ChitraVishayalu ChittaVishayalu – MovieThings MindThings Maybe Equal

ChitraVishayalu ChittaVishayalu – MovieThings MindThings Maybe Equal

ChitraVishayalu ChittaVishayalu – MovieThings MindThings Maybe Equal. Continue in Telugu : చిత్రాలలో తెలుగుచిత్రాలు, తెలుగు చిత్రాల(Chitralu)లో పాత చిత్రాలు మనసును ఆహ్లాదకరమైన ఆలోచనలోకి తీసుకువెళతాయి. సదాలోచనలో మనసు శాంతితో కూడిన విషయాలవైపు(Vishayalavaipu) వెళుతుంది. మదిలో శాంతివలననే సంభందిత కుటుంబ సమాజ శ్రేయస్సుకు మనసే మూలం అవుతుంది. సమస్యలతో సతమతమయ్యే మనసు కోరుకునే విశ్రాంతి, అంత తేలికైన విషయం కాదు అని అంటారు. ఒకసారి శాంతిగా లేను అని పసిగడితే అది పగబట్టిన పాము వంటిదే, అటువంటి మనసు ఎదో ఒక విషయంతో పని ఏర్పరచుకుని, ఎదో ఒక విషయంపై తర్జనబర్జనలు పడుతూ, ఎదో ఒక విశేషాన్ని వాంచిస్తూ ఉంటుంది.

ఆశా నిరాశల మధ్య మది మధించబడుతూ కాలంలో కష్టాలతో కదిలించబడుతూ సంతోషాలతో శాంతిని పొందుతూ ఉంటుంది. మది గదిలో మెదిలే మధనం వలన మనసు నియంత్రింపబడుతూ ఉంటుంది. అతి నియంత్రణ లేక అయిష్ట నియంత్రణలో ఉండవలసిన స్థితిలో మదిలో సంఘర్షణ ఉంటుంది. మనిషి అంతరంలో తరంగాలు తగ్గడం అంటే, మదిని మెదిలించే ఆలోచనలను దూరం చేసే ప్రక్రియ ఎదోకటి చేయడం అలవాటు అవుతుంది. అలా సమాజంలో ఏవో కొన్ని విషయాలతో సాంగత్యం ఏర్పడుతుంది. The mind may be thinking about some things.

సాదారణంగా స్నేహితుల వలన విషయాలపై అవగాహన, విషయాలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది అంటారు. స్వతః ఏర్పడే సాన్నిహిత్యా విషయాలు అంటే కుటుంబం మరియు వంశపారంపర్యంగా కొన్ని విషయాలపై సాన్నిహిత్యం లేక జ్ఞానం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆలోచన మదిలో మెదిలితే మొదలయ్యే అలజడి నీటి తరంగాలుగా వస్తూనే ఉంటాయి అంటారు, అలాగే అవి తగ్గిపోతాయి అని అంటారు. ఆలోచనలు తగ్గించాలంటే ఆలోచన చేసే మనసుని మళ్లించడమే మేలు అంటారు. అలా ఆలోచనలు ఏ విషయంపై విసుగుచెంది ఉంటే ఆ విషయం నుండి వేరే విషయంపైకి మళ్ళించే మనోవిజ్ఞత కూడా మదిలోనే మిగిలి ఉంటుంది అంటారు.

అటువంటి మనసుకు నీరు సారవంతమైన భూమిగుండా వెళితే, ఆ భూమిలో పంట పండినట్లు, చెత్తఉన్న ప్రాంతానికి పారితే నీరు కలుషితమైనట్లు, మనసుని మంచి విషయాలు వైపు మళ్లిస్తే, ఉన్న విషయాలలో సమస్యకు సమాధానం వెతికే శక్తిని మది పొందగలదు. అని అనేక వివరణలు వింటూ ఉంటాం. పుడుతూనే మనిషి మనసుకి వెతుకులాటతో నేర్చుకోవడం మొదలవుతుంది. అలా నేర్చుకునే విషయంలో అమ్మనాన్నలు దగ్గర నుండి, అన్నదమ్ముల ద్వారా, స్నేహితుల ద్వారా, గురువుల ద్వారా మది మరెన్నో విషయాలలో విజ్ఞానాన్ని పొందుతుంది. చూడడం, వినడంతో అనేక విషయాలతో పరిచయం, అనేక విషయాలలో పరిజ్ఞానం కొన్ని విషయాలతో సాన్నిహిత్యం, కొన్ని విషయాలలో అలవాటుగా మదిగదిలో గూడుకట్టుకుని ఉంటాయి అని అంటారు. A mind carrying thinking of the things in future.

Mind feel good and bad with the things

ఇలా అదో విజ్ఞాన విశేష విషయ వాంఛలతో సంతోషాన్నో దుఃఖాన్నో పొందుతూ ఉంటుందట. అటువంటి మనసుకు మళ్లింపు పద్దతులలో మొదటగా అలవాటు అయ్యేది ఆట. పాలు కోసమో అన్నం కోసమో ఆకలితో ఉన్న సమయంకానీ సమయంలో రోదించే పసిపాపని ఏమర్చడానికి అట వస్తువు అమ్మ ఇస్తుంది. అదేదో చూడనిదో, కొత్తగా కనిపించేదిగానో అనిపించి కాసేపు ఆడి మరలా మరోసారి రోదన మొదలు పసిమదిలో. అప్పటినుండి మదికి వస్తువులతో ఆడుకోవడం, అమ్మతో ఆడుకోవడం, నాన్నతో ఆడుకోవడం చుట్టాలతో ఆడుకోవడం అలవాటు. ఆకలి ఏమార్చడంలో అట ఒక మార్పిడి విషయంగా మదికి అలవాటు అయితే, చదువులోను ఆటే మనిషికి మార్పిడి విషయంగా ఉంటుంది. ఆట తరువాత మదికి మార్పిడి విషయం వయస్సు పెరుగుతున్న కొలది అనేకం వస్తూ సుఖఃదుఃఖాలను కలిగిస్తూ ఉంటాయని అంటారు. వాటిలో చిత్ర వీడియోలు, చలనచిత్రాలు(Chalana Chitralu) కూడా ఉండవచ్చు.

సామజిక పౌరాణిక తెలుగు చలన చిత్రాలు(Chitralu) చాలానే ఉన్నాయి. విశేషంగా వాటికీ ఆదరణ లభించడంలో మాత్రం కొందరి నటుల ప్రభావం కూడా ఉంటుంది. అటువంటి నటులలో ఎన్టిఆర్ (NTR), ఏనార్ (ANR) ప్రముఖంగా ఉంటారు. ఎన్టిఆర్ చలనచిత్ర చరిత్రలో పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి అశేష తెలుగు ప్రేక్షాభిమానాన్ని పొందారు. ఏనార్ అయితే సాంఘిక, కుటుంబ కదా చిత్రాలలో తనదైన శైలిలో అశేష ప్రేక్షకభిమానాన్ని సంపాదించారు. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తదితర నటులు కూడా అనేక సాంఘిక, కుటుంబ, సందేశాత్మక చిత్రాల(Chitrala)తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. మరెంతమందో నటీనటులు మన తెలుగుచిత్రసీమలో నటించి ప్రేక్షకుల మనసుని రంజింప చేసారు. Movie Things Mybe Equal to Mind Things.

Imitation is a big thing of the mind.

అయితే మదికి కదిలే చిత్రానికి చిత్రమైన (Chitraniki Chitramaina) సంభందం ఏమిటి అంటే. చిన్ననాడు ఊహ తెలిస్తున్న వయసులో బాలుడు / బాలికను నిద్ర పుచ్చడానికిగాను అమ్మ చెప్పే కధలు వినే మది, కధను అనుసరించడంలో తనదైన శైలిని చూపుతుంది. ఊహించడం అలవరుచుకునే మనసు పెరిగి పెద్దదవుతున్న కొలది కుటుంబంలో సమాజంలో అనేక విషయాలపై సాదారణ ఊహా శక్తి కలిగి ఉంటుంది. కానీ జీవిత కుటుంబ భాద్యతలలో అన్ని ఊహలు కార్యరూపంలో రావు. అటువంటి సాదారణ మానవ మేధస్సులో కలిగే ఊహలు ఎవరోఒకరికి ప్రత్యేకంగా వారు గమనించిన సామజిక పరిస్థితుల ఆధారంగా మదిలో ఆలోచన తడుతూ ఉంటుంది. అది ఆలోచనలుగా సాగి కధగా మారి వెండితెరపై నటినటులతో నటింపజేయిస్తుంది. అలా మంది మది ఆలోచనలు ఒక మది ఆలోచనలతో ముడిపడే అవకాశం ఉండడం వలననేమో చలనచిత్రాలపై మదికి మక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ChitraVishayalu ChittaVishayalu – MovieThings MindThings Maybe Equal.

ఒకసారి చిత్తము(Chittamu)లో చలనచిత్ర విషయాలపై మక్కువ ఏర్పడితే మొదటగా అనుకరణ మొదలవుతుంది. మొదట చిత్ర కధలపై, చిత్ర కధలో నీతిపై మదికి మక్కువ ఉంటుంది. ఇకా ఎప్పుడూ ఉండే కధలు ఎప్పుడు చెప్పే నీతులు అనుకుంటే, చలనచిత్ర(Chalana Chitra) సన్నివేశాలపై, ఆ సన్నివేశాలలో కదానాయకులపై ఎక్కువమక్కువ ఉంటుంది. ఇక కధానాయిక అందచందాలపై మదిని మొహంలోకి నెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇలాంటి చిత్తా(Chittamu)నికి తెలుగు చలనచిత్రానికి మద్య ఉన్న సంబందమే నేటి చిత్రసీమలో భారిబడ్జెట్ చిత్రాల రూపకల్పన, వాటితో అంతర్జాతీయ గుర్తింపు తెలుగు చలన చిత్రాలకు వచ్చింది. The mind learns to imitate the elder’s mind things.

New Block Buster Hit Movies Story Things Related to Old Movie Things.

ముఖ్యంగా ఒకవిషయం గమనిస్తే అంతర్జాతీయంగా తెలుగు చిత్ర పరిశ్రమకు నటీనట దర్శకులకు గుర్తింపు తెచ్చిన కధాంశం, ఒకప్పటి పాత తెలుగు చలన చిత్ర కధంశాలలో పోలికగానే ఉంటుంది. ఒకప్పుడు నందమూరి తారక రామారావు, కాంతారావు లాంటి నటులు నటించిన రాజవంశపు కదాంశమే నేటి అంతర్జాతీయ గుర్తింపు అశేష భారతీయ ప్రేక్షకులు చిత్ర కధాంశం (Chitra Kadhamsham)ఒకటే. అంటే కధ కాపి అనికాదు రాజులచరిత్రే బ్యాక్ డ్రాపుగా నడిచింది. అంటే అంతలా భారి బడ్జెట్ చిత్రాల పరంపర మగధీర చిత్రంతో ప్రారంభం అయింది. మగధీర చిత్రంలో కధానాయకుడు కాలభైరవ తన దేశ సంరక్షణ కోసం ప్రేమను త్యాగం చేసే వీరుడుగా అందరిని మెప్పిస్తే, బాహుబలి చిత్రంలో ధర్మం కోసం రాజ్యాన్ని తన ప్రాణాల్ని పణంగా పెట్టిన అమరేంద్ర బాహుబలి అశేష ప్రేక్షకుల అభినందనలు మందారమాలలుగా పడ్డాయి.

విశేష ఫలితాన్ని ఇచ్చిన నేటి చిత్రం కధానాయకుడు అచంచల పట్టుదల, ధర్మం, ప్రేమలో ప్రధానంగా నీతిగా ధర్మనికే కట్టుబడి నిలబడడం అనే అంశం గతకాలపు చిత్రాలలో విశేషంగా ఉండే కధానాయకుడి లక్షణాలుగా ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు కూడా ఎక్కవమంది ఇష్టపడేది ధర్మాన్నే నీతిగా నిజయతిగా ధర్మరక్షణలో ఉన్న కధానాయకుడినే. అటువంటి గొప్ప తెలుగుచలనచిత్రాలలో ఎన్నెన్నో పాత తెలుగు చలనచిత్రాలు మనకి ధర్మాన్ని, నీతిని తెలుపుతూ ఆహ్లాదకరంగా సాగుతూ ఉంటాయి. హాస్యమైన ఆహ్లాదకరమైన మాటలే ఉంటాయి.

ఆలీబాబా అరడజను దొంగలు, గులేబకావళికధ, జగదేకవీరుని కధ, గుణసుందరికధ, పరమానందయ్య శిష్యుల కధ, మాయాబజారు, పాతాళభైరవి, చిక్కడు దొరకడు, మంగమ్మశపధం, లక్ష్మికటాక్షం, దక్షయజ్ఞం, దానవీరశూరకర్ణ, నర్తనశాల, పల్నాటి యుద్ధం మొదలైన మరెన్నో తెలుగు చలనచిత్రాలు మనకి లభిస్తున్నాయి.

చిత్రాలు చిత్రమైన కధలతో విచిత్రమైన ఆలోచనలతో తెరపై చలిస్తూ మందిమదిని చలింపచేస్తూ ఉంటాయి. మందిమదిలో మెదిలే ఆలోచనలు ఒకరిమదిలో తట్టిన ఆలోచన ఒక్కటై తెరపై చిత్రాలు(Chitralu)గా చలిస్తే అది విజయవంతమైన చలనచిత్రంగా ఉంటుంది. లక్షలాదిమందిమదిని రంజింపచేసిన తెలుగు చిత్రాలు అనేకమైనవి ఉంటాయి. మనమదిలో మంచివిషయాల(Manchi Vishayalanu)ను చేర్చడం ద్వారా మానుష ప్రయోజనం పెరుగుతుంది అని అంటారు. పాతచిత్రాలలో మందిమదిలో సరైన రీతిలో ఆలోచన సాగే విధంగానే చిత్రచిత్రీకరణ, మాటలు, పాటలు ఉండేవి. సదరు చిత్రాల ప్రభావం వలన సామాజికంగా అమానుష సంఘటనలకు దూరంగా సమాజం ఉండేది. ChitraVishayalu ChittaVishayalu – MovieThings MindThings Maybe Equal

Observation Things Becomes Good Knowledge

పాఠ్యపుస్తకాలలో ఉన్న విషయాల(Vishayala)పై సరైన అవగాహన లేకుండా వాటిని చదవకుండా ఉండే విద్యార్ధికి పాఠాలు అన్నా పరిక్షలు అన్న చిరాకులు, కోపాలు కలుగుతూ ఉంటాయి అని అంటారు. అలాగే మనసుయొక్క లక్షణం చిత్రకధ యొక్క ప్రయోజనం సామాజికంగా ఉండే ప్రభావం వీటిపై అవగాహన లేకపోతే విమర్శలు చేయడం విమర్శలు పాలుకావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అనుసరించేవారికీ తాము అనుసరిస్తున్నవారు తప్పుచేస్తే ఒప్పుకోరు, అయితే అనుసరించే విషయంలో అనుసరించే వారికి సరైన అవగహన ఉంటే, వారు తాము అనుసరిస్తున్న వారికి కూడా ఉపయోగపడతారు. కేవలం ఇష్టఇష్టాలకు ప్రాముఖ్యతను ఇచ్చి అనుసరించడం కొన్నిసార్లు మనసు రంజింపచేయబడుతుంది. కానీ ఎల్లావేళలా అంటే మాత్రం ధర్మమే ముఖ్యమని అనేక చలనచిత్రవీక్షణల ద్వారా బోధపడుతుంది.

స్మార్ట్ ఫోను సదుపాయాలు, అనువర్తనాలపై సరైన అవగాహన ఉన్నవారు, వాటిగురించి తెలియని ఇతరులకు కూడా వివరించగలుగుతారు. స్మార్ట్ ఫోను గురించి అంతగా అవగాహనలేని వారు అదంటే ఇష్టపడరు, అవసరమైనప్పుడు సాంకేతిక ఇబ్బందులకు గురి అవుతారు. చిత్రంగా చలనచిత్రాలు మందిమదిని రంజింపచేస్తుంటే, అవి స్మార్ట్ స్క్రీనుపై ఎప్పుడుకావాలంటే అప్పుడు తాకేతెరపై తాకిడికి వీక్షణలు పొందుతున్నాయి. యూట్యూబ్ ద్వారా వివిధ రకాల తాకేతెరలపై తాకితే చలించేవిధంగా సాంకేతికత అందిస్తుంటే, మంచిని తెలియజేసే చిత్రవీక్షణ మదికి సంతోషంతో బాటు, సామజిక విలువలు, కుటుంబవిలువలు, వ్యక్తిత్వం మొదలైన విషయా(Vishayallo)ల్లో మనోవికారాల గురించి పరిచయం పెరుగుతుంది. చెడువాసన ఎలా ఉంటుందో తెలిస్తేనే కదా చెత్త ఉన్నదారి వదిలి మంచిదారిన పడతాం. ఏ చిత్ర కధ అయిన చెడును చూపకుండా మంచి యొక్క గొప్పతనం చెప్పలేదు కాబట్టి, కధలో అంతర్యం మంచిది అయితే ఆ కధనం తీరు కాకుండా సదరు చిత్రంలో చెప్పబడుతున్న నీతిని గ్రహించడం మదికి మంచిది. Things related to thinking of the mind, which was attracted, ChitraVishayalu ChittaVishayalu – MovieThings MindThings Maybe Equal..

ఒకరిని చూసి ఒకరు చెప్పింది విని, కొంతమంది మదితో సహవాసం చేసే వృద్దిని పొందే మది మరలా మందిమదితో పోరుతుంది, మందిమదిలో ఎదోఒక మదిని ఇష్టపడుతుంది, మరొకమదిని కావాలంటుంది, మరోమదిని ద్వేషిస్తుంది. కొంతమంది మదిచేత పొగడబడుతుంది, కొంతమందిమదిచేత విమర్శించబడుతుంది, ఇలా ఒకమది మందిమదితో సమాజంలో సమస్యలతోను, సంతోషాలతోను సహాజీవనం చేస్తుంది. ఇంతపనిచేసే మది తనని తాను గుర్తిస్తే వచ్చే పరమార్ధం ఏమిటో సదరు మదికే తెలియాలని మనో పండితులు చెబుతూ ఉంటారు.

Chittam Chitra Vishayalu Vichitramga untayi.

చిత్తా(Chittam)నికి చిత్రంగా చలనచిత్రాల విషయాలు(Vishayalu) నమోదు అవ్వడం విశేషంగా ఉంటుంది, అటువంటి చిత్తాన్ని మంచి చిత్రవిషయాల(Chitra Vishayala) పరిచయం వలన మదికి మేలు జరుగును అంటారు. చెప్పడం, వినడం మదిచేస్తూ ఉంటే చెప్పడం వినడం తేలికైన పని. గుర్తుపెట్టుకోవడం తేలిక మరీ చెప్పినంత తేలిక కాదు. ఆచరణ కష్టం చెప్పినంత, గుర్తు పెట్టుకున్నంత తేలిక కాదు కానీ కష్టపడితే ఫలితం ఉంటుంది. ChitraVishayalu ChittaVishayalu – MovieThings MindThings Maybe Equal.

ధన్యవాదాలు
జైచిత్ర-JaiChitra