SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy, VijayaBhaskar: సింగీతం శ్రీనివాసరావు, బాపు, బి గోపాల్, క్రాంతి కుమార్, ఎస్వి కృష్ణారెడ్డి, విజయ భాస్కర్ ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకులు.

సింగీతం శ్రీనివాసరావు – SingeetamSrinivasaRao

సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మమైన పుష్పకవిమానం, ఆదిత్య 369 చిత్రాలకు దర్శకత్వం వహించారు. పుష్పకవిమానం చిత్రం మాటలు లేకుండానే ప్రారంభమై ముగుస్తుంది, కేవలం నటనతో నవ్వుతెప్పించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదిత్య369 టైం మెషిన్ అనే యంత్రంతో కాలంలో ప్రయాణించే ప్రయోగం చేసారు. 1990లలో వ్యక్తులు శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యానికి వెళితే ఎలా ఉంటుంది, వారే 2500 సంవత్సరాలలోకి వెళితే ఎలా ఉండబోతుందో ఈ చిత్ర సన్నివేశాలు ఉంటాయి.

కమలహాసన్ తో అమావాస్య చంద్రుడు, సొమ్మొకడిది సోకొకడిది, పుష్పకవిమానం, మైకేల్ మదన కామరాజు, అపూర్వ సహోదరులు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా ప్రయోగాత్మక సందేశాత్మక కుటుంబ కధలను తెరకెక్కించారు. మయూరి, తరం మారింది, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, భైరవద్వీపం, మేడం, బృందావనం, జమిందారు గారి అమ్మాయి, నీతి నిజాయితీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బాపు – Bapu

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddyబాపు బొమ్మ, బాపు వ్రాత, బాపు కార్టూన్, బాపు ఫాంట్ ఇలా కొన్నింటిలో బాపు పేరు బ్రాండు గా ఉంది. అలాగే బాపు చిత్రాలలో నటించిన నటిమణిని కూడా ఒక బాపు బొమ్మగా చూస్తారు, తెలుగు చలనచిత్ర అభిమానులు. పౌరాణిక బొమ్మలు గీసిన సాంఘిక బొమ్మలు గీసిన బాపు బొమ్మల బహు ప్రసిద్ది పొందినవి, అలాగే బాపు కార్టూన్స్ కూడాను. ఇలా బహుముఖ ప్రజ్ఞా పాటవాలు కొంతమందికే ఉంటాయి, అటువంటి వారిలో బాపు ఒకరు. సాక్షి తెలుగు చిత్రంతో దర్శకులుగా మారిన బాపుగారు పలు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపుగారిపై ఆరుద్రగారు పద్యం చెప్పడం బాపుగారి ప్రజ్ఞా ఏపాటిదో అర్ధం అవుతుంది.

పలు పౌరాణిక సాంఘిక తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, ముత్యాల ముగ్గు చిత్రాలకు పలు అవార్డులు వచ్చాయి. ఇంకా సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు, బాలరాజు కధ, అందాలరాముడు, శ్రీ రామాంజనేయ యుద్ధం, త్యాగయ్య, రాదా కళ్యాణం, కళ్యాణ తాంబూలం, రాధగోపాలం, శ్రీనాధ కవిసార్వభౌమ, శ్రీరామరాజ్యం, శ్రీకృష్ణావతారం, భక్త కన్నప్ప, మంత్రిగారి వియ్యంకుడు,మనవూరి పాండవులు మొదలైన తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

బి. గోపాల్ – BGopal

ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన బి. గోపాల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించారు. కలెక్టర్ గారి అబ్బాయి, బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడి, లారీ డ్రైవర్, స్టేట్ రౌడి, మెకానిక్ అల్లుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి లాంటి అగ్రహీరోలకు అందించారు. యాక్షన్ చిత్రాలను కుటుంబ కదా చిత్రాలను ఎక్కువ తెరకెక్కించిన బి. గోపాల్, రాయలసీమ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు దర్శకత్వం వహించి విజయవంతమైనారు.

క్రాంతి కుమార్ – KrantiKumar

మహిళా పాత్రలు ప్రధానంగా కుటుంబ కదా చిత్రాలను దర్శకత్వం చేసి మరియు నిర్మాతగా తెలుగు చిత్రాలను అందించారు. క్రాంతి కుమార్ నిర్మించిన ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు చిత్రాలతోనే చిరంజీవి వెండితెరకి పరిచయం అయ్యారు. అలాగే మీనా కూడా క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనువరాలు చిత్రంతో ప్రధాన పాత్రలో పరిచయం అయ్యారు. దర్శకులుగా నిర్మాతగా కూడా నంది అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.

శుభసంకల్పం చిత్రం

స్వాతి, అగ్నిగుండం, స్రవంతి, హీరో బాయ్, అరణ్యకాండ, శారదాంబ, గౌతమి, నేటి సిద్ధార్ధ, సీతారామయ్యగారి మనుమరాలు, అక్క మొగుడు, రాజేశ్వరి కళ్యాణం, సరిగమలు, భలేపెళ్ళాం, పాడుతా తీయగా, 9 నెలలు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. జ్యోతి, శారద, ఊర్వశి, కల్పన, పునాదిరాళ్ళు, ప్రాణంఖరీదు, సర్దారు పాపారాయుడు, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, శివుడు శివుడు శివుడు నేటి సిద్దార్ధ, రిక్షావోడు, 9 నెలలు మొదలైన చిత్రాలను నిర్మించారు.

ఎస్వి కృష్ణారెడ్డి – SVKrishnaReddy

ఎస్వి కృష్ణారెడ్డి కొబ్బరిబొండం చిత్రానికి కధని అందించి ఆ చిత్రానికే సంగీతం కూడా స్వరపరచారు, మాయలోడు చిత్రానికి కధ, కధనం, సంగీతం, దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్ – సౌందర్య కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో వరుసగా ఎస్వి కృష్ణారెడ్డి చిత్రాలు వచ్చి మహిళా ప్రేక్షకాదరణను పొందాయి. ఎక్కువ కుటుంబ కధలను హాస్య, సెంటిమెంట్ చిత్రాలను తెరకెక్కించారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, నెంబర్ వన్, యమలీల, శుభలగ్నం, మావిచిగురు, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, ప్రేమకు వేళాయారా, సర్దుకుపోదాం రండి, పెళ్ళాం ఊరెళితే వంటి కుటుంబ కదా చిత్రాలను అందిచారు. ఉగాది, అభిషేకం చిత్రాలలో కధానాయకుడిగా నటించారు.

కె విజయ భాస్కర్ – VijayaBhaskar

1991 ప్రార్ధన చిత్రంతో దర్శకులుగా పరిచయమైనా విజయ భాస్కర్ మరలా తొమ్మిది సంవత్సరాలకు 1999లో వేణు తొట్టెంపూడి – లయ ప్రధాన పాత్రలుగా స్వయంవరం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్ర విజయం తరువాత తరుణ్ – రిచా లతో నువ్వే కావాలి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇక వరుసగా నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, నాగార్జునతో మన్మధుడు, చిరంజీవితో జైచిరంజీవ చిత్రాలకు దర్శకత్వం వహించిన కె విజయ భాస్కర్ క్లాస్ మేట్స్ భలేదొంగలు, ప్రేమ కావాలి, మసాలా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. హాస్య ప్రధానంగా కుటుంబ ప్రేమ కధలను అందించి ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలను దర్శకత్వం చేసారు. నువ్వే కావాలి చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు పొందారు.

SingeetamSrinivasaRao, Bapu, BGopal, KrantiKumar, SVKrishnaReddy, VijayaBhaskar Telugu chalanachitra darshakulu.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra