Menu Close

Arjun Reddy Fame Vijay Devarakonda GitaGovindam

Arjun Reddy Fame Vijay Devarakonda GitaGovindam

Arjun Reddy Fame Vijay Devarakonda GitaGovindam Cinema View

Arjun Reddy Fame Vijay Devarakonda GitaGovindam Cinema View in Telugu. అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న విజయదేవరకొండ మంచి ఇమేజ్ సంపాదించారు. ఆ తరువాత  మహానటి చిత్రంలో కెమెరామేన్ గా కనిపించారు. ఈరోజు విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం చిత్రం విడుదల అయ్యింది. అర్జున్ రెడ్డి అంచనాలు లేకుండా వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తే, గీతగోవిందం అంచనాలతో విడుదల అయ్యింది. అంచనాలు ఉన్న చిత్రాలు ఒక్కోసారి తలక్రిందులు చేస్తూ ఉంటాయి, కానీ కొత్త హీరోల విషయంలో ఎక్కువ అంచనాలు అందుకోవడం ఉంటుంది.


అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ కనిపించినట్టు కాకుండా అందుకు భిన్నంగా కుటుంబ కధా చిత్రంలో నటించడం ఆకట్టుకునే విషయం. కధలోకి వెళితే, విజయ్ గోవింద్ గుళ్ళో తొలిసారి చూసిన గీతపై మనసు పడితే, అదే అమ్మాయికి బస్సులో పొరపాటుగా జరిగిన సంఘటన వలన గోవింద్ పై ద్వేషం పెరిగితే, అదే అబ్బాయితో అదే అమ్మాయి కలిసి జీవితప్రయాణానికి కారణమయ్యే ప్రణయం ఎలా ఉంటుందో ఈ చిత్ర కధాంశం. కొత్తగా వచ్చినవారు కొత్తల్లో భిన్న పాత్రల్లో కనబడితే, చూసే ప్రేక్షకులకి కూడా ఆ విధంగా చూడడం ఒక అలవాటుగా మారుతుంది. అలా అర్జున్ రెడ్డి చిత్రానికి గీతగోవిందం చిత్రానికి విజయ్ దేవరకొండ నటనలో భిన్నత్వం కనబడుతుంది. సాంప్రదాయ పద్దతిలో ఉండే ఒక ప్రొఫెసర్ పాత్రలో మంచి భార్యకోసం ఎదురుచూసే యువకుడుగా గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండ మెప్పిస్తే, దర్శకత్వ ప్రతిభ Arjun Reddy Fame Vijay Devarakonda GitaGovindam చిత్రాన్ని ముందుకు నడిపిస్తుంది.

కధ చిన్నదైనా, పాతదైనా చెప్పేవిధానం ప్రేక్షకులకు నచ్చితే చిత్రం విజయవంతం అవుతుంది, అలా చెప్పడంలో ఎక్కువగా కామెడీ సన్నివేశాలతో కలిగే కధనం ఇప్పటి చిత్రాల్లో ఫాషన్. అలాగే ఈ చిత్రం కామెడీ కధనంతో విజయ్ దేవరకొండ ప్రధాన ఆకర్షణగా రష్మిక మందన తోడుతో ప్రేక్షకభిమానానికి దగ్గరైంది. కుటుంబ కధా చిత్రాలు యువతకి నచ్చే విధంగా తీయడంలో గుర్తింపు పొందిన సోలో, శ్రీరస్తు శుభమస్తు చిత్రాల దర్శకుడు పరశురాం ప్రతిభ ఈ చిత్ర కధనంలో కనబడుతుంది.

మొదటిబాగం చక్కగా ఉంటే రెండవభాగం చివరికి ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ముగుస్తుంది. అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ స్నేహితులతో చేసే కామెడీకి తోడూ, చిత్రం చివరి భాగానికి ముందుగా ప్రవేశించే వెన్నెల కిషోర్ పాత్రతో చిత్రం మరింత వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబ కధా చిత్రాల్లోకి చేరిపోయే గీతగోవిందంచిత్రానికి మంచి టాక్ వచ్చినట్టే. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించిన చిత్రంలో సంగీతం, ఫోటోగ్రఫీ బాగుంటాయి. “Arjun Reddy Fame Vijay Devarakonda GitaGovindam” have good talk. అదనపు ఆకర్షణగా అను ఇమ్మన్యుయల్, నిత్యమీనన్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. గీత గోవిందం కుటుంబ కధా చిత్రం.

ధన్యవాదాలు
జైచిత్ర – Jai Chitra