Menu Close

ETV D10 Grand Finale Atithi NTR Ayite Raju, Pradeep / Aishwarya

ETV D10 Grand Finale Atithi NTR Ayite Raju, Pradeep / Aishwarya

ETV D10 Grand Finale Atithi NTR Ayite Raju, Pradeep / Aishwarya

ETV D10 Grand Finale Atithi NTR Ayite Raju, Pradeep / Aishwarya గత కొంతకాలంగా ఈటివిలో ప్రసారం అవుతున్న D10 ప్రోగ్రాం ఫైనల్ షోకి వచ్చింది, ఫైనల్ విన్నర్కి రూ. 7500000 లు బహుమతిగా లభించనుంది. గ్రాండ్ ఫినాలేకి నలుగురు డాన్సర్స్ రాజు, ముకుల్, ప్రదీప్, ఐశ్వర్య వెళ్లారు గ్రాండ్ ఫినాలే మొదటి లెవెల్ గ్రాండ్ ఫినాలే బిగినింగ్లో మొదటగా రాజు తన అద్బుత డాన్స్ ద్వారా గ్రాండ్ ఫైనల్ క్లైమాక్స్ కి చేరాడు. ఇంకా ప్రదీప్ ఐశ్వర్య మద్య జరిగిన గట్టి పోటి నుండి గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ కి చేరే రాజు యొక్క ప్రత్యర్ధిని వెల్లడి చేయలేదు. అది గ్రాండ్ ఫినాలే 18జూలై2018 తేదిన తెలియనుంది.

రాజు చిట్టిమాస్టర్ కోరియోగ్రఫీలో D10 స్టేజిపై అద్బుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ తో జడ్జిలను మరియు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. రాజు చేసే ప్రతిపాటకి రిస్కుతో కూడిన మూమెంట్స్ చేస్తూ, డాన్స్ చాల చక్కగా అందరిని ఆకట్టుకుంటూ గ్రాండ్ ఫినాలేలో క్లైమాక్స్ చేరిన మొదటి కాంటెస్ట్. గ్రాండ్ ఫినాలే బిగినింగ్లో రాజు చేసిన ఎనర్జిటిక్ డాన్స్ సాహసవంతమైన ఫీట్లతో సాగింది. అతని డాన్స్ తో బాటు చిట్టిమాస్టర్ కోరియోగ్రఫీ కూడా తోడై రాజు నుండి అద్బుతమైన పెర్ఫార్మన్స్ వచ్చింది. చాలాసార్లు స్పీచ్లెస్స్ కామెంట్స్ పొందిన డాన్సర్లలో రాజు మొదటివాడు. అటువంటివాటిలో అక్టోబర్ 11th 2017 తేది వీడియో చూడండి లింకుపై క్లిక్ చేయండి.

ఐశ్వర్య మొదట్లో అంతగా ఎవరి దృష్టిపడని ఆ అమ్మాయి ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది, ఎక్కువగా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో కోరియోగ్రఫీ అందించే సునీల్ మాస్టర్ మరియు ఆమె డాన్స్ చాల ఆకట్టుకునే విధంగా ఉంటుంది. D10లో తనతోటి మగవారితో పోటిగా డాన్స్ చేయగల ప్రతిభ ఈమె సొంతం. అద్బుతంగా డాన్స్ చేసి ఎక్కువ యూట్యూబ్ విజిట్స్ పొందిన అక్షాఖాన్ కూడా గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టలేకపోయింది కానీ ఐశ్వర్య మాత్రం తన అద్బుతమైన డాన్సుతో D10 గ్రాండ్ ఫినాలేలోకి చేరింది. D10 గ్రాండ్ ఫినాలే బిగినింగ్లో తనకు పోటికి వచ్చిన ప్రదీప్ తో సరి సమానంగా పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఐశ్వర్య గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ చేరింది లేనిది వచ్చే ఎపిసోడ్లో తెలుస్తుంది.

ప్రదీప్ డాన్స్ కోసం కష్టపడే కాంటెస్ట్ అయితే అతని మాస్టర్ యశ్వంత్ చాలా క్రియేటివ్ కోరియోగ్రఫీ వీరిద్దరి కలయిక స్టేజిపై డాన్స్ ఆకర్షణీయంగా ఉంటుంది. కొత్తగా ఆలోచిస్తూ ప్రదీప్ డాన్స్ ని అద్బుతంగా ప్రెజెంట్ చేయడంలో యశ్వంత్ మాస్టర్ తర్వాతే. కసితో డాన్స్ మీద ప్రాణం పెట్టే కాంటెస్ట్ లలో ఇతను ప్రదీప్ ఒకడు. రాజులగానే ఎనర్జిటిక్ డాన్స్ చేసే ప్రదీప్ డాన్స్ కూడా చాలాసార్లు జుడ్జిస్ కామెంట్స్ మంచిగా అందుకున్నాడు.

ETV D10 Grand Finale Atithi NTR Ayite Raju, Pradeep leka Aishwarya

గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్లో మొదటి కాంటెస్ట్ రాజు వెళితే, ఇంకా ఐశ్వర్య మరియు ప్రదీప్లలో వెళ్ళేది ఎవరని సస్పెన్స్ 18తేది జూలై 2018న తెలిస్తే ఆరోజు ఇంకో ప్రత్యేకత. ప్రేత్యేక గ్రాండ్ అతిథిగా Jr. NTR గ్రాండ్ ఫినాలే క్లైమాక్స్ లో హాజరు కానుండడం ఇంకా D10 ప్రేక్షకుల్లో ఆత్రుత ఎక్కువ అవుతుంది.

ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించిన అక్శాఖాన్ సెమి ఫైనల్లోనే నిష్క్రమించింది. ఆమె చేసిన స్వింగ్ జరా సాంగ్ D10 లో ఓకే హైలైట్ పాటగా ప్రజాదరణ పొందింది.