద్దరు వ్యక్తులుగా ఉద్యోగాలలో జాయిన్ అవుతారు. ఆ పరిస్థితులలో వారు పడే ఇబ్బందులు,అబద్దం వలన వారి కాపురం వచ్చిన కష్టాలు ఎలా గట్తెక్కుతారు అనేది, కధాంశం.

కుటుంబకధా చలనచిత్రం

పలు అవార్డు చిత్రాలకు దర్శకుడుగా నిర్మాతగా ఉన్న క్రాంతి కుమార్ గారు సీతారామయ్య గారి మనవరాలు క్రాంతి కుమారు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు తాతగా అయన మనవరాలిగా మీనా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన చిత్రం. అలాగే నాలుగు నంది అవార్డులు 3 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న ఈ చిత్రానికి నిర్మాత వి దొరస్వామిరాజు. తనికెళ్ళభరణి, దాసరి నారాయణరావు, కోట శ్రీనివాసరావు, మురళిమోహన్ మొదలైనవారు నటించారు.

మోహన్ బాబు - రజనికాంత్

పల్లెటూరి కట్టుబాటులలో పోలీసులతో కూడా పనిలేకుండా తీర్పులు చెబుతూ చుట్టూ ప్రక్కల గ్రామాలలో కూడా పేరు ప్రతిష్టలు కలిగిన కుటుంబ కధా చలనచిత్రం పెదరాయుడు. రజనికాంత్ పాపారాయుడి పాత్రలో నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటే, మోహన్ బాబు ద్విపాత్రాభినయం, భానుప్రియ, సౌందర్యల నటనతో ఈచిత్రాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తాయి. పల్లెవాతావరణంలో సాగే కధని రవిరాజా పినిశెట్టి చక్కగా చూపించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, జయంతి, చలపతిరావు, శుభశ్రీ, ఆనంద్ రాజ్, రాజా రవీంద్ర, బాబు మోహన్ మొదలైనవారు నటించారు. పాటలు కూడా చక్కగా ఉంటాయి.

వెంకటేష్ – సౌందర్య హిట్ కాంబినేషన్లో వచ్చి తెలుగు మహిళల ఆదరణను పొందిన మంచి కుటుంబ కదా చిత్రంగా నిలిచింది. సకుటుంబ సపరివారంగా చూడదగిన చిత్రాలలో పవిత్రబంధం ఒకటిగా ఉండి, భారతీయ స్త్రీమూర్తి సహనం, పతిసేవా తత్పరతను తెలియజేసే తెలుగు చలనచిత్రం పవిత్రబంధం. సెంటిమెంట్ చిత్రాల దర్శకులుగా పేరుపొందినవారిలో ముత్యాల సుబ్బయ్య గారు ఒకరు. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై పోసాని కృష్ణ మురళి కధ అందిస్తే, ఎంఎం కీరవాణి సంగీతం అందివ్వగా పవిత్రబంధం చిత్రాన్ని వెంకట రాజు – శివరాజులు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నిర్మించారు. వెంకటేష్ – సౌందర్యల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటే, సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన పవిత్రబంధం చిత్రం, చాల పవిత్రమైన బంధం విలువని తెలియజేస్తుంది

కుటుంబ కధా చలనచిత్రం

పవిత్రబంధం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కుటుంబకదా చిత్రం.

శతమానంభవతి

ఈమధ్యకాలంలో ఎక్కువగా ఆకర్షణీయంగానే వస్తున్న చిత్రాల మద్య కుటుంబ విలువలను చూపుతూ ఉంటే ప్రేక్షకులు కూడా సదరు చిత్రాలను ఎంతలా ఆదరిస్తారో చూపిన చిత్రం.

ప్రకాష్ రాజ్ – జయసుధ రాజుగారు-జానకమ్మ దంపతులుగా ఆత్రేయపురంలో ఆదర్శవంతమైన కుటుంబంగా ఉంటే, వారి సంతానం మాత్రం వారికి దూరంగా విదేశాల్లో స్థిరపడి ఉంటారు. కనీసం సంవత్సరానికి ఒక్క పండుగకు కూడా సొంతఊరు రాలేని సంతానం గురించి ఊరిలోనే మగ్గిపోయే దంపతులు పడే ఆవేదన ఈచిత్ర కధాంశం. జానకమ్మగారి భాదని చూసి రాజుగారు తమ బిడ్డలకు ఒక అబద్దం చెప్పి ఇంటికి రప్పించడం జరుగుతుంది. అలా విదేశాల నుండి ఇంటికివచ్చిన వారితో కుటుంబ సభ్యుల మధ్య జరిగే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. రాజుగారి మనవడిగా అందరితో ఆత్మీయంగా కలిసిపోయే శ్రీరాం (శర్వానంద్) చక్కగా నటిస్తే, అతనికి మరదలుగా నిత్య(అనుపమ పరమేశ్వరన్) నటించారు. చక్కటి ప్రేక్షకాదరణ పొందిన కుటుంబ కధా చిత్రం శతమానంభవతి. పల్లెల్లో అయినా పట్నాలలో అయినా విదేశాలలో అయిన భారతీయ సంస్కృతి నుండి వచ్చినవారికి కుటుంబ సామజిక విలువలే ప్రధానం అని చెప్పిన చిత్రం.

మరెన్నో కుటుంబకధా తెలుగు చలన చిత్రాలు మనకి ఉన్నాయి. తాతమనవడు, ఆలయశిఖరం, విజేత, దేవత, త్రిశూలం, మామగారు, ఆమె, అనుభందం, చంటి, బలరామకృష్ణులు, సూరిగాడు, ఆపద్భాందవుడు, పెళ్లిలాంటి కధాపరమైన చిత్రాలు కధనంలో ఐతే, గమ్యం లాంటి చిత్రాలు అనేకంగా ఉంటాయి. కానీ ఈమధ్య కొన్ని టివి చానెళ్ళలో కూడా కొత్తచిత్రాల ప్రభావమే ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబసమేతంగా చూడదగిన కుటుంబకధా తెలుగు చలనచిత్రాలు కుటుంబంతో కలిసి చిత్రవీక్షణ ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ అందులోను స్మార్ట్ టివిలు గాడ్జెట్లు వచ్చాక మనకి నచ్చిన సినిమా మనమే నెట్ ద్వారా స్మార్ట్ టివిలలో వీక్షించవచ్చు. అటువంటి సమయంలో సందేశం, వినోదం, చక్కటి కధతో కూడిన చిత్రాలను చూడడం వలన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు మంచి అలవాటులు అలవడే అవకాశం ఉంటుంది.

ధన్యవాదాలు
జైచిత్ర-JaiChitra

Leave a Reply

Close Menu