JaiChitra Telugu Comdey Hasya Chitra Darshakulu

JaiChitra Telugu Comdey Hasya Chitra Darshakulu

సూపర్  హిట్ చిత్రాలలో యాక్షన్, ఫాంటసీ, డ్రామా, విబిన్న కదాంశాలతో తెలుగు చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ కామెడీ చిత్రాలు మనుసుకి హాయిని తీసుకువస్తాయి. JaiChitra Telugu Comdey Hasya Chitra Darshakulu, తెలుగులో కొంతమంది కామెడీ డైరెక్టర్స్ తీసిన చిత్రాలు. హాస్య ప్రధానంగా చిత్రాలను తెరకెక్కించే దర్శకులు. మనిషికి నవ్వే ఆరోగ్యంగా సంతోషం సగం బలంగా చెబుతూ ఉంటారు. అటువంటి నవ్వు తెప్పించే కొన్ని కామెడీ చిత్రాలను అందించిన దర్శకులు. జంద్యాల, ముత్యాల సుబ్బయ్య, వంశీ, ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కె విజయ భాస్కర రెడ్డి లాంటి దర్శకులు కామెడీ, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా లాంటి చిత్రాలని అందించారు, కొంతమంది దర్శకులు కె రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కె ఎస్ ఆర్ దాస్ మొదలైనవారు యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, సామజిక అంశాలపై చిత్రాలను తెరకెక్కించారు. కొంతమంది హాస్యమే ప్రధానంశంగా చిత్రాలను దర్శకత్వం వహించారు.

శివనాగేశ్వర రావు – JaiChitra Telugu Comdey Hasya Chitra Darshakulu

కిడ్నాప్ కధని కామెడీగా మనీ మనిషిని ఎలా అడిస్తుందో వెండితెరకెక్కించి, దర్శకుడుగా పరిచయం అయ్యారు శివనాగేశ్వర రావు. తరువాత హాస్య ప్రధానంగా పలు హాస్య (కామెడీ) చిత్రాలను తెరకెక్కించారు. వన్ బై టూ, లక్కీ ఛాన్స్, మనీ మనీ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. పసిపిల్లవాడు ప్రధాన పాత్రధారిగా హాస్య చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగార్జున కొడుకు అయిన అఖిల్ ని మాస్టర్ అఖిల్ గా చిన్నప్పుడే సిసింద్రిగా పరిచయం చేసారు. ఆద్యంతం సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రాలలో బ్రహ్మానందంతో హాస్య సన్నివేశాలు బాగా ప్రేక్షకాదరణను పొందినాయి. పట్టుకోండి చూద్దాం, ఓ పనైపోతుంది బాబు, హాండ్స్ అప్, రమణ, ధనలక్ష్మి ఐ లవ్ యు, మిస్టర్ & మిసెస్ శైలజా కృష్ణమూర్తి, భూకైలాస్, నిన్ను కలిసాక చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రేలంగి నరసింహారావు – కామెడీ ఫిలిం డైరెక్టర్

రాజేంద్ర ప్రసాదుతో పలు హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువగా హాస్య ప్రధానంగా సాగే కధనమే రేలంగి నరసింహారావు గారి చిత్రాలలో కనిపిస్తుంది. పోలీసుగా నరేష్ ని చూపిస్తూ అతని బార్యగా సీతని కలెక్టర్ గా మార్చి పోలీసుభార్య అనే మహిళ కదా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాదుతో ఎదురింటిమొగుడుగా దివ్యవాణిని పక్కింటిపెళ్ళాంగా చూపించి చివరికి ఇద్దరినీ ఒక్కటే చేసే హాస్య చిత్రం ఎదురింటిమొగుడు పక్కింటిపెళ్ళాం నవ్వు తెప్పించే చిత్రం. ఇంకా ఇద్దరు పెళ్ళాల ముద్దులపోలీసు, రొటేషన్ చక్రవర్తి, చిక్కడు దొరకడు, పరుగో పరుగు, సుందరి సుబ్బారావు, పెళ్ళాం చాటు మొగుడు పలు హాస్య కుటుంబ కదా చిత్రాలకు దర్శకత్వం వహించారు.

శ్రీనువైట్ల – కామెడీ, ఫ్యామిలీ, లవ్ డ్రామా ఫిలిం డైరెక్టర్

పెద్ద హీరోలతో కూడా ప్రధానంగా కామెడీ చేయించే దర్శకుడు అంటే శ్రీనువైట్ల, చిరంజీవితో అందరివాడు, నాగార్జునతో కింగ్, వెంకటేష్ తో నమోవేంకటేశా, మహేష్ బాబుతో దూకుడు, ఆగడు, Jr. ఎన్టీఆర్ తో బాద్ షా యాక్షన్ చిత్రాలను హాస్యప్రధానంగా చెప్పే ప్రయత్నంలో విజయవంతం అయ్యారు. మొదట నీకోసం చిత్రంతో దర్శకుడుగా ప్రేమకధను తెరకెక్కించిన శ్రీనువైట్ల ఆనందంతో కామెడీ లవ్ ఎంటర్టైన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకి, డీ, రెడీ, ఆనందం, దూకుడు, బాద్ షా తెలుగు చిత్రాలు దిగ్విజయాన్ని సాధిస్తే, నీకోసం చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.

జి నాగేశ్వరరెడ్డి కామెడీ ఫిలిమ్స్ డైరెక్టర్

6టీన్స్ వెరైటీ పేరుతొ టైటిల్ పెట్టి కామెడీతో కడుపుబ్బా నవ్వించే చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన జి నాగేశ్వరరెడ్డి, రోహిత్ హీరోగా 6టీన్స్, గర్ల్ ఫ్రెండ్, నేను సీతామహాలక్ష్మి, గుడ్ బాయ్ వంటి హాస్య ప్రేమకదా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ హీరోగా సీమశాస్త్రి, సీమటపకాయ్, ఇంట్లో దెయ్యం నాకేం బయ్యం చిత్రాలను డైరెక్ట్ చేసారు. హాస్య, ప్రేమ కదా చిత్రాలను ఎక్కువగా అందించారు. ఇదే నా మొదటి ప్రేమలేఖ, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, కాస్కో, దేనికైనారెడీ, కరెంటు తీగ, ఈడోరకం ఆడో రకం, ఆటాడుకుందాం రా, ఆచారి అమెరికా యాత్ర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇ సత్తిబాబు – JaiChitra Telugu Comdey Hasya Chitra Darshakulu

శ్రీకాంత్, రవితేజ, బ్రహ్మానందం, రోజా, మహేశ్వరీ, కోవై సరళ జంటలుగా తిరుమల తిరుపతి వేంకటేశా చిత్రంతో దర్శకుడుగా పరిచయమై పలు హాస్య ప్రధానంగా సాగే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓ చినదాన ప్రేమకధా చిత్రాన్ని శ్రీకాంత్ హీరోగా తెరకెక్కించి, అల్లరి నరేష్ నేను చిత్రంతో ఒక విబిన్నమైన పాత్రలో చూపించారు. ఒట్టేసి చెబుతున్నా, ఏమండోయ్ శ్రీవారు, వియ్యాలవారి కయ్యాలు, బెట్టింగ్ బంగార్రాజు, యముడికి మొగుడు, జంప్ జిలాని, మీలో ఎవరు కోటీశ్వరులు చిత్రాలను హాస్య ప్రధానంగా కుటుంబ కధలను, ప్రేమకధాలను వెండితెరపై చూపించారు.

శ్రీనివాస్ రెడ్డి కామెడీ ఫిలిమ్స్ డైరెక్టర్

హాస్య కుటుంబ కదా చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, అదిరిందయ్యా చంద్రం చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయ్యారు. శివాజీ, శ్రీకాంత్, తొట్టెంపూడి వేణులు హీరోలుగా కొన్ని కామెడీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. నాగార్జున – అనుష్కలతోతో శివ భక్తి గల డమరుకం చిత్రానికి దర్శకత్వం వహించారు. అదిరిందయ్యా చంద్రం, యమగోల మళ్ళి మొదలైంది, కుబేరులు, బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్, అ ఆ ఇ ఈ, డమరుకం, సింగినాథం జీలకర్ర, బాబురావు నిన్నోదల, దుర్గ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రవిబాబు కామెడీ, లవ్, హారర్ ఫిలిమ్స్ డైరెక్టర్

పలు హాస్య, ప్రేమ, భయానక చిత్రాలను దర్శకత్వం వహించి తెరకెక్కించారు, అయితే మొదట హాస్య ప్రధానంగా సాగే అల్లరి చిత్రంతో దర్శకుడు పరిచయం అయ్యారు. రవిబాబు నటుడు చలపతిరావుగారి అబ్బాయి. ఈవివి సత్యనారాయణ ద్వితీయ కుమారుడిని అల్లరి నరేష్ గా పరిచయం చేసి తానూ దర్శకుడుగా పరిచయం చేసుకున్నారు. అలాగే అల్లరి నరేష్ తో పార్టీ, లడ్డు బాబు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంకా కొత్తవాళ్ళతో అమ్మాయిలు అబ్బాయిలు, నువ్విలా, నచ్చవులే వంటి హాస్యభరిత ప్రేమకదా చిత్రాలను అందించారు. భూమిక ప్రధాన పాత్రలో అనసూయతో అందరిని భయపెట్టి, హారర్ చిత్రాల్లో కూడా మెప్పించే దర్శకుడుగా అవును అనిపించుకున్నారు. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, అనసూయ, నచ్చవులే, అమరావతి, మనసారా, నువ్విలా, అవును, లాడ్డుబాబు, ఆవును2 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కామెడీ చిత్రాలే కాకుండా కుటుంబ, సామజిక, భయానక, ప్రేమ, సాంఘికా కదాంశాలతో నవరస చిత్రాలను అందించే తెలుగు దర్శకులు మనకి చాలామందే ఉంటారు. సందేశాత్మక చిత్రాలు కొన్ని సరదాగా సాగితే, కొన్ని వాస్తవిక పరిస్థితుల ప్రకారంగా సాగుతాయి. పలు రకాల కధంశాలతో కామెడీ ప్రధానంగా వచిన కొన్ని చిత్రాలు అశేష ప్రేక్షకాదరణను పొందాయి. పైన కొంతమంది దర్శకుల గురించి JaiChitra Telugu Comedy Hasya Chitra Darshakulu పోస్టు టైటిల్ గా చెప్పడం జరిగింది. మరికొంతమంది దర్శకుల చిత్రాల తరువాయి జైచిత్ర పోస్టులలో చదవగలరు.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra