రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ చలనచిత్రం.

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ చలనచిత్రం.

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ చలనచిత్రం.రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ చలనచిత్రం. నాన్నకు ప్రేమతో, జనతా గారేజ్ వంటి విబిన్న చిత్రాలలో నటించిన ఎన్టిఆర్ మరలా సింహాద్రి-యమదొంగ కాంబినేషన్లోకి, రామ్ చరణ్ రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంతో మరలా మగధీర కాంబినేషన్లోకి, రాజమౌళి బాహుబలి 1&2 ఇంటర్నేషనల్ హిట్స్ తర్వాత ముందర చెప్పబడిన సింహాద్రి హీరో ఎన్టిఆర్ తో మగధీర హీరో రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం తెరకేక్కబోతున్న విషయం లోక విదితమే. అలాగే ఈ చిత్రం గాసిప్ కూడా R.R.R. గానే చెబుతున్నారు, రామరావు, రాజమౌళి, రామ్ చరణ్ మూడు పేర్లలో మొదటి అక్షరాలు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్స్ కూడా ఆర్ అక్షరంతో ప్రారంభం అయ్యే హీరోయిన్స్ ను ఎంపిక చేయవచ్చు అని ఊహ, అదే నిజమైతే ఆ అదృష్టం రెజినా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారికీ పట్టవచ్చు.

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ చలనచిత్రం.దర్శకులు రాజమౌళి చిత్రాలకి కధని అందించే విజయేంద్ర ప్రసాద్ స్వతంత్ర పోరాట సమయ ప్రభావితమైన సన్నివేశాలతో కూడి ఉండవచ్చని ఊహాగానాలు. ఈసారి అంతగా గ్రాఫిక్స్ ఉపయోగించకుండానే చిత్రం తెరకెక్కించాలని రాజమౌళిగారి అభిప్రాయంగా చెప్పబడుతుంటే, కధనంలో దమ్ము చూపించే రాజమౌళి చిత్రాలకు గ్రాఫిక్స్ తో అంత అవసరం పట్టదు. ఇంతకముందు దర్శక నిర్మాతలు కొంతమంది  గ్రాఫిక్స్ ఎక్కువ ఖర్చు చేసి, కధ కధనంలో శ్రద్ధ చూపకపోవడం వలననే కొన్ని చిత్రాలతో నష్టాలూ చవిచూసారు. కానీ రాజమౌళి చిత్రాలకు ఎంత ఖర్చు పెట్టిన అంతకుమించి లాభాలు గడించడం ఉంటుందని, రాజమౌళి గారి చిత్ర విజయాలు నిరూపిస్తాయి.

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ చలనచిత్రం.త్రిబుల్ ఆర్ చిత్రం ఎన్టిఆర్, రామ్ చరణ్ ప్రస్తుత షూటింగ్ చిత్రాలు ముగిసేటప్పటికి ఈ చిత్రం ప్రారంభం కావచ్చు. రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రంలో నటిస్తుండగా ఎన్టిఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో నటిస్తున్నారు. రెండు చిత్రాలు పూర్తికాగానే ప్రారంభం కాబోయే త్రిబుల్ ఆర్ చిత్రానికి అంచనాలు మించే ఉంటాయి. కేవలం రాజమౌళి ఒక ఈగతో చిత్రం తీస్తేనే క్రేజీ ప్రాజెక్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. అలాంటిది ఏకంగా ఇద్దరు పాపులర్ యంగ్ హీరోలను ఒకే వెండితెరపై అంటే సగటు అభిమాని అంచనాలు ఎక్కువగా ఉంటే, ప్రత్యేక హీరో అభిమాని అంచనాలు అంతకుమించి ఉంటాయి అనడంలో సందేహం లేదు.

రంగస్థలంలో రామ్ చరణ్ నటన విమర్శకుల ప్రశంశలు అందుకుంటే, ఎన్టిఆర్ నాన్నకు ప్రేమతో, జనతా గారేజ్ చిత్రాలకు ప్రశంసలు అందుకున్నారు. ఇద్దరు హీరోలు రాజమౌళి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ వారి కెరీర్లో అప్పటికి అత్యుత్తమ విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఇక రాజమౌళి అంటే జక్కనగా ప్రసిద్ది చెంది, ఇప్పటి దర్శకులలో అపజయం ఎరుగని దర్శకుడుగా నిలబడ్డారు. చలనచిత్ర జక్కన రాబోయే చిత్రం ఇద్దరు హీరోలు అభిమానులతోపాటు అందరి ప్రేక్షకాదరణను పొందడానికి తొందరగా ప్రారంభం కావాలని ఆశిస్తూ… జైచిత్ర.

మగధీర చిత్రం గురించి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా…

మగధీర చలనచిత్రం వచ్చి తొమ్మిదేళ్ళు ఈరోజుకి పూర్తయ్యాయి. తెలుగు భారి బడ్జెట్ చిత్రాలు తీయడానికి ఈ చిత్రవిజయం మంచి ఊతం ఇచ్చిందని చెబుతారు. తరువాత ఈగపై చిత్రానికి కూడా కోట్లు ఖర్చుపెట్టిన ఘనత తెలుగు చిత్రసీమకే దక్కుతుంది. అప్పటికి రామ్ చరణుకి మగధీర రెండవ చిత్రం అయితే దర్శకుడు రాజమౌళిని ఇంకో మెట్టు ఎక్కించిన చిత్రం. అంతకుముందు ప్రతి చిత్రానికి విజయాన్ని అందుకున్న రాజమౌళి ఈ చిత్రంతో భారి బడ్జెట్ చిత్రాలకే దర్శకుడుగా మారారు.

కాజల్ అగర్వాల్ అప్పటికి చిత్రాలు ఉన్న అంతగొప్ప విజయాలు కావు కాని మగధీరతో టాప్ లిస్టులో వన్ గా నిలిచింది. మొత్తానికి మగధీర అప్పటికి ఇండస్ట్రీలో సెటిల్ ఉన్నవారే అయినా మరొక్కసారి మగధీర టీము గురించి చర్చించుకునే అంతగా చిత్రం విజయవంతం అయ్యింది. ఆ చిత్రం విజయం తరువాత రామ్ చరణ్ రాజమౌళి కాజల్ అగర్వాల్ ముగ్గురి ప్రయాణం విజయంతంగానే నడుస్తూ ఉంది.

రామ్ చరణ్ రంగస్థలం హిట్ తో మంచి జోష్ మీద ఉంటే, రాజమౌళి బాహుబలి 1 & 2 చిత్రాల విజయంతో జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. కాజల్ అగర్వాల్ అగ్రహీరోలు అందరితో నటించింది, చిరంజీవి 150వ చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. ఇక మగధీర సాంకేతిక టీం అంతా రాజమౌళితోనే ఉంటుంది కాబట్టి మగధీర టీం విజయపధంలో నడుస్తుంది.

ధన్యవాదాలు
జైచిత్ర-JaiChitra