NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram Ummadi Kutumbamlo Bandhalu

కలసి ఉంటే కలదు సుఖం నందమూరి తారకరామారావు సావిత్రి జంటగా నటించిన కుటుంబ కధా చిత్రం. తెలుగు చిత్రాలలో కుటుంబ విలువలను అందులోను ఉమ్మడి కుటుంబ విలువలను గూర్చి చక్కగా చెప్పే పాత చిత్రాల్లో కలసి ఉంటే కలదు సుఖం ఒక మంచి చిత్రంగా ఉంది. స్వర్గీయ ఎన్టిఆర్ సావిత్రల కలియకలో ఎస్వి రంగారావుగారు, సూర్యకాంతం, రేలంగి తదితరుల అద్బుత నటనతో చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram Ummadi kutumbamlo bandhalu gurinchi venditerapai veligina chitrarajamu. ముద్దబంతి పూలు పెట్టి, మొగలి రేకులు జడను అంటూ సాగే పాట సూపర్ హిట్ సాంగ్. శ్రీ సారది స్టూడియోస్, బ్యానర్ పై రామరావు, రేలంగి, ఎస్విఅర్ సావిత్రి, గిరిజ హేమలత, రమాదేవి తదితరులు నటించిన తెలుగు చలనచిత్రం కలసి ఉంటే కలదు సుఖం చిత్రానికి తాపి చాణుక్య దర్శకత్వం వహించారు. ‘NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

రైతు సోదరులు పట్టాభిరామయ్యా, సుందరయ్య ఇద్దరూ ఒకే కుటుంబంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఒకే ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యాక కూడా కలిసే ఉంటారు. పట్టాభిరామయ్య(SV Rangarao) భార్య పేరు సౌభాగ్యం (Suryakantam), సుందరయ్యా భార్యపేరు రమణమ్మ. అయితే పట్టాభిరామయ్య-సౌభాగ్యంలకు పిల్లలు పుట్టరు, కానీ తమ్ముడు సుందరయ్యా – రమణమ్మలకు ఇద్దరు మగసంతానం ఉంటుంది. అయితే పెద్ద కుమారుడు బాల్యంలో గాలిపటం కోసం కరెంటు స్థంభంపైకి ఎక్కి గాలిపటం పట్టుకోబోయి కరెంటు వైర్ పట్టుకోవడంతో ఆ బాలుడికి కరెంటు షాక్ వలన చేయి అవిటిగా మారుతుంది, ఆ బాలుడు పేరు కిష్టయ్య(NT Ramarao), మనసు బంగారంగా ఉంటుంది. కిష్టయ్యకి అతని కుటుంబ సభ్యులు అంటే మహా అభిమానం. అతనికి అమ్మ నాన్నలకు తోడు పెదనాన్న, పెద్దమ్మ ఒకే కుటుంబంలో ఉంటారు. అలాగే అతనికి ఒక తమ్ముడు మధు(Haranath) పట్నంలో చదుకుకుంటూ ఉంటాడు.

NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

అనాదిగా వస్తున్న కుటుంబ సంప్రదాయంలో రంగూన్ నుండి వచ్చి చిచ్చు పెట్టిన రాజా

రమణమ్మ, సుందరయ్య, పట్టాభిరామయ్య (SV Rangaro), కిష్టయ్య(NT Ramarao) సౌమ్యంగా ఉంటే, సౌభాగ్యం మాత్రం కటువు మాటలతో గయ్యాళిగా ఉంటూ ఉంటుంది. సంక్రాంతి పండుగకు పట్టాభిరామయ్య అందరికి కొత్తబట్టలు కొని కుటుంబ సభ్యుల అందరికి ఇస్తాడు. తరువాత సంతకి వెళ్ళిన రమణమ్మకి సంతలో ఒక అనాధ అమ్మాయి కనబడుతుంది, పేరు రాధా (Savitri), ఆమెను తోడ్కొని ఇంటికి తీసుకువస్తుంది రమణమ్మ, పట్టాభిరామయ్యకి చెప్పి ఆమెను ఇంట్లోనే పెట్టుకుంటారు. సౌభాగ్యం అన్నగారి సంతానం అయిన  కొడుకు రంగూన్ రాజ (Relangi Narasimharao), కూతురు జానకి (Girija) ఇద్దరు అన్నాచెల్లెళ్ళు పట్టాభిరామయ్య ఇంటికి వస్తారు. అప్పటిదాకా ఒక సౌభాగ్యం తప్ప మిగతా అందరి సభ్యులతో ప్రశాంతతో కూడిన కుటుంబంలో ముసలం వచ్చినట్టుగా ఉంటుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.

NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

పట్టాభిరామయ్య తన తమ్ముడి కొడుకు అయిన మధు(Haranath)కు పెళ్లి సంభందం తమ్ముడి సమక్షంలోనే ఖాయం చేస్తాడు. మధు(Haranath) పట్నం నుండి ఇంటికి రాగానే, పెళ్లి చేసేయాలని భావిస్తారు పట్టాభిరామయ్య, సుందరయ్యాలు. అయితే రంగూన్ రాజా(Relangi) వచ్చి రాగానే అత్తయ్య సౌభాగ్యంకు వేరు సంసారాల గురించి, పాశ్చాత్య దేశాల సంస్కృతి గురించి గొప్పగా చెబుతూ, సౌభాగ్యం(Suryakantam) మనసుపై ప్రభావం కల్పిస్తాడు. అయితే అతని ప్రవర్తనతో పట్టాభిరామయ్య, కిష్టయ్య, రాధలకు ఇబ్బందిగా ఉంటుంది. రమణమ్మ సుందరయ్యాల చిన్నకొడుకు మధు(Haranath) పట్నం నుండి ఇంటికి వస్తాడు. రంగూన్ రాజ చెల్లెలు జానకి (గిరిజ)ని చూసి మధు ఇష్టపడతాడు, ఇక ఇద్దరికి ఇష్టం కుదిరి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలాగే జరగాలని కోరుకునే సౌభాగ్యం (Suryakantam), రంగూన్ రాజా(Relangi) లు వారి చేతుల మీదుగానే పట్టభిమరామయ్య– సుందరయ్యాలను విడదీస్తారు. అస్తిపంపకాలు జరిపించి, ఇంటి మద్యలో గోడ కట్టిస్తారు.

NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

జానకి-మధు, రాధా-కిష్టయ్యల వివాహాలు కష్టాలతో

తరతరాలుగా కలసి ఏకకుటుంబంగా వస్తున్న అన్నదమ్ముల సంప్రదాయం, కుటుంబ ఆచారాలు పాటించే కుటుంబం ఇప్పుడు రంగూన్ రాజా మాటలకూ తలవంచిన సౌభాగ్యం వలన విడిపోతే, జానకి(Girija) మీద ఇష్టంతో సుందరయ్య చిన్నకొడుకు మధు(Haranath) రంగూన్ రాజా మాటలు వింటాడు. ఆ మాటలు వలన కిష్టయ్య-మధుల వాటాలు కూడా పంచేసి, మధు(హరనాథ్)ని తమ దగ్గరే అట్టేపెట్టుకుంటారు, సౌభాగ్యం-రంగూన్ రాజాలు, పట్టాభిరామయ్య అచేతనంగా అసహనంగా భావన చెందుతాడు.. అన్నగారు అంటే అభిమానించే సుందరయ్య మంచాన పడతాడు.  ఆ సమయంలోనే పట్టాభిరామయ్య – సుందరయ్యలు కలసి  కుదిర్చిన పెళ్లిని కాదని, జానకి-మధులకు పెళ్లి చేసేస్తారు. నాన్నకు బాగోలేదని సుందరయ్య చావుబతుకుల మధ్య ఉన్నాడని కిష్టయ్య (NT Ramarao) బ్రతిమాలినా మధు అందుకు ఒప్పోకోడు. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.

NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

దుఃఖంతో నిండిన కుటుంబంలో కిష్టయ్య పెళ్లి ఒక సమస్యగా ఉంటుంది. అన్నకు పెళ్లికాకుండానే తమ్ముడు మధు పెళ్లిచేసుకోవడంతో రమణమ్మ – సుందరయ్యాలు ఆలోచనలో పడతారు. అయితే ఇంట్లోనే ఉంటున్న రాధతో కిష్టయ్య పెళ్లిచేస్తే బాగుంటుంది అనే రమణమ్మ ఆలోచనను కిష్టయ్య తోసిపుచ్చుతాడు. నీకే ఆడకూతురు ఉంటే, నాలాంటి కుంటివాడికి ఇచ్చిచేయడానికి ఒప్పుకుంటావా, నీ కూతురు అయితే ఒకలాగా వేరేవారి కూతురు అయితే ఒకలాగా ఆలోచన చేయవద్దని కిష్టయ్య చెబుతాడు. అయితే కిష్టయ్య మంచి మనసుని ఇంట్లోకి వచ్చినప్పటి నుండి గమనించిన రాధా కిష్టయ్యతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇక రాధా-కిష్టయ్యల పెళ్ళితో ఆ కుటుంబం కొంచెం కుదుటపడుతుంది.

రంగూన్ రాజా ప్రభావం పట్టాభిరామయ్య పచ్చని సంసారం పట్నం పాలు

సౌభాగ్యం, జానకి, మధులు పూర్తిగా రంగూన్ రాజా మాటల మాయలో ఉంటారు. మధుకు ఉద్యోగం రావడంతో, ఉద్యోగం నిమిత్తం మధు పట్నం బయలుదేరుతుంటే, రంగూన్ రాజా కూడా పట్నం బయలుదేరతారు. అయితే వెళ్ళేటప్పుడు సౌభాగ్యం దగ్గర పట్నంలో వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తెసుకువస్తానని చెప్పి, పెద్దమొత్తంలో సొమ్ములు అడుగుతాడు. ఆ సొమ్ములు సౌభాగ్యం పట్టాభిరామయ్య గారిచే తనఖా సంతకం చేయించి అప్పు తీసుకుని రంగూన్ రాజాకి ఇచ్చి పంపుతుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.జానకి-మధులకి ఒక బాబు పుడతాడు అలాగే తరువాత రాధాకిష్టయ్యలకు ఒక బాబు పుడతాడు. జానకి మధులు వారి బిడ్డకు తండ్రి పేరు పెట్టుకుని, ఆ నామకరణ ఉత్సవం పూర్తవ్వగానే ముగ్గురు పట్నం వెళ్తారు. కిష్టయ్య అవిటితనం నయం చేసే ప్రత్యేక వైద్యులు పట్నంలో ఉన్నారు అంటే రాధా కిష్టయ్యలు ఇద్దరు పట్నం వెళ్తారు. పెద్దమొత్తంలో సొమ్ములు తీసుకువెళ్ళిన రంగూన్ రాజా దగ్గరి నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి కానీ సొమ్ములు రావు. అప్పుల వారి సతాయింపు కారణంగా సౌభాగ్యం తన అన్నకొడకు రంగూన్ రాజ కోసం పట్నం వెళ్తుంది. కొత్త కాపురం పెట్టిన జానకి మధులు, డబ్బు సంపాదనలో మోసపోయిన రంగూన్ రాజా అతని కోసం వచ్చిన సౌభాగ్యం, వైద్యం కోసం పట్నం వచ్చిన రాధా కిష్టయ్యలు పట్నంలో కష్టంలో కలుసుకుంటారు. కష్టం దాటాక కుటుంబ విలువలు తెల్సుకుని కుటుంబాన్ని అభిమానించి కిష్టయ్య, మానవత్వంలో అతని గొప్పతనం గ్రహించి అందరూ ఒక్కటి అవుతారు. చివరికి కిష్టయ్య కాలు చెయ్యి బాగుపడి, అందరిలో సంతోషం నిండుకుంటుంది. అక్కడితో చిత్ర కధ ముగుస్తుంది.

NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

ఉమ్మడి కుటుంబం వలననే సంస్కృతి సంప్రదాయాలకు విలువలు పెరుగుతాయనే విషయం ప్రస్ఫుటం చేసే చిత్రం కలసి ఉంటే కలదు సుఖం.

కుటుంబంలో కర్మతో భాదపడేవారు ఉంటే వారికి సేవ చేసేవారికి మంచి జీవితం, వారిని హేళన చేసేవారికి కష్టాలు తప్పవు అని ఈచిత్రంలో కనబడితే, అవిటితనం ఉన్నా అది శరీరానికే గాని మనసుకు కాదని ఈ చిత్రంలో కిష్టయ్య పత్రంలో కనబడుతుంది. ఆత్మీయత అనుభందం కోరుకుంటే, స్వార్ధం బంధాలను తెంచుతుంది, మనసులని భాదిస్తుంది అని ఈ చిత్రం నిరూపిస్తుంది. ఈ చిత్రంలో ప్రధానంగా అంటే పట్టాభిరామయ్యగారి కుటుంబమే అన్నట్టుగా ఉంటుంది. పట్టాభిరామయ్యగా SV రంగారావు గారు నటన, కిష్టయ్యగా రామారావు నటన, రాధగా సావిత్రి, మధుగా హరనాథ్, రంగూన్ రాజాగా రేలంగి గయ్యాళిగా సూర్యకాంతం ఇలా ఎవరి పాత్రలో వారు కనిపిస్తూ చిత్రకధని కుటుంబ బంధాల మధ్య భావనలు చక్కగా చూపిస్తారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక్కటిగా ఉండకబోతే, రకరకాల జాతుల, మతాల వారు ఎలా కలసి ఉండేది, భారతమాతను సంతోష పెట్టె కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది ? మంచి సందేశాత్మక చిత్రం ఉమ్మడి కుటుంబ గురించి గొప్పగా చెప్పిన చిత్రాల్లో కలసి ఉంటే కలదు సుఖం చిత్రం ఒకటి. “NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra