BhaktiChitra

BhaktiChitra Bhavame Balam- భక్తిచిత్ర

BhaktiChitra Bhavame Balam (Devotional Telugu Movies) తెలుగు భక్తి చలన చిత్రాలు. జీవితంలో జీవిని వేదనలు వేదిస్తున్నప్పుడు సమస్యలకు పరిష్కారం దొరకనప్పుడు ? అన్ని సమయానికి సమకూరుతు సమస్యలు లేని జీవనం సాగించేవారు కొంతమంది ఉంటారు. ఎదో ఒక సమస్యతో జీవితంలో లోటుగా భావించేవారు. ఏదో ఒక విధంగా భగవంతుడిని తలచుకునే వారే అంతా.

ఒక్కొక్కరికి ఒక్కో భగవానుడిపై నమ్మకం కలిగి భక్తి ఏర్పడుతుంది. భగ్న ప్రేమికుడుకి తన ప్రియురాలు తప్ప అతనికి ఏమి కనబడదట. ఆమె ధ్యాసతో నిత్యం ఆలోచనలు ఆమెపై చేస్తూ ఆమె అతని అంతా అన్నట్టు ఉంటుందట. ఒకరు ఒక విషయం గురించి ఆలోచన చేస్తూ, చివరికి ఆ విషయం లోటుపాట్లు తెలుసుకుని ఆ విషయంలో రాబోయే విశేషాలు కూడా ఊహించగలరట.

కొంతమంది భక్తులు ప్రకృతిలో కనబడే ప్రతి విషయాన్నిభగవానుడిగానే భావిస్తారట. వారి జీవితంలో సంభవించే విశేషాలన్నీ భగవంతుడి అనుగ్రహంతోనే కలిగినట్టు భావించే భక్తులు చాలామందే ఉంటారు. ఏదైనా మనిషికి బౌతికంగా కనిపించే విషయాలలో సాధించలేనిదిగా ఒక విషయం ఉన్నప్పుడు, దానిపై సాధనకు ప్రయత్నం చేస్తూ, భగవానుడిని వేడుకుంటూ భక్తిగా సాధించుకునేవారు ఉంటారు. ఆ కారణం చేతననో అనేక దేవాలయాలలో భగవానుడిని దర్శించుకునేవారు అత్యధికం.

నిత్యతృప్తుడు, ఎప్పుడూ అనవసరంగా ఇతరుల జోలికి పోకుండా, తన ప్రయత్నం తాను చేసుకుంటూ, జీవితాన్ని సాధించుకునేవారు ఉంటారు. వారికి ధృడమైన మానసిక శక్తి వలననమో అని అంటారు. కష్టాలలో కూడా మనసు స్థైర్యం కోల్పోకుండా సమస్యలను పరిష్కారంవైపు తీసుకువెళ్ళడంలో దైవం అనేకరకాలుగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని మనకి అనేక భక్తి చిత్రాలు వీక్షించడం వలన ఏర్పడుతుంది.

ఒక వ్యక్తి చుట్టూ ధైర్యవంతుడు ఉంటాడు. బీరువు ఉంటాడు. తనని నమ్మినవారు ఉంటారు. తనని నమ్మని వారు ఉంటారు. తనపై శత్రుత్వం పెట్టుకునేవారు ఉంటారు. చీటికిమాటికి తగువులు ఆడేవారు ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఏదైనా దుఃఖసంఘటన జరిగినప్పుడు ఓదార్చేవారుంటారు. అన్నింటిని సహాయంగా ఉండే స్నేహితులు ఉంటారు. ఇంకా బందువులు ఉంటారు. తనచుట్టూ ఏర్పడిన బంధాలు భగవంతుడి వలననే ఏర్పడినట్టు భావిస్తూ ఉంటారు.

BhaktiChitra Bhavame Balam – భక్తిచిత్ర

అంతమంది పరిచయం తానూ కావాలని ఎంతమందితో పరిచయం పెంచుకున్నట్టు, అప్రయత్నంగా పరిచయం ఎంతమందితో ఏర్పడింది, అప్రయత్నంగా తగువుపడేవారు ఎందుకు తారసపడినట్టు. అయాచితంగా ఇతరుల నుండి సహాయం పొందడం, అప్రయత్నంగా ఇతరులకు సహాయం చేయగలగడం. ఒక్కొక్కరికి ఎప్పుడైనా ఎక్కడైనా ఇతరులకు సహాయం చేస్తూనే ఉండే గుణం. ఒక్కొక్కసారి బందుత్వం శత్రుత్వంగా మారడం, శత్రుత్వం స్నేహంగా మారడం, స్నేహం శత్రుత్వంగా మారడం జరుగుతూ ఉండవచ్చు. అప్రయత్నంగా వచ్చేవి భగవంతుడి కారణంగా చెబుతూ ఉంటారు భక్తులు.

ఒక వ్యక్తి తన జీవితంలో తరిచి చూస్తే ఎదో ఒకచోట ఎదోఒక సమయంలో ఎప్పుడోఒకప్పుడు అప్రయత్నంగానో, అయాచితంగానో లాభపడటమో, నష్టపోవటమో జరుగుతూ ఉంటుంది. ఇలా తన ప్రయత్నం లేకుండా జరిగే విషయాలను ప్రకృతిశక్తి కారణం అవుతుంది అని చెబుతూ ఉంటారు. అలాంటి ప్రకృతి శక్తిని భగవానుడిగా లేక దేవతాశక్తిగా కొలవడం దేశకాలాలను బట్టి మారుతూ ఉంటుంది. ముందుగా ప్రకృతితో సహవాసం చేసిన మనిషే భగవానుడి గురించి కనుగొని ఉంటే, ఆ భగవానుడిలో చాలా విధాలుగా పూజించేది మనిషే. భక్తితో ఉండేది, భక్తిలో రకాలుగా భావించేది, భగవానులలో తేడాలు భావించేది మనిషే. భక్తి చిత్రాలు చుస్తే, వాటిలో బేధాభిప్రాయాలు లేని మర్మం గ్రహిస్తే సత్యం ఏమిటో ఆలోచనపరులకి అవగతం అవుతుంది.

ఎవరైనా ఒక విద్యార్ధి ఒకరంగంలో నెంబర్ వన్ కావాలనే తపనతో నిత్య ఆ రంగానికి సంభందించిన విషయాలపై ఆలోచనలతో నిత్య ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకనాటికి ఆ విధ్యార్ది ఆ రంగంలో అనుకున్న స్థానానికి చేరుతాడు. అలాగే జీవితంలో ధర్మబద్దంగా తల్లిదండ్రుల నుండి సంక్రమించిన ఆస్తి, ఆచారం పట్టుకుని, తల్లిదండ్రులు నేర్పించిన విద్య ఆధారంగా ఆ అర్హతతో లభించిన పనిని చేసుకుంటూ నిత్య త్రుప్తుడై ఉన్నవారు ఇంటిలో భగవానుడికి ఒక నమష్కారం భక్తితో చేసి ఒక ఫలం శ్రద్ధతో సమర్పించినా చాలునని భగవానుడు గీతలో చెప్పారు. అతను తన జీవన గమ్యం చేరతాడు.

కాదు ఇతరులతో పోల్చుకున్నప్పుడు తనకు లేనిది ఇతరులకు ఉన్నప్పుడు మనిషి మనసు ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటే, అది కోరికగా రూపాంతరం చెంది, దుఃఖహేతువు అవుతుంది. ఇకా ఆ కోరిక కోసం ప్రయత్నం చేయడంలో శ్రద్ధ లోపిస్తే, నిరుత్సాహం ఏర్పడే అవకాశం ఆ కోరిక అవసరమైనదా లేకా ఇంకా ఎదో కావాలని బయలుదేరినిదా అని ఆలోచన చేయాలనీ అంటారు. తనకుతానుగా కాకుండా ఇతరులచేత ప్రేరిపింపబడి, తనవారికి అంటే తనపై ఆధారపడిన వారికి అవసరమైనది, అయితే అది ధర్మబద్దమైనదిగా ఉంటే, ఆ కోరికను భగవానుడు తీరుస్తాడు అని చెబుతారు. కొన్ని భక్తి చిత్రాలు గమనిస్తే అర్ధం అవుతుంది.

BhaktiChitra Bhavame Balam – భక్తిచిత్ర

ఎప్పుడూ పుస్తకాలతో చదివే వ్యక్తి మరో పుస్తకంలో బాగా వ్రాయగలుగుతాడు. ఎప్పుడు పుస్తకాలు చదువుతూ, తోటివారితో సదరు పుసకంపై చర్చించిన వ్యక్తి, వేరొక చోట బాగా వ్రాయడంతో బాటు నలుగురిలో ప్రశ్నించినా సమాధానం ఇవ్వగలుగుతారు. అలాగే పుస్తకం చదవడం, తోటివారితో చర్చించడం చేస్తూ, పుస్తకంలో ఉన్న విషయం ప్రకృతిలో ఏర్పడిన పరిస్థితులు గమనించిన వారు ఇంకొకరికి మార్గదర్శకంగా ఉండగలరు. కొత్త పుస్తకం రచన చేయగలరు. ఆలోచన మనిషి ఆవేశాన్ని అదుపుచేస్తూ జ్ఞానంవైపు కదిలిస్తే, మూర్ఖత్వం తప్పులు ఎంచుతూ చివరికి వాటితో మనసుని మమేకం చేస్తుంది. వివేకం ఆలోచనను పెంచితే, మూర్ఖత్వం తెలిసినదే కచ్చితం అంటూ ఉంటుంది. భక్తి అయితే మూర్ఖత్వంలో కూడా తప్పులు చేయకుండా పరిమితులు ఉండేవిధంగా పరిస్థితులు కల్పిస్తున్నట్టుగా కొన్ని భక్తిచిత్రాలను చుస్తే అర్ధం అగును.

అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుంటే చివరికి ఆ మనిషి పనులు ఎలా చేయాలి అని ఒక పుస్తకమే వ్రాసేస్తారు. తానూ అనుసరించిన విధానాలతో ఊహలతో రచనచేసి పుస్తకం వ్రాసేస్తారు. విమర్శకులు ఆ పుస్తకం కచ్చితం అయితే చదివిన వారంతా కచ్చితంగా విజయవంతం అవ్వాలి కదా అంటారు. వ్రాసిన వారు వారికీ శ్రద్ధ లేదు అందుకే విజయవంతం కాలేకపోయారు అని చెబుతారు. ఇక్కడ తన చేసిన పని పూర్తీ విజయవంతం అయినపుడు ఇతరులు చేయలేక పోయారు అంటే, అందులో కాలం, ప్రదేశం చాలా ముఖ్యపాత్రను పోషిస్తాయి. అయితే కాలం భగవంతుడిగా చెబితే, ప్రదేశం వ్యక్తి కర్మను చేసేదిగా చెబుతారు. ఒక వ్యక్తికి పుస్తకం రాసే అంత గొప్పగా పనులలో విజయవంతంగా ఉండే, కాలం ఇతరులకు ఎదో ఒక విషయంలో మాత్రమే సహకారిగా ఉన్నట్టు ఉంటుంది. కాలంలో కలిగే కష్టాలకు మహారాజులు కూడా తలవంచాల్సిందే అని కొన్ని భక్తి చిత్రాలు చూస్తే తెలియవస్తుంది.

తెలిసిన విషయం ఎలా తెలిసిందో గుర్తు ఉంటే, వేరే విషయం తెలుసుకున్నప్పుడు ఇంతకుముందు విషయానికి ఇప్పుడు తెలుస్తున్న విషయానికి బేధం తెలిసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా తెలిసిన విషయం తెలిసిన విధానం మరిస్తే, ఇంకొక విషయం ఉంది అనే మాటే ఒప్పబడదు ఆ మనసుకి. కొత్తది అయినా బాగా పాతది అయినా ఇంకొకటి ఉంది అంటే, లేదని చెబుతుంది. తెలిసిన విషయం ఉంది అని అంది అంటే ఆ విషయం మనసు అయ్యింది అని, అయితే మనసు చుట్టూ ఎన్ని విషయాలు ఉంటే అన్ని విషయాలలోనూ తెలిస్తే సందేహం లేని జీవితం శేషం లేకుండా ఉంటుంది. అయితే ఒక మనసు తన చుట్టూ ఉన్న అన్ని విషయాలలో జ్ఞానం కలిగి వైరాగ్యం అంటే తలకుమించిన పనిగా ఉండి, అది భగవానుడిపై ఉంచితే ఎదోక రూపేణ భగవానుడు పూర్తీ జ్ఞానం ఇస్తారు అని అంటారు. కొన్ని భక్తి ప్రవచనాలు వింటే అవగతం అయ్యే అవకాశం ఉంటుంది.

BhaktiChitra Bhavame Balam – భక్తిచిత్ర

JaiChitraBhaktiChitraPage

ధర్మం అంటే ఏమిటి ? తాను జీవిస్తున్న విధానం ధర్మపరమైనదా కాదా అనేది ఆ వ్యక్తి కుటుంబ ఆచార వ్యవహారాలను బట్టి ఉంటే, కొంతమంది పుస్తకాలూ లేక పెద్దలను అడిగి తెలుసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ధర్మం గురించి తెలుసుకోవడం లేకా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడం భగవానుడి లీలలుగా చెబుతారు. కొన్ని భక్తి చిత్రాల వీక్షణ సహాయపడవచ్చు.

కష్టాలు లేవు అన్ని వున్నాయి కానీ మనసుకు శాంతి లేదు అంటే ఆ మనసు తెలుసుకోవలసినది ఎదో ఉంది, అది తెలుసుకునేవరకు ఆ మనసుకు శాంతి ఉండదు. ఆ వ్యక్తి మనసు సంపూర్ణ జ్ఞానం వైపువెళ్ళడం, అటువంటి పరిస్థితికి కారణం భగవానుడి లీలలుగా చెబుతారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మొదలైన యోగుల జీవన విధానం గురించి తెలుసుకుంటే అవగతం అవుతుంది.

ఎప్పుడూ ప్రకృతిలో ఒకే వాతావరణం ఉండదు, ఎప్పుడు ప్రేమ ఒకలాగే ఒక్కరికే పరిమితం కాదు. అలాగే భగవానుడు అందరిని ఒకే విధంగా అనుగ్రహించడానికి, మారే గుణం కలిగిన ప్రకృతి ఒప్పబడదు. కారణం పూర్వజన్మ ఫలం అవ్వవచ్చు లేక పుట్టిన ప్రదేశ పరిస్థితులు కావచ్చు. కానీ నమ్మినవారికి భగవానుడి అనుగ్రహం ఎదోఒకవిధంగా ఉంటుంది అని కొన్ని భక్తి చిత్రాల వీక్షణలో చూడవచ్చు.

ఎన్నో రూపాలలో కనిపించే భగవానుడు అన్నింటా అంతటా ఉన్నానని, తెలియగోరు వారికి వారి ప్రయత్న ఫలితంగా తెలియవస్తున్నానని భగవానుడు అనేక మంది భక్తులకు సందేశంగా చెప్పినట్టు భక్తిచిత్రాలలో చెప్పబడుతూ ఉంటుంది. ఒక్కమనసు ఏదైనా పనిలో జ్ఞానం సంపాదించాలంటే ఎంతో ప్రయత్నం కొంతకాలం అవసరం. మరి భగవానుడు ఎలా అంతటా ఉండగలదు అన్నవారు లేకపోలేదు. అయితే అదే వారు ఇప్పుడు టెక్నాలజీని చూసి ముక్కున వేలువేసుకుంటూ మనిషి మేధకు ముచ్చట పడుతూ ఉంటారు. కనిపించే ప్రకృతి కానరాని అప్రాకృత లోకం మనిషిని చాలాసార్లు గందరగోళంలో ముంచెత్తితే, కొన్ని భక్తి చిత్రాలు ప్రవచనాలు వారికి బాసటగా నిలుస్తూ ఉంటాయి.

బలం ఉన్నవాడు భరిస్తాడు అంటారు, సంపూర్ణ జ్ఞానం బలం ఉన్నవారు ఇంకెంత బరించగలరో ఆ సంపూర్ణజ్ఞానికి వారితో మాట్లాడిన వారికే తెలియాలి కానీ సామాన్యులకు గందరగోళ పరిస్థితులు కలిగేల మాట్లాడరాదు. ఇది సామజిక సాంఘిక కనీస ధర్మంగా చెబితే, అది తెలియని వారు సమాజంలో ప్రసిద్ద వ్యక్తిగా ఉంటే అది ఆ సమాజం యొక్క దురదృష్టమే అవుతుంది. ఇక్కడ సామాన్య వ్యక్తికి భక్తి, భగవానుడే గతి అవుతున్నారు.

BhaktiChitra Bhavame Balam – భక్తిచిత్ర

ఒక కుటుంబంలో పెద్ద అయిన వ్యక్తి తనను తనపై ఆధారపడిన వారు అనుసరిస్తారు అని అతనకి చెడు అలవాట్లు ఉంటే మానుకోవడమో, లేక తెలియకుండా చేయడమో చేసే స్థితిలో ఆలోచన చేస్తే, మరి సంఘంలో పెద్దమనిషిగా ఉండేవారిని ఎంతమంది అనుసరించవచ్చు, ఎంతమందిని అతని మాటలు ప్రభావితం చేయవచ్చు. అనేది వారి విజ్ఞతకే తెలియాలి. ఒకవేళ ఇలాంటి వారు ఉన్న సమాజంలో సామాన్యుల జీవితం ఉండి ఉంటే, అటువంటి వారి సామాన్యుల జీవితం గతితప్పకుండ భక్తిలో ఉండే కనీస ధర్మాలు కాపాడతాయి. కొన్ని భక్తి చిత్రాలు చూస్తే అవగతం కావచ్చు.

భక్తి అవసరమా కాదా అనేవిషయాలలో కూడా కొన్ని భక్తి చిత్రాలలో మహిమల ద్వారా చెప్పే చిత్రాలు ఉంటాయి. అయితే భగవానుడు ఎందుకు మహిమలు చూపి భక్తులను ఆకర్షించడం అంటే, అది ఆకర్షించడం కాదు అటువంటి భగవానుడి మహిమలు విన్న మనసు గందరగోళ పరిస్థితిలో స్థిమితంగా ఉండడానికి, అలా మనసు స్థిమితంగా ఉంటే, భగవదనుగ్రహంగా చెప్పే బుద్ది కచ్చితంగా వ్యవహిరించి మనిషిని కాపాడుతుంది అని కొందరు చెబుతారు.

భగవానుడు ప్రకృతిలోను అందరిలోనూ ఉన్నప్పుడు కష్టాలెందుకు అంటే, అందరూ చేసేపని తానూ చేస్తూ అందరు తృప్తిగా ఉన్నా తృప్తిలేని జీవి ఇంకేదో కావాలని ప్రకృతిని పాడుచేసి ఉపయోగించడం వలన అనేకమంది ప్రభావితం అవుతారు. అందరి ఉసురు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అనుభవించాలి కదా ! అలాంటి వారిలో ఆ వ్యక్తి ఉండవచ్చు లేదా ఆ వ్యక్తికి సంభందించిన వారు ఉండవచ్చు. అప్పుడు కష్టాలుగా అనుభవించాల్సి రావడం కర్మ అయితే ఆ కర్మకు అధికారి భగవానుడు అంటారు.

అయితే కుటుంబంలో ఒకరికి పాపం ఉంటే, ఎందుకు అందరికి అంటే ? కుటుంబంలో ఒకరు తాగుబోతే అయితే పలానా వారి కుటుంబంలో తాగుబోతు అని పేరు ఆ కుటుంబానికి కూడా వస్తుంది. అలాగే ఒక కుటుంబంలో ఎవరైనా ఒక మంచి పనిచేస్తే పలానా కుటుంబంలో వ్యక్తి ని పొగుడుతుంది ప్రకృతి. అంటే మంచిచెడులు ఎలా ఆ వ్యక్తి వ్యక్తికి సంభందించిన కుటుంబానికి సంబోదిస్తారో గతజన్మ కర్మలు కూడా అంతే అన్నట్టు కొన్ని భక్తి చిత్రాలు, పుస్తకాలూ, ప్రవచనాలు వింటే అవగతం అవుతుంది.

BhaktiChitra Bhavame Balam – భక్తిచిత్ర

చదువుంటే వచ్చేది విషయ జ్ఞానం భక్తి ఉంటే వచ్చేది వినయం, విధేయత, సామజిక భాద్యత మరెన్నో మంచి విషయాలు అబ్బుతాయని అంటారు. సమాజంలో సమతుల్యం ఎప్పుడు ఉండాలి అంటే భక్తి ఒక సాధనంగా కూడా చెబుతారు, అందుకేనేమో మతాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అయితే భగవానుడు ఒక్కడే ఒక విధానం వలను ఒకరు తరిస్తారు అంటారు. మధ్యలో మారితే పరమావధి రాదు అని నమ్మిన సిద్ధాంతం ఎప్పుడు ప్రకృతి పరీక్షిస్తుంది, పరీక్షలో నీ సిద్ధాంతం పట్టుకుని ఉంటే నేను తెలియబడవచ్చు, లేకపోతే నీవు మరలా ఇంకో ప్రకృతి పరీక్షకు సిద్దం కావాలి, అలా మారుతూ ఉంటే ఉన్న కాలం కరిగిపోతే మరో అవకాశం కాలమే కలుగజేయాలి కాబట్టి. నీకు నీ కుటుంబం నుండి సంక్రమించిన ధర్మం, ఆచారం పట్టుకుని పరీక్షలో నెగ్గు జీవితాని సాధించు అనే విషయం కొన్ని భక్తి చిత్రాలు, భక్తి పుస్తకాలు, ప్రవచనాలు, చూసి, చదివి, విని ఆలోచనలో మమేకం అయితే అవగతం అవుతుంది.

పుస్తకం పూర్తిగా చదివినవారు మెల్లగా పరీక్షా పూర్తిగా వ్రాసి వచ్చేస్తే సగం చదివినవారు పరీక్షా హాలు వరకు సందేహాలు అడుగుతూనే, ఆలోచన చేస్తూనే ఉంటారు. ఏదైనా పూర్తీ అవగాహనా బలాన్ని ఇస్తే, అవహగానారాహిత్యం బలహీనతను బయటపెడుతుంది. భక్తి చిత్రాలు చూడాలి, భగవంతుడి గూర్చి నిజమైన ఆలోచన చేయాలి, భగవంతుడు అంటే భయం పోయి ప్రేమ కలగాలి. భగవంతుడే అంటే సందేహం కోల్పోయి సమన్వయం కలగాలి.

ఇందుకలడని అందుకలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే కలదు చక్రి, అని పలికిన ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుడి తండ్రి శ్రీహరి దగ్గరి వారేనని జయవిజయుల కధ వింటే అర్ధం అవుతుంది. జీవితం నాటకం అయితే అది భగవానుడి లీలలో భాగమే అవుతుంది. జీవితం మనం చేసుకున్న ఫలితమే అయితే జయవిజయుల అత్యుత్సాహ ఫలితమే అవుతుంది. అంటే జయవిజయులు శ్రీమహావిష్ణువు దగ్గర ద్వారా పాలకులు అయితే అక్కడికి సనకసంద మునులు వస్తారు. వారు జ్ఞానులు.

అంటే సనకసనంద మునులు భగవానుడు అంతటా ఉన్నవారే అని తెల్సి కూడా శ్రీమహావిష్ణువుని వెతుక్కుంటూ వెళ్లారు అంటే, మర్మం భగవానుడి ద్వారా పాలకులకు పరీక్షా కాలమే. ఆ పరీక్షలో వారి పని ద్వారం దగ్గర నిలబడడమే ఉపద్రవం వస్తే చెప్పాలి కానీ బందువులు వస్తే అడ్డుపడకూడదు ద్వారా పాలకులు. కానీ ఇక్కడ జయవిజయులు అడ్డు పడ్డారు. అయితే వచ్చినవారు శ్రీమహావిష్ణువుకి భక్తులు, భగవానుడికి భక్తులు ఎప్పుడు బందువులే. మరి బంధువులను అవమానిస్తే యజమాని ఊరుకుంటాడా ఫలితం పొందేవరకు వేచి చూసి పరిష్కారం చెబుతారు కానీ ఆపరు.

BhaktiChitra Bhavame Balam – భక్తిచిత్ర

తత్ఫలితం జయవిజయలు బద్దవిరోధులుగా రాక్షసులుగా జన్మించారు భూలోకంలో. ఏవిధంగా చూసినా కధ ప్రారంభం భగవానుడి దగ్గరే కానీ నాటక పాత్రలు చేరింది భూలోకానికి. పొరపాటు ఫలితం అనుభావేద్యకం అందుకే భగవానుడు తనని నమ్మిన వారికి ఫలితప్రభావం తగ్గిస్తూ నాటకాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకు అంటే. ఒక్కరు కాదుగదా భగవానుడికి బందువులు అందరు బందువులే కదా నమ్మినవారిని వారి కోరిక అనుసారం తొందరగా అనుగ్రహించాలి నమ్మనివారిని వారి కర్మరిత్యా అనుగ్రహించాలి.

అనుకూలంగా అన్వయించుకుంటే జీవితమంతా సమన్వయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అదే భక్తిలో అనుకూలంగా అన్వయించుకుంటే జీవిత పరమర్ధమే సిద్దించవచ్చు. భక్తి చిత్రాలు సానుకూలంగా ఎవరి కుటుంబ ఆచారానికి సంభందించిన ఆ దైవ చిత్రాల వీక్షణ మనసుకు బలం అవుతుంది. మనకోసం మనం జీవిస్తున్నప్పుడు మనవ్యావహారిక ఆచార దైవమే కాపాడుతుంది.

ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండడం వలన యూట్యూబ్ మొబైల్ ఆప్స్ ద్వారా చిత్రాల వీడియో వీక్షణ అవకాశం ఉంటుంది. పాత తెలుగు భక్తి చిత్రాల వీడియోలు ఉచితంగా యూట్యూబ్లో వీక్షించగలం.

ధన్యవాదాలు
జైచిత్ర – JaiChitra