Menu Close

Jr.NTR Telugu Movies List Ramanayanam – RRR Movie

Jr.NTR Telugu Movies List Ramanayanam - RRR Movie

Jr.NTR Telugu Movies List Ramanayanam – RRR Movie

Jr.NTR Telugu Movies List Ramanayanam – RRR Movie  బాలనటుడుగా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర లో కనిపించి, బాలనటుడుగా ఉన్నప్పుడే ప్రధాన పాత్రలో రామాయణం చిత్రంలో నటించి, నిన్ను చూడాలని చిత్రంలో యువ కధానాయకుడుగా వచ్చి స్టూడెంట్ నెం.1 చిత్రంతో అందరిని ఆకట్టుకుని, సుబ్బు చిత్రం తర్వాత ఆది, అల్లరి రాముడు నాగ చిత్రాల్లో నటించి, సింహాద్రి చిత్రంతో సంచలనం సృష్టించి, ఆంధ్రవాల అంటూ సాంబ నాఅల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలతో అందరిని అలరించారు. రాఖి, యమదొంగ, కంత్రి, అదుర్స్ అంటూ బృందావనంలో శక్తిగా ఊసరవెల్లిలో దమ్ము చూపించి బాక్స్ఆఫీసు బాద్ షాగా అనిపించుకున్నారు. రామయ్య వస్తావయ్యగా రభస చేసి టెంపర్ గా నాన్నకు ప్రేమతో అంటూ జనతా గారేజ్ అన్న ఎన్టిఆర్ జైలవకుశ చిత్రంలో విబిన్న పాత్రల్లో కనిపించరు. ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవగా రాబోతున్న ఎన్టిఆర్ రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నారు. ‘Jr.NTR Telugu Movies List Ramanayanam – RRR Movie’

బాలనటుడుగా ఉన్నప్పుడే ప్రధాన పాత్రలో రాముడుగా కనిపించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టిఆర్ నిన్ను చూడాలని చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు. Jr. NTR first movie is Ninnu Choodalani as a hero. కాని స్టూడెంట్ నెం.1 చిత్రంలో స్టూడెంట్ పాత్రలో చక్కగా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్ అయితే ప్రపంచ ప్రసిద్ది పొందిన రాజమౌళి మొదటి చిత్రం స్టూడెంట్ నెం.1 కావడం విశేషం.

సుబ్బు చిత్రంలో కూడా స్టూడెంట్ పాత్రలో కాలేజీ బ్యాక్ డ్రాప్ చిత్రంలో నటించిన ఎన్టిఆర్ ఆది చిత్రంతో అందరి దృష్టి బాగా ఆకర్షించారు. ఆది చిత్రంలో స్టూడెంట్ పాత్రలో కనిపించిన ఫ్యాక్షన్ కధలో వీరోచితమైన హీరోగా ఆకట్టుకున్నారు. అమ్మతోడూ అడ్డంగా నరికేస్తాను అనే డైలాగ్ ప్రచారం పొందితే, చిరంజీవితో ఠాగూర్ హిట్ చిత్రం తీసిన అగ్రదర్శకుడు వివి వినాయక తొలిచిత్రం ఆది కావడం విశేషం.

రాజమౌళి దర్శకత్వంలో మూడు చిత్రాల్లో నటించిన ఎన్టిఆర్ స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ

అల్లరి రాముడు చిత్రంలో అంచనాలు అందుకోని నాగ సింహాద్రి చిత్రంతో సంచలనమే సృష్టించారు. అప్పటికి అప్పటివరకు ఉన్న బాక్సాఫీసు రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. దర్శకుడు రాజమౌళికి రెండవ చిత్రంగా ఎన్టిఆర్ కెరీర్ కష్టకాలంలో సూపర్ హిట్ చిత్రంగా సింహాద్రి నిలవడం విశేషం.

అటు తర్వాత అందరిలో అంచనాలు పెంచిన ఆంధ్రావాల అంచనాలను అందుకోలేకపొతే, సాంబ చిత్రంతో సరిపెట్టుకుని నా అల్లుడుగా నరసింహుడుగా నటించిన ఎన్టిఆర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖి చిత్రంలో నటనతో ప్రేక్షకులని మెప్పించారు. తెలుగింటి ఆడపడచులకు అన్నగా, ఆడువారిపై దాడులు చేసే వారిపై ఎదురుదాడి చేసే సందేశాత్మక పాత్రను పోషించారు. Jr.NTR Telugu Movies List Ramanayanam – RRR Movie

రాజమౌళి యమదొంగ చిత్రంలో యమయమగా యముడితో పోటి పడి విజయవంతం అయ్యారు. ఈ చిత్రం పోషియో ఫాంటసీ టైపులో యమలోకం బ్యాక్ డ్రాప్లో అందరిని ఆకట్టుకుంటుంది. కంత్రిలో కనిపించి అదుర్స్ చిత్రంతో అందరితో అదుర్స్ అనిపించుకున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కామెడీగా ఉండి, అందరిని అలరించింది.

బృందావనం కుటుంబ కధా చిత్రంలో నటించి మెప్పించిన ఎన్టిఆర్ ఊసరవెల్లి చిత్రంలో చాలా చక్కగా నటించారు. తరువాత వచ్చిన దమ్ము చిత్రం మంచి టైటిల్ చిత్రంగా మిగిలింది. రామయ్య వస్తావయ్య అంటూ రభస చేసినా టెంపర్ చిత్రాన్ని బాగా ఆదరించారు. టెంపర్ చిత్రంలో కేవలం డబ్బే ప్రధానమని భావించిన పోలీసు, మనిషి చుట్టూ మంచివారు ఉంటే, ఆ మనిషి ఎలా మంచిమనిషి గా మారిపోతారు అనే మాటకు అర్ధం వచ్చేలా నటించారు.

రాఖి, టెంపర్ చిత్రాలలో మంచి అన్నగా గుర్తింపు పొందిన ఎన్టిఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంతో మంచి కొడుకుగా మంచి మార్కులు సాధించారు. తండ్రి కధ విని, దానిని కధగా కొట్టిపారవేయకుండా సాధించి చూపే యువకుడు పాత్రలో ఎన్టిఆర్ నటన అద్బుతంగా ఉంటుంది. ఒక కుటుంబం మంచి మార్గాన్నే ఎంచుకుని ఉంటే వారసులు కూడా సదరు మంచి గుణాలు పుణికి పుచ్చుకుంటారు అనే మాట మాదిరి జనతా గారేజ్ చిత్రం ఉంటుంది. సమాజానికి సేవ చేయడంలో వెనకడుగు వేయని కుటుంబ కధ జనతా గారేజ్ చిత్రం.

జై లవకుశ చిత్రంలో మూడు పాత్రల్లో విబిన్నంగా నటించిన ఎన్టిఆర్ ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్నారు. “Jr.NTR Telugu Movies List Ramanayanam – RRR Movie”.