ఫేమస్ హీరొయిన్ అనుష్క శెట్టి తెలుగులో నటించిన చిత్రాలు

ఫేమస్ హీరొయిన్ అనుష్క శెట్టి తెలుగులో నటించిన చిత్రాలు : తెలుగులో సూపర్ సినిమాతో సూపర్ హాట్ గర్ల్ గా అనుష్క శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో సెకండ్ హీరొయినుగా నటుడు నాగార్జున జతగా నటించింది. యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఎంట్రి ఇచ్చిన అనుష్క మహానందితో మరలా నాగార్జున మేనల్లుడు సుమంతుతో హీరొయిన్ గా జతకట్టింది. తరువాత విక్రమార్కుడు చిత్రంలో రవితేజతో జతకట్టింది. అస్త్రంతో మంచు విష్ణుతో హీరొయిన్ గా నటించి, స్టాలిన్ చిత్రంలో చిరంజీవితో ఒక పాటలో స్టెప్ వేసింది. గోపీచంద్ తో లక్ష్యం వైపు నటించి డాన్, ఒక్క మగాడు, స్వాగతం, బలాదూర్ మళ్ళి గోపీచంద్ తో శౌర్యం చేసింది. వెంకటేష్ తో చింతకాయల రవి చిత్రంలో నటించిన అనుష్క శెట్టి కింగ్ చిత్రంతో మరలా నాగార్జునతో నర్తించింది.

అలా అనుష్క శెట్టి అరుంధతి చిత్రంలో జేజెమ్మగా అందరిని అలరించి, ప్రభాస్ తో బిల్లాకి జోడిగా నటించింది. కేడిలో నటించిన అనుష్క తమిళంలో తెరకెక్కిన చిత్రాలు యముడు, సింగం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఒక రేంజ్ కి వెళ్లి తెలుగు తమిళ భాషలలో గుర్తింపు వచ్చాక కూడా ఒక చిన్న సినిమాలో వేశ్య పాత్రను చేయడం ద్వారా ప్రశంశలు అందుకుంది. అయితే అల్లు అర్జున్ కుడా నటించడంతో ఆ చిత్రం పెద్ద చిత్రంగానే ప్రేక్షకులు ఆదరించారు. పంచాక్షరి నటించిన అనుష్క మహేష్ బాబుతో ఖలేజా చిత్రంలో నటించింది. నాగవల్లి, రగడ, డమరుకం, మిర్చి చిత్రాలలో నటించిన అనుష్క మరలా తమిళ డబ్బింగ్ చిత్రాలు సింగం3, లింగా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించింది.

అనుష్క శెట్టి నటించిన జోడిలలో గుర్తింపు జోడీగా ముందు నాగార్జునతో ప్రసిద్ది చెంది, తరువాత ప్రభాస్ తో సూపర్ జోడీగా ప్రసిద్దికి ఎక్కింది. నాగార్జునతో సూపర్, డాన్, కింగ్- ఒక పాట, కేడి – ఒక పాట, రగడ, డమరుకం, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి చేస్తే ప్రభాస్ తో బిల్లా, మిర్చి, బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లుజన్ చిత్రాలలో నటించింది. రుద్రమదేవి, సైజు జీరో, ఓం నమో వేంకటేశాయ, భాగమతి చిత్రాలలో నటించింది.

అందంలోను అభినయంలోను మంచి గుర్తింపు పొందిన నటి, తెలుగులో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. అటువంటి చిత్రాలలో అతిపెద్ద హిట్ బాహుబలి సీక్వెల్ చిత్రాలు. రుద్రమదేవి చిత్రంలో మెయిన్ రోల్ చేసి అందరిని ఆకట్టుకుంది. అలాగే సైజు జీరో చిత్రంలో ఒక లావుపాటి అమ్మాయి వేషంలో సమాజంపై పోరాటం చేసే ఆడపిల్లగా అందరిని మెప్పించింది. తెలుగు తమిళ భాషలలో ప్రముఖుల దర్శకత్వంలో నటించింది. ఇవి ఇప్పటివరకు ఫేమస్ హీరొయిన్ అనుష్క శెట్టి తెలుగులో నటించిన చిత్రాలు.

సూపర్ తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: పూరి జగన్నాద్

మహానంది తెలుగు చిత్రం

హీరో: సుమంత్
దర్శకుడు: వి. సముద్ర

విక్రమార్కుడు తెలుగు చిత్రం

హీరో: రవితేజ
దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి

అస్త్రం తెలుగు చిత్రం

హీరో: విష్ణు మంచు
దర్శకుడు: సురేష్ కృష్ణ

స్టాలిన్ తెలుగు చిత్రం

హీరో: చిరంజీవి
దర్శకుడు: ఏఆర్ మురుగుదాస్

లక్ష్యం తెలుగు చిత్రం

హీరో: గోపీచంద్
దర్శకుడు: శ్రీవాస్

డాన్ తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: రాఘవ లారెన్స్

ఒక్క మగాడు తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: పూరి జగన్నాద్

స్వాగతం తెలుగు చిత్రం

హీరో: జగపతిబాబు
దర్శకుడు: దశరద్

బలాదూర్ తెలుగు చిత్రం

హీరో: రవితేజ
దర్శకుడు: ఉదయశంకర్

శౌర్యం తెలుగు చిత్రం

హీరో: గోపీచంద్
దర్శకుడు: శివ

చింతకాయల రవి తెలుగు చిత్రం

హీరో: వెంకటేష్
దర్శకుడు: యోగి

కింగ్ తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: శ్రీను వైట్ల

అరుంధతి తెలుగు చిత్రం

హీరో: మెయిన్ రోల్
దర్శకుడు: కోడి రామకృష్ణ

బిల్లా తెలుగు చిత్రం

హీరో: ప్రభాస్
దర్శకుడు: మెహర్ రమేష్

యముడు తెలుగు చిత్రం

హీరో: సూర్య
దర్శకుడు: హరి

వేదం తెలుగు చిత్రం

హీరో: క్యారెక్టర్
దర్శకుడు: క్రిష్

పంచాక్షరి తెలుగు చిత్రం

హీరో: మెయిన్ రోల్
దర్శకుడు: వి సముద్ర

ఖలేజా తెలుగు చిత్రం

హీరో: మహేష్ బాబు
దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్

నాగవల్లి తెలుగు చిత్రం

హీరో: వెంకటేష్
దర్శకుడు: ఫై వాసు

రగడ తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: వీరు పోట్ల

డమరుకం తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: శ్రీనివాస రెడ్డి

మిర్చి తెలుగు చిత్రం

హీరో: ప్రభాస్
దర్శకుడు: కొరటాల శివ

సింగం 2 తెలుగు చిత్రం

హీరో: సూర్య
దర్శకుడు: హరి

లింగా తెలుగు చిత్రం

హీరో: రజనికాంత్
దర్శకుడు: కెఎస్ రవికుమార్

బాహుబలి బిగినింగ్ తెలుగు చిత్రం

హీరో: ప్రభాస్
దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళి

రుద్రమదేవి తెలుగు చిత్రం

హీరో: మెయిన్ రోల్
దర్శకుడు: గుణ శేఖర్

సైజు జీరో తెలుగు చిత్రం

హీరో: ఆర్య
దర్శకుడు: ప్రకాష్ కోవెలమూడి

సోగ్గాడే చిన్ని నాయన తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: కళ్యాణ్ కృష్ణ కురసాల

ఊపిరి తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: వంశీ పైడిపల్లి

ఓం నమో వేంకటేశాయ తెలుగు చిత్రం

హీరో: నాగార్జున
దర్శకుడు: కె రాఘవేంద్రరావు

బాహుబలి 2తెలుగు చిత్రం

హీరో: ప్రభాస్
దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళి

భాగమతి తెలుగు చిత్రం

హీరో: టైటిల్ రోల్
దర్శకుడు: జి అశోక్

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra