Menu Close

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

అలనాటి మేటి చిత్రాల్లో భక్తపోతన భక్తీచిత్రం. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana Samskrutam nundi Telugulo Anuvadinchina Bhakta Potanaamaatyulu శ్రీకృష్ణుడు మహాభారతం నడిపించడానికి ద్వాపరయుగంలో ధర్మానికి అధర్మానికి యుద్దంలో ధర్మాన్ని రక్షించబూనిన వారికి మద్దతుగా ఉంటూ ధర్మ సంస్థాపన చేయడానికి అవతరిస్తే, ఆ మహాభారతాన్ని సంస్కృత రచన చేసిన వేదవ్యాసుడు, ఆ పరబ్రహ్మ లీలలను కూడా చెప్పదలచి భాగవతం కూడా రచనచేసి ఆత్మతృప్తిని పొందినట్టుగా శాస్త్ర పండితులు పలువురు ప్రవచన కారులు చెబుతారు. భాగవతం వింటే పుణ్యం కలుగుతుంది అని, మరీ భక్తిశ్రద్దలతో వింటే మోక్షమే ప్రాప్తిస్తుంది అని కూడా ప్రవచన కారులు వారి వారి ప్రవచనాల ద్వారా చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల చేత చెప్పబడుతున్న మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహానుభావుడు, తెలుగుజాతికి విలువైన భక్తీ గ్రంధాన్ని అందించిన బమ్మెర పోతరాజు గురించిన తెలుగు చలనచిత్రం చూడడం కూడా ఒక అదృష్టమే అంటారు. ‘BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

భాగవతమును తెలుగులోకి అనువదించిన మహానుభావుడు పోతనామాత్యుడు జీవితం ఆధారంగా తెలుగు చిత్రంగా మలిచిన మరో సినీమహానుభావుడు కె.వి. రెడ్డి(కద్రి వెంకటరెడ్డి)గారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన తెలుగుచలనచిత్రంలో పోతనగా చిత్తూరి నాగయ్య నటిస్తే, ఇంకా ముదిగొండ లింగమూర్తి, హేమలతదేవి, టంగుటూరి సూర్యకుమారి తదితరులు నటించారు. బమ్మెర పోతన జీవితంలో భాగవతం వ్రాయడానికి పురిగోల్పిన పరిస్థితులు, భాగవతం వ్రాస్తుండగా భగవానుడు సహకరించిన సన్నివేశాలతో చిత్రం BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana భక్తప్రదంగా సాగుతుంది.

వ్యాసభాగవతం ఆధారంగా తెలుగులో భాగవతం రచన ప్రారంభించిన భక్త పోతన

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaఏకశిలానగరంలో శ్రీరామునిపై ప్రార్ధన పాటతో చిత్రం మొదలవుతుంది, అందరిని దైవ బిడ్డలుగా భావించే పోతనగారి ఔన్నత్యం ఆ పాట తరువాత కనిపిస్తుంది. కవిసార్వభౌమ శ్రీనాధుడు, పోతనామాత్యులు బావబావమరుదులు. శ్రీనాధుడి కూతురుకు, పోతన ఇంటిలోనే పెరుగుతూ ఉంటుంది. వారివురుకు వివాహం చేసే ఆలోచన కూడా ఉంటుంది. ఇంకా పోతన కూతురుతో భార్యాభర్తలు కలిసి ఇంటిలో ఉంటూ ఉంటారు. పోతన భక్తి పరిపక్వతకు వచ్చిందని పోతనను అనుగ్రహింప దలచిన భగవానుడు, ఆమాట సీతమ్మతల్లితో చెప్పి బయలుదేరతాడు. భోజనానికి కూర్చుండబోతున్న సమయానికి ఒక అన్నార్ది పోతన ఇంటికి వస్తాడు. వారు తమ భోజనం మాని, ఆ అతిథికి భోజనం కడుపునిండా పెట్టి పంపుతారు, పోతనామాత్యులు. ఇంటి బయటకు వచ్చిన ఆఅతిథి భగవానుడి రూపంలో అంతర్ధానం అవుతారు. పోతననే అనుగ్రహించిన భగవానుడు, పోతనకు శ్రీసీతారాములుగా కనిపించి, శ్రీమహాభాగవతముని తెలుగు అనువదించమని చెప్పి అంతర్ధానం అవుతారు.



పోతనామాత్యులు తనఇంటి పూజామందిరంలోనే, భగవానుణ్ణి అర్చించి, భాగవతం తెలుగులో రచన చేయడం ప్రారంభిస్తారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చేడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండేడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్యుత కవిత్వ మహాత్య పటుత్వ సంపదల్ లాంటి ఎన్నో మహిమాన్విత పద్యాలు భాగవతంలో పెక్కుగా ఉంటాయి.

గజేంద్రమోక్ష ఘట్టంలో పోతన వేషంలో పద్యరచన చేసిన శ్రీరామచంద్ర మూర్తి

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaగజేంద్రమోక్షం ఘట్ట రచనలో శ్రీమహా విష్ణువు వైకుంఠం నుండి ఉన్నఫలంగా బయలుదేరే సన్నివేశం వివరణ తోచని మహాకవి పోతనామాత్యులు, అయన కూతురు లక్ష్మిని అక్కడే పూజగదిలోనే కూర్చుండబెట్టి, గుడికి ఆలోచిస్తూ బయలుదేరతారు. పచార్లు చేసి ఆలోచనలతో తిరిగి ఇంటికి వచ్చిన పోతనామాత్యులకు గొప్ప విషయం తెలుస్తుంది. మరలా వ్రాయడానికి తాళపత్రం చూడగానే అందులో తాను వ్రాయదలచిన ఘట్టం వ్రాయబడి ఉంటుంది. ఎలా అనుకుండగా కూతురు లక్ష్మి మీరే కదా అలా వెళ్లి ఇలా వచ్చి పద్యం తట్టినది అని వ్రాసారు, అని చెబుతుంది. అప్పుడు అవగతం అవుతుంది  పోతనామాత్యులకు, తానూ బయటికి వెళ్ళాక, తన వేషంలో శ్రీరామచంద్ర మూర్తి వచ్చి శ్రీమహావిష్ణువు గజేంద్ర రక్షణార్ధం వైకుంఠం నుండి ఎలా బయలుదేరినది వివరించి వెళ్ళారని. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaవిష్ణుభగవానుడి అవతార ఘట్టాలతో సాగే భాగవత రచన చేస్తున్న పోతనకు, పోతన కుటుంబ సభ్యలు సేవలు చేస్తూ సహకరిస్తూ ఉంటారు. పోతన భావమరిది అయిన కవిసార్వభౌమ శ్రినాధులు రాజాశ్రయంతో భోగభాగ్యాలతో ఉంటారు. అటువంటి సమయంలో పోతన రచన చేసిన ఒక పద్యం ఒకటిని శ్రీనాధకవిసార్వభౌముల వారు ఆ రాజుకి వినిపిస్తారు. ఆ పద్యం విన్న రాజుగారు పోతనను సత్కరింపదలుస్తారు. అలాగే ఆ భాగవతమును తనకు అంకితం ఇవ్వవలసినదిగా పోతనకు చెప్పమని, రాజుగారు బహుమానాలు శ్రీనాధకవిసార్వభౌముడితో పంపిస్తాడు. పోతనకు నేచెప్పి ఒప్పించెదనని పలికిన కవిసార్వభౌమ శ్రీనాధులు, పోతనకు ఇంటికి వస్తారు.

భాగవతం రాజుకి అంకితం ఇవ్వవలసినదిగా శ్రీనాధకవిసార్వభౌమ పోతనని అడుగుట

పోతనతో భేటి అయిన కవిసార్వభౌమ శ్రీనాధులు వారు, రాజుగారి తలంపును పోతనతో చెబుతారు. అందుకు పోతనామాత్యులు ఆరచన నాదైతే కధా ఆభాగవతం శ్రీరామంకితం నేను రాజుకి అంకితం ఇవ్వటానికి నాది అను కావ్యమేది లేదని చెబుతారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా పోతన మాటకే మద్దతుగా నిలబడతారు. పోతనామాత్యుల వారి మాట శ్రీనాధ కవికి, రాజుకి కూడా రుచించవు. రాజుగారి దగ్గర నుండి తనకు వచ్చిన బహుమానాలు పేదవారికి దానం చేస్తూ, పోతనామాత్యుల ఉంటుండగా, రాజపరివారంతో శ్రీనాధ కవిసార్వభౌములవారు పోతన ఇంటికి వస్తారు.

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaరాజుగారికి భాగవతం అంకితం ఇస్తావా సరే లేకపొతే నా కూతురు కూడా నీకు కోడలు కాదని హెచ్చరిస్తాడు, శ్రీనాధుడు పోతనని. కొడుకు కోసం ఒప్పోకోమని పోతన భార్య వేడుకున్నా, పోతనామాత్యుడు భాగవతం భగవంతుడి సొత్తు, అంకితం ఇవ్వడానికి నేనేవ్వరనే సమాధానమే చెబుతారు. ఇక చేసేది లేక శ్రీనాధకవిసార్వభౌమ పోతన కుటుంబానికి ఆలోచన చేసుకుని చెప్పమని కోరతాడు. ఆరోజు అంతా దుఃఖంతో మునుగుతుంది. ఆకష్టాలలో రాజుకు అంకితం ఇవ్వమనే ప్రోత్సహకానికి పోతనామాత్యులు ఎక్కడ లొంగుతారు అనో ఏమో సాక్ష్యాత్తు సరస్వతీ మాతే పోతన నట్టింట విలపిస్తూ కనబడడం భక్తీ హృదయాన్నే తాకుతుంది. ఆఅమ్మకు ఈ బిడ్డడు మాట ఇచ్చి, అమ్మ కన్నీరు తుడిచి, తన కుటుంబం కన్నీరుకు కారణంగా ఉంటారు పోతనామాత్యులు. కవిసార్వభౌమ శ్రీనాధులను పోతనగారు శ్రీమద్భాగవతం రాజుకి అంకితం ఇవ్వబోనని తేల్చి చెప్పి పంపుతారు. శ్రీరాముడినే నమ్ముకుని ఉన్న పోతనామాత్యులు భాగవత రచనని కొనసాగిస్తూ ఉంటారు.

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaపోతనామాత్యుల మాటను రాజధిక్కారంగా భావించిన ఆ రాజు, పోతనను దుర్హహంకారిగా జమకట్టి, సేనాధిపతిని సైన్యంతో పోతన ఇంటికి వెళ్లి భాగవతం తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. పరమరామ భక్తుడు అయిన పోతనామాత్యులు భగవదారాధనతో ఉంటుండగా, రాజ సేనాని రాజభటులతో పోతన ఇంటికి రావడం జరుగుతుంది. ఏకశిలానగరంలో పోతనామాత్యుల ఇంటిముందుకు వచ్చిన రాజభటులకు శ్రీఆంజనేయ స్వామి కనబడగానే, వారు రామభజన చేస్తూ పారిపోతారు. రాములవారి గుడిలో దీపారాధనని అవమానించిన వ్యక్తికి, ఆంజనేయస్వామి బుద్ది చెప్పుతాడు.

సీతమ్మ దయతో వందలమందికి పంచభక్ష్య పరవన్నాలతో ఆతిధ్యం ఇచ్చిన పోతనామాత్యుల కుటుంబం.

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaపోతన పేదరికం అంటే చిన్నచూపు చూపే పోతన బావగారు అనేకమంది తన తోటి పండితులను పోతనామాత్యుల ఇంటికి అతిథులుగా ఆతిధ్యం కోసం తీసుకువస్తాడు. ఇంట్లో ఒక బియ్యం గింజ లేని సమయంలో అతిధులు రావడం, పోతనామాత్యుల భార్య సీతమ్మతల్లిని ప్రార్ధన చేయడంతో, అమ్మ అనుగ్రహంతో పోతనామాత్యుల కుటుంబం వచ్చిన అతిథులకు పంచభక్ష్య పరవన్నాలతో ఆతిధ్యం ఇస్తారు. ఆతిధ్యం స్వీకరించిన పండితులంతా పోతనతో సమావేశమై నన్నయ్య, తిక్కన భారతం అంకితం ఇచ్చారని, అలాగే మీరు ఇవ్వవలసినదిగా సూచన చేస్తారు. అయినా పోతనామాత్యుల వారు భగవత్పరమైన భాగవతమును ఎవరికీ అంకితం ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పుతారు.

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaపండితుల మద్య వాదనకు దిగిన శ్రీనాధ కవిసార్వభౌమ భాగవత దూషణ చేయబోతు, గజేంద్ర మోక్షంలో పరుగు పరుగున వచ్చిన విష్ణుమూర్తి అలా రావడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. ఇదంతా వినోదంగానే తలపిస్తుంది అని అంటుండగా అంతలోనే ఇంటిబయట ఆడుకుంటున్న శ్రీనాధుడి కూతురుకి ఎదో అయ్యింది అని అరుపు వినగానే అందరూ గబాగబా బయటకి వస్తారు. వెంటనే పోతనామాత్యులవారు సన్నివేశం గుర్తు చేస్తూ, ప్రేమానుభందాలు కలిగిన మనమే ఇంత అల్లాడితే, మరి భగవంతుడు ఇంకెంత అల్లాడుతూ భక్తుల కోసం తపిస్తూ ఉంటాడు అని అనగానే, శ్రీనాధ కవిసార్వభౌమతో సహా వచ్చిన పండితులంతా పోతనకు నమస్కరించినిలబడతారు. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaఇక రాజు శింగభూపాలుడు పోతనకు రాజ్య బహిష్కరణ విధిస్తారు. కట్టుబట్టలతో కుటుంబం రాజ్యాన్ని విడిచివెళ్ళాలని రాజు ఆజ్ఞాపించడంతో బమ్మెర పోతనామాత్యులు కుటుంబంతో సహా కట్టుబట్టలతో ఊరు వదిలి బయలుదేరతారు. అయితే పోతనామాత్యులు రచన చేసిన భాగవత గ్రంధం పోతనామాత్యుల పూజగదిలోనే ఉంటుంది. పోతనామాత్యులు ఊరు వదిలి వెళ్ళాక శ్రీమద్భాగవత గ్రంధాన్ని తీసుకొని పోదలిచిన రాజభటుల ప్రయత్నాలు విఫలం అవుతాయి. అయితే ఆఖిరికి సేనాధిపతి కూడా శ్రీమద్భాగవత గ్రంధ దరిదాపులకు చేరలేక పోతాడు. ఈ విషయం రాజుకి నివేదించగా రాజు పోతనామత్యుడి ఇల్లుని కూలగొట్టమని ఆజ్ఞాపిస్తాడు.

అందరి సమక్షంలో భాగవతాన్ని భగవంతుడికి అర్పించిన పోతనామాత్యులు

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachanaరాజభటులు పోతనామాత్యుల ఇంటిని కూలగొడుతున్న కొలది రాజభవనాల్లో ప్రకంపనలు వచ్చి, రాజు భయకంపితుడు అవుతాడు. ఇదంతా పోతనామాత్యుల భక్తీ ప్రభావమేనని తెలుసుకుని పోతనామాత్యుల వద్దకు వచ్చి బమ్మెర పోతన కాళ్ళపై పడతాడు రాజు. చివరికి రాజు సమక్షంలో శ్రీసీతారాములకే భాగవతం సమర్పిస్తారు, బమ్మెర పోతనామాత్యులు. ఎన్ని కష్టాలు కలిగిన ఓర్చుకుని భాగవతాన్ని భగవత్పరం చేసిన ఘనుడుగా పోతనామాత్యులని రాజు కొనియాడతాడు. “BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana”

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra