వాతావరణం పర్యావరణం సమతుల్యత – మదిలో చిత్తం చిత్రాలు

వాతావరణం పర్యావరణం సమతుల్యత – మదిలో చిత్తం చిత్రాలు

వాతావరణం పర్యావరణం సమతుల్యత – మదిలో చిత్తం చిత్రాలు: మనిషి మనుగడ అంతా వాతారావరణ (Weather) పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టాలంటే వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. రోడ్డు పోయాలంటే వర్షం పడని పరిస్థితులలో పని చేయవలసి ఉంటుంది. పొలం పని, రోడ్ సైడ్ పనుల్లాంటివి చేయాలంటే వర్షం ఆటంకం అవుతుంది. అలాగే అయ్యే పనులకు ఎండ తీవ్రంగా ఉన్నా ఇబ్బందే. దైనందిన జీవితంలో వాతావరణం పర్యావరణ సమతుల్యత ప్రముఖంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. చాలా సాదారణ స్థితిలో ఉండే వాతావరణం ఒక్కోసారి చిత్రంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు ప్రభావాలు కల్పిస్తూ ఉంటుంది.

ఉత్తమం అధమం మాధ్యమం అంటూ భావనలు చెప్పినా ఉత్తమంగా పనులు చేసిన మాధ్యమ ఫలితాలు పొందిన, అధమ ప్రవర్తనకు గురిఅయినా మనిషి మనసే కారణం కాగలదు. ఆలోచనా తరంగాలు వాతావరణం(Weather)లో నీటితరంగాలుగా ఉంటే, గాలిలో వాసన వీచినట్టు చిత్తము వలన మనసులో పాత ప్రభావాలు వెంటాడతాయి అంటారు. చిత్రమైన మదిలో విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి, విశేషమైన శక్తి సామర్ధ్యాలు ఉంటాయి. ఆకర్షణలు వికర్షణలు మధ్య శక్తి సామర్ధ్యాలు ప్రభావితం పొంది మార్పునకు గురి అవుతూ ఉంటాయి. అంటారు.

సాదారణ పరిస్థితులలో సాదారణంగానే పనులు జరిగితే, ఒక్కోసారి అసాదారణ పరిస్థితులు అప్పటికప్పుడే ఏర్పడతాయి. అటువంటి అప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల వలన వాతావరణ పరిస్థితుల (Weather Status)పై అంచనాలు వేయడం, జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి సహజంగా చేస్తూ ఉంటారు. వాతావరణ పరిస్థితులు మనిషి పనులలోనే కాకుండా మనిషి మనసుపైన కూడా ప్రభావం చూపుతాయి. చిత్రమైనది మనసు చిత్తమును కలిగి ఉంటుంది అంటారు. అటువంటి చిత్తంలో ఆలోచనలు వర్షం అకస్మాత్తుగా రావచ్చు, వాతావరణంలో వాన కూడా అలాగే.

Weather Types: ఎండ,వాన,చలి మూడుగా ఎండాకాలం, వానాకాలం, చలికాలంలా మూడుకాలాలుగా ఒక సంవత్సరం గడుస్తూ ఉంటుంది. అయితే ఎండకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి కానీ పూర్తీ వానలేకుండా ఉండదు. అలాగే వర్షాకాలం వర్షాలు ఎక్కువగా ఉంటాయి, పూర్తీ ఎండలు లేకుండా ఉండవు, అలాగే శీతాకాలం కూడా పూర్తీ ఎండలు లేకుండా ఉండవు. ఒక్కోకాలంలో ఒక్కో ప్రభావం అధికంగా ఉంటే, ఒక్కోకాలంలో మరొక కాలపు స్థితి వస్తూ పోతూ ఉంటుంది. చిత్తానికి గుర్తుపెట్టుకునే శక్తి ఉంటే, ఏకాలంలోనైనా గతకాలపు చిత్రాలు, విచిత్రాలు మదిలో మెదులుతాయి.

అతిలో మతి ఉండదు, అది మనసు అయిన పర్యావరణ వాడుక అయినా

అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు, అతివాన, అతిఎండ అతిచలి మనిషిని ఇబ్బంది పెట్టే వాతారావరణ పరిస్థితులు. ప్రకృతిలో సహజంగా వచ్చే ఈ మూడు కాలాల్లో మూడు స్థితులలో మనిషి మామూలే కానీ అతిస్థితిలో ఒక్కోసారి మనిషి ఎదుర్కొనే సమస్యలవలననే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. వాటిలో వానకు గొడుగు, ఎండకి చల్లగాలిని వీచే విసినకర్రలు దగ్గర నుండి ఎయిర్ కూలర్ వరకు ఉంటే, చలిని తట్టుకోవడానికి ఉన్ని దుస్తులు లాంటివి ఉపయోగపడతాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే సాదారణస్థితిలో మనిషి మనుగడ సాగుతుంది, అటువంటి వాతావరణ స్థితి (Weather Status)ని అంచనావేసే శాఖల వలననే అనుకూల ప్రతికూల పరిస్థితులపై అంచనాకి వస్తూ ఉంటారు.ప్రతికూల వాతావరణ స్థితులలో అనుకూలంగా ఉండే వస్తువులు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే వాతావరణ స్థితి(Weather status)ని అప్పటికి సామాన్యంగా అంచనా వేసిన రేపటి స్థితి ఎలా ఉంటుందనేది కూడా పనులను నెరవేర్చుకోవడంలో అవసరమే అవుతుంది. ప్రయాణం చేసేటప్పుడు వాతావరణం పరిస్థతిపై అవగాహనా అవసరమే, ఏవైనా కట్టడాలు కట్టడానికి కూడా అవసరమే. వ్యవసాయానికి ప్రధానమైన విషయం వాతావరణ పరిస్థితులు. కురిసిన వానలు, కురవబోయే వానలు వ్యవసాయ పంటలపై ప్రభావం చూపుతూ ఉంటాయి. అందరికి అన్నం సరిగా దొరకాలంటే పంటపండించే రైతుకు వాతావరణ (Weather) పరిస్థితులు కచ్చితంగా అనుకూలంగా ఉండాలి.

రైతువలననే అన్నము, అన్నము వలననే బలము బలము వలననే అర్జన, అర్జనతోనే అన్ని సౌకర్యాలు.

రైతులేకలేదు అన్నము అన్నముతోనే ఆకలితీరును.అన్నముతోనే శక్తి సమకూరును తెలిసిన విషయమే, వాతావరణ(Weather Report) పరిస్థితులపై మనిషి ఉపయోగించే ప్రకృతి విషయాలు కూడా ప్రభావం చూపుతాయి. ఎక్కువగా వాయు కాలుష్యం విడుదల చేసే వాహనాలు వినియోగం, నష్టదాయకమైన ప్లాస్టిక్ వినియోగం. ఇష్టానుసారం నీటివినియోగం, పర్యావరణంలో సమతుల్యతను దెబ్బతీసేవిధంగా ఉంటున్నాయి అని పరిశోధకుల అభిప్రాయంగా వార్తలుగా ఉన్నాయి. ప్రతికూల వాతావరణం(Weather)లో పనులు చేసుకునేవారికి పరిస్థితుల ప్రభావంపై అవగాహన ఉంటే, ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాగైనా జరిగిపోతుంది అనుకోవడం ప్రకృతిలో పొరపాటు. చిత్తములో ముద్రించబడిన అంశం మరలా ఎప్పుడో ఒకప్పుడు ఎవరైనా గుర్తు చేస్తేనో లేకా సదరు విషయానికి సంభందించిన అంశం ఎదురైతే చిత్తంలో నిక్షిప్తమైన విషయాలు మదిలో మెదులుతాయి. అలాగే వాతావరణ కాలుష్య ప్రభావం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోటా ఉంటూ ఉంటుంది.

శీతలపానీయాలలో, అప్పుడప్పుడు త్రాగే తేనీరు వంటి త్రాగే పదార్ధాలలో దీర్ఘకాలంలో మనిషి ఆరోగ్యానానికి హాని చేసే విష లక్షణాలు ఉన్నాయని చెబుతారు. అలాగే నిల్వ ఉన్న పదార్ధాలు మరలా ఉపయోగించడం వలన పదార్ధాల కొంత విషపూరిత లక్షణాలతో దీర్ఘకాలంలో మనిషి ఆరోగ్యానికి హాని చేస్తాయని అంటారు. ఇటువంటి పదార్ధాలు అప్పుడప్పుడు స్వీకరించే మనిషి ఉంటే, ఆ మనిషి శారీరిక, మానసిక శక్తి ముందు తాత్కాలికంగా ఉపయోగపడుతూ దీర్ఘకాలంలో చెడు చేసే పదార్ధాల ప్రభావం అంతంత మాత్రమే ఉంటుంది. అదే మనిషి ఎక్కువగా సదరు పదార్ధాలు స్వీకరిస్తే తొందరగా తన విలువైన శారీరిక మానసిక శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. చిత్తములో చెడువిషయాలు అధికంగా చేరితే చిత్తము చెత్త విషయాలతో నిండి ఉంటుంది. అలాంటి చిత్తము కలిగిన మనసు ప్రవర్తన వికృత భావనలోతేనే నిండి ఉంటుంది అని అంటారు. చిత్రం చిత్తశుద్ధి అంటారు, చిత్తశుద్ధి అంటే మనోస్నానం క్రింద చెబుతారు.

వాతావరణం పర్యావరణం సమతుల్యత – మదిలో చిత్తం చిత్రాలు

అలాగే ప్రకృతిలో అశేషమైన భూమి, వాయువు మరియు నీరు చాలా శక్తివంతమైనవి, వాటిని కలుషితం చేస్తూ ఉంటే, తాత్కాలికంగా ఏమి జరగనట్లే ఉన్న భవిష్యత్తులో అనేకానేక సమస్యలు తీసుకువస్తాయి. భూమి, గాలి నీరు ప్రకృతిలో వాతావరణం(Weather)పై పెక్కు ప్రభావం చూపించేవి, మనిషి కలుషితం చేసేవి కూడా ఇవే అని అంటారు. మంచిని చెడు ఎగతాళి చేస్తూ ఎదుగుతుంటే, మంచి ఓపికపడుతూ ఉంటే, చెడు మం’చి’లోని ‘చీ’ని తీసుకుని తీసుకుని చెత్తగా ఎక్కడో ఒకచోట వికృతంగా విలయం చేస్తూ ఉంటుంది. బహుశా అదే కాలుష్య పరిణామాలు కావచ్చు. మంచిని చూపించడంలో దర్శకుడు ఒక చిత్రంలో చెడుచేత మంచి పీడింపబడుతున్నట్టు లేక మంచి చెడుచేతిలో అవహేళనకు గురి అయ్యినట్టు, లేక మంచి చెడుదగ్గర పరాభవం చెందినట్లు చూపించి చివరగా చెడుపై మంచి అత్యుత్తమ విజయంగా చూపిస్తారు. అయితే వాటి మద్య ఉండే సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉండి, చెడు తొందరగా చిత్తములో చేరే అవకశాలు ఎక్కువ. అందుకే కొంతమంది చిత్రాలు వలన చెడు ప్రచారం ఉంటుంది అని వాపోతారు.

సమతుల్యత అనేది మనసుకి ముఖ్యమని అటువంటి సమతుల్యత కలిగిన మనసే ప్రకృతిని సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు పొందగలదని అంటారు. సమతుల్యత మది తాత్కాలిక విషయాలపై వ్యామోహంతో భవిష్యత్తు దృష్టిని కోల్పోయి కేవలమ ప్రకృతి పరిక్రమంలో పరిగెడుతూ ఉంటుందని సమదృష్ట మదిగలవారు వెల్లడిచేసినట్లు అనేక పుస్తకాలలో చదువుతూ ఉంటాం. వాతావరణం సమతుల్యత ఉంటే సామజిక ప్రయోజనం ఎక్కువ ఎందరో మనుషులు తమ తమ జీవన పారమార్ధికతను సాధించుకోవడానికి ప్రకృతి నియమాలు వారికి సాధనాలు. అటువంటి ప్రకృతిని పరిరక్షించడం అంటే ఎంతో సామజిక సేవే.సరే విషయం మనసుని త్రాకితే ఆ తాకిడికి మనసు గాలిలా కదులుతూ ఉంటుంది. అయితే వాతావరణ స్థితిని అంచనా వేసే మనకి రేపటి కోసం మాపటి కోసం వాతావరణ అంచనాలు అందించే మొబైల్ ఆప్స్ కూడా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకొరకు గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తాయి. సదరు మొబైల్ ఆప్స్ వలన వాతావరణ ఉష్ణోగ్రతలు, గతకాలపు ఉష్ణోగ్రత వివరాలు, ఉండబోయే ఉష్ణోగ్రత వివరాలు తెలియజేస్తాయి.

వేగంగా వెళ్ళే కాలంలో వేగంలో వచ్చే ఆలోచనల్లో గమనించే అవకాశం తక్కువ అంటారు. సాంకేతికత వలన వచ్చిన వేగవంతమైన విధానంలో పనిచేసే పరికరాలు మనకి చాలానే ఉన్నాయి. వాటిలో స్మార్ట్ గాడ్జెట్లు ఎక్కువగా అందరిని ఆకర్షిస్తూ ఉంటే, కొందరిని వాతావరణం(Weather)లో ఏకాకిగా కూడా ఉంచే అవకాశం ఉంది. హయ్ చెప్పినవారితో భాయ్ చెప్పేవరకు అన్ని పరోక్షంగా పరికరం ద్వారా చెప్పుకోవడమే సోషల్ మీడియా గొప్పతనం. ఆ పరిక్రమంలో సహజ స్నేహంకన్నా సాంకేతిక స్నేహం ఎక్కువై పోతుంది.

మంచి చెడుల పరిచయం అలవాటు వాతావరణం పర్యావరణం సమతుల్యత – మదిలో చిత్తం చిత్రాలు.

మంచిని చెప్పడానికి చెడుని చూపే దర్శకుడికి మంచిచెడులు పరిచయం అవసరం, పరిచయం అయిన చెడుకు లొంగితే సాదారణ జీవితం కన్నా దిగువకు వెళ్ళవచ్చు, చెడుని నియంత్రిస్తే మంచిని చూపే చిత్రాలని తెరపై చూపించి లక్షలమందికి మార్గనిర్దేశం ఇవ్వగలిగే స్థాయికి చేరుతారు. ఉత్తమచిత్రాలకే అన్వయించగలరు. మంచిచెడుల ప్రభావం గురి అయినవార్కి మంచి గొప్పతనం చెడు చెడ్డతనం రూపం కచ్చితంగా తెలుస్తుంది. లేకపోతే సాదారణంగా గందరగోళమే మిగులుతుంది. లేక మంచిచెడుల అనుపాను తెలిసిన గురువు ద్వారానే.

నేను నాలో ఉన్న మంచినే చెబుతున్నాను అయినా నాలో చెడు ఉందంటూ నీవు చూసే చెడు ఈరోజున నీకు ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ అది రేపు నీకు మంచినే చేస్తుంది అప్పటికి నాకు చెడు చేసి ఉంటుంది అని ఒకరు ఆలోచన చేస్తే. నీలో ఉన్న చెడువలన నీవు చెబుతున్న మంచికి విలువ లేకుండా పోతుంది అంటే సమాజంలో చెడు మంచికి బాగా ముసుగు వేసింది అంటూ మరొకరు ఆలోచన చేస్తే. మనసు శుద్ధి అంటే, శరీరగాయంపై మకిలిని కడగడంలాంటిది. శరీరంలో గాయం కంటికి కనబడితే, మనసులో ఉన్న మకిలి మనకి కనబడదు. కనబడే గాయాన్ని కష్టమైనా భరించి శుద్ధిచేసే మనసు తనకున్న మకిలిని గుర్తించడంలో ఎదుటివారి తప్పులు వెతుకుతూ చిత్రంగా తప్పుకుంటుంది. ఇంకా గట్టిగా అంటే నాలోనే  నాలుగు భాగాలుగా ఉన్నా చిత్తము, బుద్ది, అహంకారం, మనసు అని ఎదో ఒక దానిపై తప్పును నెట్టేస్తుంది.

మంచైనా చెడైనా సంతోషంగా ఉన్నామా, మనవలన ఇంకొకరు సంతోషంగా ఉన్నారా అనేది ప్రధానం అని వేరొకరు ఆలోచన చేస్తే. మంచిని చెప్పడానికి వచ్చేవారు ఆచరించే మంచిపనులు ఏవి అని ప్రశ్నించేవారు ఉంటే, ప్రశ్నించేవారిలో ఉన్న నిబద్దత ఏపాటిది అంటూ అతని వ్యక్తిగత వ్యవహారాలలోకి తొంగిచూసేవారు ఉంటారు. నాయకత్వం సమాజానికి మేలుచేసే విషయాలపై దృష్టి పెట్టి సామజిక సమతుల్యత మానుష వాతావరణం Weather మంచిగా ఉండేలా చూడాలి అని మేధావులు ఆలోచన చేస్తుంటే. మంచిగురించి ఆలోచించేవారు ఎక్కువ చేసేవారికి అడ్డుతగిలేవారుకూడా ఉంటారు. ఇలా సమాజంలో అనేక ఆలోచనలు తరంగాలుగా ఉంటే !

సామజిక ప్రాకృతిక విషయాలు అశేష ప్రజల సమైక్యతతోనే సాద్యం.

సమాజంలో చెడు పెరిగి సమాజమే చెడుకు తలవంచుతుందా లేక ప్రకృతి నియమాలతో సమాజం మానుషమదిని నియంత్రణ చేస్తుందా అనేది ప్రాకృతిక సామజిక అంశం. సామజిక ప్రాకృతిక విషయాలు అశేష ప్రజల సమైక్యతా భావనతోనే సాధ్యం. సనాతనంగా భారతంలో ప్రకృతిలో వనరులను వినియోగిస్తూ ప్రకృతిని పూజించడం పరిపాటి. ఒక వృక్షం తొలగించాల్సిన పరిస్థితివస్తే, భవిష్యత్తు వాతావరణ మార్పులలో సమతుల్యత కోసం బహుమొక్కలను నాటే సనాతన సంస్కృతి భాతదేశ సంస్కృతిగా ఉంది. ఋషి జీవనం ప్రకృతిపై పరిశోదన చేసి పూజించి జీవన పారమార్ధిక విషయాలను పూజలుగా ఆచారాలుగా వ్రతాలుగా అందించారా అని అనిపిస్తుంది.

రోజు SVBC ఛానల్ తిథిమాస విశిష్టతలను తెలిపే కార్యక్రమంలో వచ్చే ఋషివ్యాక్యాలుగా ప్రముఖ ప్రవక్తలు చెప్పే విషయాల్లో సనాతన ఋషులచే చెప్పబడిన ప్రకృతి నియమాలే పండుగలుగా, యజ్ఞాలుగా ఉన్నాయని తెలియబడుతుంది. విజ్ఞులకు చదివిన విషయంలో ఉన్న విశేష అర్ధం చేసుకునే సంస్కారం ఉంటుందని అంటారు, అటువంటి విజ్ఞుల కోసం ఎన్నెన్నో పుస్తకాల రూపంలో విజ్ఞానం అందుబాటులో ఉంటూనే ఉంటుంది. విజ్ఞానం వలననే ప్రకృతిపై ఉండే అవగాహన సరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ప్రకృతిలో అనేకంగా స్త్రీలింగ శబ్దంతోనే ఉంటాయి. ప్రకృతి స్త్రీలు ఇద్దరు సనాతన ధర్మం ఉన్నత స్థితిలో ఉంచి గౌరవించింది అని పండితులు అంటారు. పర్యావరణ సమతుల్యతే చక్కటి వాతావరణ(Weather) పరిస్థితులకు మూలం.

వాతావరణం (Weather) మానవమనుగడకు ప్రధానమైనది, పర్యావరణ సమతుల్యతతో చక్కటి వాతావరణ పరిస్థితులు ఉంటే మానుష పరమార్ధం అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గాలి నీరు, భూమి, నిప్పు ఈ మూడింటి సమతుల్యమైన వినిమయం వలన ఆకాశం ద్వారా మరల ఫలితాలుగా ఉంటాయని చెబుతారు. వాతావరణం అనుసరణీయంగా ఉంటేనే మనిషి మనుగడ కొనసాగడానికి కలం సహకరిస్తుంది. ఇప్పటి తాత్కాలిక విషయాలు భవిష్యత్తులో ఎటువంటి ప్రభావం చూపుతాయో ఆలోచన చేయకపోతే, విపరీత ఆలోచన కలిగినవారు లేక నెగటివ్ థింకింగ్ ఉన్నవారి ప్రకోపంలాగా వాతావరణ ప్రభావాలు ఉంటాయి.

వాతావరణ పర్యావరణ సామజిక పరిస్థితులే ప్రభావంతంగా ఉంటాయి.

మనిషి మనసు మానవ శరీరం మానవ జన్మ చాలా చాలా ఉత్తమమైనదిగా ఉంటే అటువంటి మనిషి జీవించే వాతావరణం పర్యావరణం సమతుల్యతను కాపాడే భాద్యత మనిషిదే. ఎందుకంటే ఉత్తమ జన్మ మనిషిగా పుట్టడానికి అవసరమైన పరిస్థితులు వాతారవణంలోనే, అమ్మ నాన్న జీవితం కొనసాగడానికి వాతావరణ పరిస్థితులే కారణం. వారి వారి తల్లిదండ్రులు జీవించడానికి వాతావరణ పర్యావరణ, సామజిక పరిస్థితులే కారణం. మన తరువాత మన పిల్లలు వారి వారి పిల్లల జీవితం బాగుండడానికి వాతావరణ పర్యావరణ సామజిక పరిస్థితులే ప్రభావంతంగా ఉంటాయి.

వ్యక్తికి ఆరోగ్యం అత్యవసరమైనది అయినప్పుడు వ్యక్తి ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహార పద్దతులు పాటించే మనసు కుడా ఆరోగ్యంగా ఉండాలి. అటువంటి వ్యక్తి శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే, అతని కుటుంబ స్నేహ బందువులు ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండాలి. ఇలా జీవించే వారికి అందరికి ఆరోగ్యం మనసు బాగుండాలి అంటే సమాజంలో ఉండాల్సింది ధర్మం. సమాజంలో ధర్మంగా అందరు జీవించాలంటే ఆర్ధిక పరిస్థితి బాగుండాలి. ఆర్ధిక పరిస్థితి బాగుండాలి అంటే అన్నం తిని బ్రతికే మనకు రైతు బాగుండాలి రైతు బాగుండాలి అంటే వాతావరణ పర్యావరణ సమతుల్యతగా ఉండాలి.

మనిషికి, అతని మనసుకి, అతని మనసు ఇష్టాలను తీర్చే బంధాలకి, ఇవన్ని సమాజంలో భాగమై ఉంటే, అందరికి అటువంటి బందాలే ఉంటే, జ్ఞానం తెలిసిన నాయకత్వం మనుషుల మధ్య సంభందాలు చెడగొట్టే సున్నితమైన అంశాలలో ధీరత్వం ప్రదర్శించి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి అని అంటారు. వాతావరణంలో కాలుష్యం ఏర్పడినట్టు నాయకత్వం వహించే రాజకీయ వ్యవస్థ వాతావరణం కుడా గతకాలపు కాలుష్య నీడలు భవిష్యత్తు భయంకర కాలుష్య ప్రభావాలతో మిళితమై ఉంది.

విద్య నేర్చే విధానంలో సాంకేతికత వృద్దితో సులభతరమైన పద్దతులు సాధించారు. వైద్య విధానంలో అనేక రోగాలకు మందులు కనిబెట్టబడుతున్నాయి. ఫోషణకు ఆధారమైన ఆర్ధిక లబ్దికి పధకాలు, వ్యాపారాలు, సేవలు అనేకం సాంకేతికంగా అభివృద్ధి చెందాయి. ఇంటిలోనే అన్నింటిని వీక్షించే వీక్షణ పరికరాలు వచ్చాయి. ఎన్ని సౌకర్యాలు ఉన్న వాతావరణం సరిగా లేని స్థితిలో అధిక ధనవంతుడు ఇంటిపట్టునే, పేదవారు ఇంటిపట్టునే ఉండాలి.

పనివలన పనిపై ఆలోచనలో ఉపాయం ఉంటుంది, సౌకర్యం వలన ఆలోచనతో ఇబ్బంది ఉంటుంది.

మనసుని నియంత్రించే సాధన సమయాలను పాడు చేసే సౌకర్యాలు సమాజంలో చాలానే ఉండి, మనసు వాతావరణంలో కాలుష్యాన్ని నింపుతున్నాయి. పనిచేసే మదిలో పనిచేయడానికి ఉపాయాలు మెదిలితే, ఆ మది వెలుగుతో కూడిన మార్గదర్శనీయంగా మారుతుంది. పనిలేని మనిషి ఎదుటి మనిషి మనసుతో ఆడుకుంటుంది. అలాంటిది అటువంటి మనసులో వీక్షణ పరికరాలతో ప్రపంచాన్ని లోపలి తీసుకుంటే, మరి మదితో లోకం ఆడేఅట అంతే. ఒక మనిషి భావనలు ఇంకొక మనిషి మనసుని ప్రభావితం చేస్తాయి, అయితే ఆహ్లాదకరంగా లేదా భాదాకరంగా ప్రభావితం చేస్తాయి. మరి లోకంలో జరిగే విషయాల వలన మనిషి చిత్తములో చేరేది ఏమిటి అనేద వీక్షించే మదికే మెలుకువ ఉండాలి.

సౌకర్యాలు అంతగా లేని సమయంలో మానసిక రోగుల సంఖ్య చాలా తక్కువ అని చెబుతారు. కానీ ఇప్పుడు మనోవికారాలు, బ్రాంతులు అనేకం యువత చుట్టూ తిరుతున్నాయి అంటూ ఆర్టికల్స్ చదువుతుంటాం, కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. కానీ మన మనసును మనం గమనించం. పనిని తగ్గించే సౌకర్యాల వలన మనిషి మనసుకు ఏర్పడే భావనలు నిరుపయోగంగా చెబుతారు. పనిచేస్తున్నప్పుడు మనిషికి తట్టే ఉపాయాలు వలన పనిపై పట్టు ఉంటుంది. ఆ పనిని ఇంకొకరికి నేర్పించే నైపుణ్యం ఏర్పడుతుంది. పనిచేసే మదిలో ముచ్చటైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.

గతకాలంలో అక్షరజ్ఞానం అంతగాలేని భారత దేశంలో పనివిధానం ఒక సంప్రదాయం

గతకాలపు రోజులలో అక్షరజ్ఞానం అంతగా లేని మనభారత దేశంలో నైపుణ్యతకు పెట్టింది పేరు అని చెబుతారు. అంటే మన భారతీయ సమాజం పనిని చేస్తూ, పని చేయిస్తూ, పనికి లొంగి సాటి మనిషిని గౌరవించే గొప్ప మనజ్మేంట్ కోర్స్ మన ఋషులు మనకి సంప్రదాయంగా ఇచ్చారు. అక్షరజ్ఞానం లేని సమయంలో అక్షరజ్ఞానం లేనివారికి పని, ఆ పనిచేసుకోవడానికి కారణమైన తల్లిదండ్రులను గురువులను గౌరవించమన్నారు కానీ ప్రచారాలకు ఆర్భాటాలకు వెళ్ళమని చెప్పలేదు. సమాజంలో సామాన్యుడు పనిచేసే వాతావరణం సంప్రదాయంగానే ఉంది. దారి తప్పిన పెద్దమనిషిని బట్టి ఆ కుటుంబానికి చెడ్డపేరు రావచ్చు కానీ వారు చేస్తున్న పనివిషయంలో చెడు ఉండదు. నైపుణ్యం కలిగిన బంగారపు పనివాడు త్రాగితే చేదిపోఎది అతనే, పనిలో మోసం చేస్తే వచ్చే చెడ్డపేరు  అతను అతని కుటుంబానికే చెందుతుంది కానీ బంగారానికి కాదు.

వ్యక్తి, కుటుంబం, వ్యవస్థ, వ్యవస్థలో వివిధ వర్గాలు వీటిని మొత్తం ప్రభావితం చేసేది సామజిక అంశాలు అయితే అవి మనిషిలో మానసికమైన పరిపక్వతను పెంచేవి ఒకప్పుడు చెప్పబడినవి. వాతావరణంలో ఉండే మనిషి పర్యావరణపరిస్థితులను కాపాడుకోవడంలోను తనపాత్ర ఎంతవరకు ఉంది. అనేది చూడాలి. గాలి నీరు నిప్పు వీటిని దృష్టిలో ఉంచుకుని ఆచార కాండ చెప్పినట్లుగా పండితులు చెబుతారు. అప్పుడు ప్రకృతి వైపరిత్యాలు తక్కువేనని చెబుతారు. అయితే ఆచరణలో లోపం ఏముసుగులో ఎవరు చేసినా నష్టం జరిగేది ప్రకృతిలో కాబట్టి. ప్రకృతివైపరీత్యం కుడా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అలా మారడానికి కారణాలు అంటే విద్యావైజ్ఞానిక గ్రందాలు చదివితే అవగాహనా వస్తుంది.

కష్టంలేని కాలం ఇష్టాలను తీర్చదు శక్తిని హరిస్తుంది. కష్టం ఉన్న కాలం ప్రభావంతమైన ఆలోచనా విధానం, ఉపాయం వివిధ విషయాలపై అవగాహన సంభందిత వ్యక్తి ప్రాంత వాతావరణంలో ఆచార వ్యవహారాలను అనుసరించి ఉంటుంది.

ధన్యవాదాలు
జైచిత్ర