Menu Close

Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu

Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu Old Movie

శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ జంటగా నటించిన తెలుగుచలనచిత్రం సోగ్గాడు చిత్రానికి బాపయ్య దర్శకుడు. Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu old movie. పొలం పని చేస్తూ పల్లెటూరిలో నివసించే శోభనాద్రి ఆ ఊరిలో సోగ్గాడుగా ప్రసిద్ది. అతని మామ పరమేశం (అల్లు రామలింగయ్య) కూతురు సరోజ(Jayasudha), శోభనాద్రి ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే సరోజ పెద్ద చదువు పట్నంలో పూర్తి చేసుకుని, తిరిగి ఊరికి వచ్చాక, శోభనాద్రి (Shobhan babu)ఊరి పెద్దలతో అతని మామ పరమేశం ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తారు. సరోజ తండ్రి పరమేశం పట్నంలో చదువుకున్న నా కూతురుని పొలం పనులు చేసుకునే నీకు ఇచ్చి పెళ్లి చేయనని చెబుతాడు.

Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu

పరమేశం శోభనాద్రి – సరోజ(Jayasudha)ల పెళ్లి ప్రస్తావన కాదనడమే కాకుండా, నలుగురి ముందు నీలా మట్టి పిసుక్కోనేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదని హేళనగా మాట్లాడతాడు. సోగ్గాడికి కోపం వచ్చి నీ కూతురు కంటే అందమైన చదువుకున్న అమ్మాయినే వివాహం చేసుకుంటానని చాలెంజ్ చేస్తాడు. తోటివారి ప్రోద్బలంతో ఒక్కడే పట్నం బయలుదేరతాడు, సోగ్గాడు శోభనాద్రి (Shobhanbabu). ‘Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu’

మరోప్రక్క జమిందారీ కుటుంబంలో పుట్టి పెరిగిన లత(JayaChitra)కి, తన మేనమామ భూపతి అంటే ఆమెకి మహాభయం. ఆ జమీను అంతటికి లత వారసురాలు కావడం వలన, లతని భూపతి (Satyanarayana)పెళ్లి చేసుకుని, ఆమె ఆస్తిని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు. లతను చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదని, కావునా లతని నేనే పెళ్లి చేసుకుంటానని, భూపతి లత(JayaChitra) తల్లితో చెప్పి, పెళ్లి ముహూర్తం పెట్టిస్తాడు. సరిగ్గా పెళ్లి సమయానికి, పెళ్లికూతురుగా అలంకరించబడిన లత పట్నం పారిపోతుంది, ప్రసాదు సహాయంతో.

Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu

తన మామ కూతురు సరోజ కన్నా అందమైనా, చదువుకున్నా అమ్మాయి కోసం పట్నం బయలుదేరిన శోభనాద్రి, మేనమామతో పెళ్లి ఇష్టం లేని లత హైదరాబాదుకి ఒకే రైలులో ప్రయాణం చేస్తారు. హైదరాబాదు చేరుకున్న శోభనాద్రి, సన్యాసిరావు ద్వారా ఒక లాడ్జిలో దిగుతాడు. ప్రసాదు(Giribabu) తో రైలులో హైదరాబాదుకు బయలుదేరిన నగలు ధరించి ఉన్న లత(JayaChitra), రైలు హైదరాబాదు చేరుకునే సమయానికి ఒంటరిగా మిగులుతుంది.

Lata (JayaChitra) Shobhanadri (Shobhan Babu) Marriage in Lodge – Soggadu Movie.

శోభనాద్రిని హోటలుకి చేర్చిన సన్యాసిరావు మరలా లతని కూడా అదే హోటలుకు చేరుస్తాడు. శోభనాద్రి, లతలు ఒకే గదిలో చేరతారు, సన్యాసిరావు వలన. రైలులో లత నగలుతో ఊడాయించిన ప్రసాదు అదే హోటల్లో వేరే అమ్మాయితో లతకి కనబడతాడు. ఆ విషయం లత, శోభనాద్రికి చెప్పగానే, సోగ్గాడు శోభనాద్రి(Shobhan Babu) ప్రసాదుకి బుద్ది చెప్పి లత(JayaChitra) నగలను ప్రసాదు దగ్గర నుండి తిరిగి లతకి ఇప్పెస్తాడు. Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu

లత-శోభనాద్రిలు ఒకరంటే ఒకరు ఇష్టపడి, ఊరికి వెళ్లగానే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో, పెళ్లి సామానులు హోటల్ రూముకి తెచ్చుకుంటారు. అయితే ఆ హోటలుకి పోలీసులు రావడం వలన, అదే హోటల్లో లత మెడలో తాళి కట్టేస్తాడు, సోగ్గాడు శోభనాద్రి. ఇద్దరూ కలసి లత ఇంటికి వెళతారు. అక్కడ లత తల్లి వారిని ఆదరించినా, మోసగాడు అయిన లత(Jayachitra) మేనమామ, శోభనాద్రిని పోలిసులకు పట్టిస్తాడు.

Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu

దుర్మార్గుడు అయిన భూపతి, లత జీవితంలోనే కాకుండా, గతంలో శోభనాద్రి తల్లి జీవితంలో కూడా దుర్మార్గంగా నడుస్తాడు. జైలునుండి ఇంటికి తల్లి దగ్గరికి వచ్చిన శోభనాద్రి, తన తల్లి గతం తెలుసుకుని, కోపంతో రగిలిపోతాడు. దానికి తోడు భూపతి మోసం వలన లత-శోభనాద్రిల పెళ్లి చెల్లదని కోర్టు తీర్పు ఇస్తుంది. ఎలాగైనా లత(JayaChitra) ఆస్తిని కాజేయాలని భూపతి దుర్మార్గపు పధకాలు వేస్తూ ఉంటాడు.

గతంలో సోగ్గాడి శోభనాద్రి తండ్రిని చంపి, శోభనాద్రి తల్లి అయిదోతనాన్ని దూరం చేసిన భూపతి, ఇప్పుడు శోభనాద్రి భార్య లత జీవితానికి కూడా ప్రమాదంగా మారిన భూపతి ప్రోద్బలం పలన పరమేశం పధకం, అతని కూతురు సరోజ ప్రాణాలు తీస్తుంది. చెడుకు దగ్గరగా చేరితే, చెడు చేసే దారుణం ఎంత ప్రమాదకరమో పరమేశం జీవితం ఈచిత్రంలో కనబడుతుంది.

ఆస్తి కోసం మనిషి ప్రాణాలు తీసే భూపతిని శోభనాద్రి అంతం చేయడంతో ఈ చిత్రం ముగుస్తుంది. భూపతి, శోభనాద్రి తండ్రి ప్రాణాలు ఎలా తీసాడో, అదే విధంగా శిక్షింపబడి, చివరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళతాడు. రైతు పండించిన అన్నం తింటూ రైతులను పీడింపచేసే భూపతికి దగ్గరగా, ఊరి పెద్దగా ఉన్న పరమేశం జీవితంలో కూతురుని కోల్పోయాక సోగ్గాడిలాంటి రైతు విలువ ఏమిటో తెలుసుకుని, భూపతి గురించి పోలిసులకు తెలియజేస్తాడు. రైతులను, మంచివారిని పీడించిన భూపతి జైలుకు వెళితే, భూమిని నమ్ముకున్న సోగ్గాడు బంధువర్గంతో సంతోషంగా ఉండటం చిత్ర కధ ముగుస్తుంది.

లతగా నటించిన జయచిత్ర(JayaChitra)కు తెలుగులో తొలి చిత్రం. శోభన్ బాబుకు, జయసుధకు, జయచిత్రకు మంచి విజమవంతమైన తెలుగుచలనచిత్రం. “Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu”

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *